‘నర్తనశాల’: అర్జునుడిగా బాలయ్య

nandamuri balakrishna narthanasala first look unveiled
nandamuri balakrishna narthanasala first look unveiled
Spread the love

‘నర్తనశాలచిత్రం నుండి అర్జునుడిగా నందమూరి బాలకృష్ణ ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల‌. నందమూరి బాలకృష్ణ స్వీయ దర్శకత్వంలో ప్రారంభ‌మైన పౌరాణిక చిత్రంన‌ర్త‌న‌శాల`. అర్జునుడిగా బాలకృష్ణ, ద్రౌపదిగా సౌందర్య, భీముడిగా శ్రీహరి, ధర్మరాజుగా శరత్ బాబు నటించిన ఈ చిత్రంలోని దాదాపు 17 నిముషాల నిడివి ఉన్న సన్నివేశాలను విజయదశమి కానుక‌గా శ్రేయాస్ ఈటి ద్వారా ఎన్‌బికె థియేటర్ లో ఈ నెల 24న తిలకించే అరుదైన అవకాశం కల్పిస్తున్నారు న‌ట‌సింహ‌ బాలకృష్ణ .

తాజాగా న‌ర్త‌నశాల నుండి నందమూరి బాల‌కృష్ణ‌కి సంబంధించిన ఫ‌స్ట్ లుక్ ని ఈ రోజు విడుద‌ల చేశారు. ఇందులో అర్జునుడిగా బాల‌య్య లుక్ అభిమానుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోంది. ఈ చిత్రం ద్వారా వసూలైన మొత్తంలో కొంత భాగం సేవా కార్యక్రమాలకు ఉపయోగించనున్నారు. మ‌రో పౌరాణిక పాత్ర‌లో బాల‌య్య‌ని చూసేందుకు అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.

‘‘నాకు అత్యంత ఇష్టమైన చిత్రం నాన్నగారి నర్తనశాల. ఆ చిత్రాన్ని నా దర్శకత్వంలో ప్రారంభించిన విషయం తెలిసిందే.ఎంతో కాలంగా మీరు ఆ చిత్రం కోసం చిత్రీకరించిన సన్నివేశాలను చూడాలన్న ఆసక్తిని చూపిస్తున్నారు. మీ అందరి కోరికపై ఈ నర్తనశాల చిత్రానికి సంబంధించి 17 నిముషాల నిడివి ఉన్న సన్నివేశాలను ఈ విజయదశమి కానుకగా ఎన్ బి కె థియేటర్ లో శ్రేయాస్ ఈటి ద్వారా విడుదల చేయడం జరుగుతుంది. అర్జునుడిగా నేను, ద్రౌపది గా సౌందర్య, భీముడిగా శ్రీహరి, ధర్మరాజుగా శరత్ బాబు గారు కనిపిస్తాము. ఈ చిత్రం ద్వారా వసూలైన మొత్తంలో కొంత భాగం చారిటీస్ కి ఉపయోగించడానికి నిర్ణయించుకున్నాను. ఎన్నాళ్ళనుండో నర్తనశాల సన్నివేశాలను చూడాలన్న మీ కోరిక ఈ నెల 24 న నెరవేరబోతోంది.

మీ
నందమూరి బాలకృష్ణ’’