(చిత్రం : మిరాయ్, విడుదల : 12 సెప్టెంబర్ 2025, రేటింగ్ : 3.5/5 నటీనటులు: తేజ సజ్జ, రితిక నాయక్, మంచు మనోజ్, శ్రియా శరన్, జగపతిబాబు, జయరాం, గెటప్ శీను, పవన్ చోప్రా, తంజా కెల్లర్ తదితరులు , ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్, సినిమాటోగ్రఫీ: కార్తీక్ ఘట్టమనేని, సంగీతం: గౌరా హరి, ప్రసాద్ డైలాగ్స్: మణిబాబు కరణం, ప్రొడక్షన్ డిజైనర్: శ్రీ నాగేంద్ర తంగల, బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, నిర్మాతలు: టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కార్తీక్ ఘట్టమనేని)
సూపర్ హీరోస్ అనగానే మనకి వెంటనే గుర్తొచ్చే పేరు ‘అవెంజర్స్’. అసలు ఈ సిరీస్‌లో వచ్చిన సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ఎంత వసూళ్లు సాధించాయో.. ఎంతమంది అభిమానుల్ని సంపాదించుకున్నాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అయితే సరిగ్గా గమనిస్తే ఈ చిత్రాల్లో హీరోల పాత్రలు, వాటి వెనుకున్న కథలు ఇవన్నీ మన భారతీయ ఇతిహాసాలు, పురాణాల నుంచి స్పూర్తి పొంది తీసినవే. నిజానికి వీటిని మనవాళ్ల కంటే విదేశీయులే ఎక్కువగా వాడుకున్నారు. కానీ కొంతకాలంగా మాత్రం మన సినీ ఇండస్ట్రీలో కూడా చాలా మార్పులు వచ్చాయి. హాలీవుడ్‌కి స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్, హీ మ్యాన్.. ఆ మ్యాన్ ఈ మ్యాన్ అంటూ ఎంతోమంది సూపర్ హీరోలు ఉన్నారు కదా.. మరి మనకి లేరా అంటే ఉన్నారు. తెలుసుకంటే మన ఇతిహాసాల్లో ప్రతి పాత్రా ఓ సూపర్ మ్యాన్‌యే.. ప్రతి క్యారెక్టర్ ఒక అద్బుతమే. అందుకే వాటి ఆధారంగా కొన్నేళ్లుగా మనం కూడా ఇలాంటి సూపర్ హీరోల సినిమాలపై దృష్టి పెట్టాం. అందులో భాగంగా వచ్చిన తొలి ఇండియన్ సూపర్ హీరో చిత్రం మిన్నల్ మురళి.. మలయాళంలో వచ్చిన ఈ చిత్రం భారీ వసూళ్లు కూడా రాబట్టింది. ఇక ఇటీవలే వచ్చి ‘కొత్త లోక’ కూడా అలాంటి సినిమానే. అలానే గతేడాది తేజ సజ్జా నటించిన ‘హను మాన్’ సినిమా, ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 ఏడీ’ చిత్రాలు మన పురాణాల్లోని పాత్రల్ని సూపర్ హీరోలుగా చూపించడంతో అద్భుతమైన విజయం సాధించాయి. ఇప్పుడు అదే ఊపులో ‘మిరాయ్’ అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చాడు తేజ సజ్జా. ఇక ఇందులో మంచు మనోజ్ లాంటి విలక్షణ నటుడు విలనిజం చూపించడం.. శ్రియ శరణ్, జగపతిబాబు, జయరామన్ లాంటి నటీనటులు కూడా ఉండంటంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. తేజ సజ్జ ‘హనుమాన్’ సినిమాతో సూపర్ హీరో ఇమేజ్ తెచ్చుకున్నాడు. ఇప్పుడు ‘మిరాయ్’లో సూపర్ యోధా పాత్రలో మెరిసాడు. డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని ఈ సినిమాను భారీ స్కేల్‌లో రూపొందించాడు. భారతీయ పురాణాలు, ఫాంటసీ, హై-ఇంటెన్సిటీ యాక్షన్‌తో వచ్చిన సినిమా ఇది. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జ నుంచి వచ్చిన మరో ఇంట్రెస్టింగ్ చిత్రమే’మిరాయ్’ అని చెప్పొచ్చు. భారీ విజువల్స్ తో ప్లాన్ చేసిన ఈ సినిమా ఈగల్ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని నుంచి మరో ప్రాజెక్ట్ గా వచ్చింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా లేదా అనేది తెలుసుకుందాం…
కథ: వేద ప్రజాపతి (తేజ సజ్జ) ఒక అనాధ. చిన్నప్పుడే ఒక లోక కార్యం కోసం వాళ్ళ అమ్మ, భవిష్యత్తును సైతం చూడగలిగే శక్తి ఉన్న అంబిక (శ్రియా) వేదను వదిలేస్తుంది. కళింగ యుద్ధం తర్వాత అశోకుడు మళ్లీ అంతటి విధ్వంసం జరగకూడదు అని.. తన జ్ఞానాన్ని తొమ్మిది గ్రంథాలలో అమర్చి తొమ్మిది మంది యోధులకు ఇస్తాడు. దాన్ని మహావీర్ లామా (మంచు మనోజ్) చేజెక్కించుకొని దేవుడు అవ్వాలి అనుకుంటాడు. అలా జరగకుండా.. అతడిని ఆపే ఆయుధం మిరాయ్. దానికోసం వేదా ఏం చేశాడు.. ఆయనకు విభా (రితిక నాయక్), హిమాలయాలలో ఉండే అగస్త్య (జయరాం) ఎలా సాయపడ్డారు.. వేద తన లక్ష్యం వైపు ఎలా అడుగులు వేసాడు? అశోకుడు తనలోని శక్తులను 9 గ్రంథాలుగా ఎందుకు మార్చాడు? తొమ్మిది గ్రంథాలను చేజిక్కించుకొని అమరత్వాన్ని సాధించాలనే కోరిక మహావీర్‌కు ఎందుకు కలిగింది? పసిగుడ్డు వేద్‌ను అంబికా వదిలేయడం వెనుక కారణం ఏమిటి? అంబికా ఆధీనంలో ఎనిమిది గ్రంథాలు ఎందుకు ఉన్నాయి? మహావీర్ లామా దుష్టుడిగా మారి బ్లాక్ స్వార్డ్ పట్టేందుకు జరిగిన సంఘటన ఏమిటి? అనాధగా పెరిగిన వేద్‌ను వెతుక్కొంటూ విభ ఎందుకు వెళ్లింది? తన జన్మ రహస్యం తెలుసుకొన్న వేద్ ఎలాంటి నిర్ణయం తీసుకొన్నాడు? అసలు మిరాయ్ అంటే ఏమిటి? దానిని చేజిక్కించుకోవడానికి వేద్ ఏం చేశాడు? మహావీర్ దుష్ట ప్రయత్నాలను వేద్ ఎలా ఎదుర్కొన్నాడు? తన తల్లి త్యాగానికి, ఆమె తెగ కోసం ఎలాంటి సాహసాన్ని చేశాడు అనే ప్రశ్నలకు సమాధానమే మిరాయ్ సినిమా కథ.
