ముఖేష్‌ గౌడ్‌ కుమారుడు విక్రమ్ గౌడ్ కాంగ్రెస్ లో చేరిక !!!

Mukesh Goud's son Vikram Goud joins Congress!!!
Spread the love

ముఖేష్‌ గౌడ్‌.. పరిచయం అవసరం లేని పేరు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌ తరపున హైదరాబాద్‌ నుంచి మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన నాయకుడు. తండ్రి బాటలోనే రాజకీయాల్లోకి వచ్చిన ఆయన కుమారుడు విక్రమ్‌ గౌడ్ కూడా అందరికి సుపరిచితమే. ఏమీ ఆశించకుండా బీజేపీ కోసం విక్రమ్‌ గౌడ్‌ పని చేశారు. తనకు సరైన గుర్తింపు లభించలేదనే కారణంగానే బిజెపికి రాజీనామా చేశారు విక్రమ్ గౌడ్. ఇదిలా ఉండగా.. విక్రమ్‌ గౌడ్‌ త్వరలోనే కాంగ్రెస్‌ పార్టీలో చేరబోతున్నారు. విక్రమ్ గౌడ్ తన సొంత గూడు అయిన కాంగ్రెస్ లోకి పిసిసి అద్యేక్షుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో చేరబోతున్నారు. తెలంగాణలో బీసీ నేతగా సుదీర్ఘకాలం పాటు నాయకుడిగా ఉన్న ముఖేష్ గౌడ్ గారి కుమారుడు విక్రం గౌడ్ కాంగ్రెస్లో చేరడం ఒకసారిగా బీసీల నుంచి సపోర్ట్ బాగా పెరిగినట్లుగా అర్థమవుతుంది. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసి గెలిచే అవకాశం విక్రమ్ గౌడ్ గారికి కూడా ఉన్నదని తెలుస్తోంది. బలమైన సామాజిక వర్గం కావడం ఆర్థికంగానూ బలంగాను ఉండటం వల్ల ముఖేష్ గౌడ్ వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసే అవకాశం కచ్చితంగా కనిపిస్తుంది.

Related posts

Leave a Comment