విశ్లేషణ: కొన్ని సినిమాలు ఎలా ఉన్నాయో అడక్కూడదు జస్ట్ ఎక్స్పీరియన్స్ చేయాలంతే.. మిరాయ్ కూడా అలాంటి సినిమానే. మన పురాణాలు, ఇతిహాసాలు, దేవుళ్ళు.. వీటి కంటే గొప్ప కథలు ఇంకేమున్నాయి. ‘కార్తికేయ 2’లో కృష్ణుడి కంకణానికి దేశం మొత్తం కదిలింది. ఈసారి రాముడి కోదండానికి పూనకాలు ఖాయం. కథ ఆల్రెడీ చెప్పేశారు.. కళింగ యుద్ధం తర్వాత అశోకుడు మళ్లీ అంతటి విధ్వంసం జరగకూడదు అని.. తన జ్ఞానాన్ని తొమ్మిది గ్రంథాలలో అమర్చి తొమ్మిది మంది యోధులకు ఇస్తాడు. దాన్ని విలన్ చేజెక్కించుకొని దేవుడు అవ్వాలి అనుకుంటాడు. అలా జరగకుండా.. అతడిని ఆపే ఆయుధం మిరాయ్. కథకు మొదటి సీన్ నుంచి స్టిక్ అయి ఉన్నాడు దర్శకుడు కార్తీక్. ఆయనకు ఆ రాముడి స్టిక్ కూడా బాగా హెల్ప్ అయ్యింది. ఫస్టాఫ్ హీరో తన గమ్యం తెలుసుకునేంత వరకు కథ కాస్త కామెడీగా, నెమ్మదిగా వెళుతుంది.. ఎప్పుడైతే హీరో అడుగు లక్ష్యం వైపు పడుతుందో అక్కడ నుంచి సినిమా ఆగలేదు. మరీ ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్ లో వచ్చే సంపాటి ఈగల్ ఎపిసోడ్ నెక్స్ట్ లెవెల్.. సెకండ్ ఆఫ్ లో కూడా రెండు మూడు సీన్స్ గూస్ బంప్స్ గ్యారెంటీ. హనుమాన్ లో రుధిరమణి.. మిరాయ్ లో ఆ రామచంద్రుడి కోదండం.. తెలుగు సినిమాకు దొరికిన సరికొత్త సూపర్ హీరో తేజ సజ్జ. చాలా మంది హీరోలు ఇలాంటి కథలు ట్రై చేస్తారు కానీ.. అన్నీ కుదిరితేనే వర్కౌట్ అవుతాయి. అప్పుడు ‘హనుమాన్’ ఇప్పుడు ‘మిరాయ్’ ఈ రెండు తేజకు కుదిరాయి.. మన దగ్గర రాముడు అంటే కేవలం పేరు కాదు కోట్లాది మంది కొలిచే దైవం.. నడిపించే ధైర్యం.. ‘మిరాయ్’ లో దాన్ని బాగా చూపించారు. ఇంత పెద్ద కథ చెప్తున్నప్పుడు అక్కడక్కడ స్లో నెరేషన్ తప్పదు.. అది పెద్ద సమస్య కాదు. ఈగల్ ఎపిసోడ్, ట్రైన్ ఎపిసోడ్, క్లైమాక్స్ పక్కా పైసా వసూల్. ఓవరాల్ గా మిరాయ్.. చాలా మంచి థియేటర్ ఎక్స్పీరియన్స్. అశోకుడు చేసిన కళింగ యుద్దం నాటి పాయింట్‌ను ఎంచుకొని సోషల్ ఫాంటసీ ఎలిమెంట్స్ జోడించి దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని రాసుకొన్న కథ, కథనాలు బాగున్నాయి. అయితే సింపుల్ కథకు టెక్నికల్ ఎలిమెంట్స్ జోడించి తెర మీద పవర్‌ఫుల్‌గా మార్చిన తీరుకు అభినందించాల్సిందే. అనుసరించిన కథనం బాగుంది.. కానీ మధ్యలో కామెడీ కోసం ప్రయత్నించి జొప్పించిన సీన్లు మాత్రం సినిమా ఫ్లోను, ఎమోషన్స్‌కు అడ్డు కట్ట వేశాయనే చెప్పాలి. దర్శకుడు కిషోర్ తిరుమల ట్రాక్ బాగుంది. కానీ ఈ సినిమాకు అవసరం లేదనే ఫీలింగ్ కలుగుతుంది. అలాగే వెంకటేష్ మహాతో చేయించిన సీన్లు కథా వేగానికి బ్రేక్ వేయడమే కాకుండా సినిమాను కొంత పొల్యూట్ చేసిందనిపిస్తుంది. ఇక ఈ సినిమాకు కార్తీక్ వన్ మ్యాన్ షో అని చెప్పాలి. ఈ చిత్రంతో కొత్త వరల్డ్‌ను క్రియేట్ చేసిన తీరుకు ప్రశంసలు అందించాల్సిందే. సినిమాపై హైప్ పెంచడానికి, మరో మెట్టు ఎక్కించడానికి ప్రభాస్, రానాను వాడుకొన్న తీరు దర్శకుడిగా అతడి మార్కెటింగ్ విజన్‌కు అద్దం పట్టింది. ఊహించని ఎంట్రీతో హైప్ పెంచేసిన బాహుబలి మిరాయ్ సినిమా హై నోట్‌తో ప్రారంభమైనప్పటికీ.. సినిమా అసలు కథలోకి వెళ్లడానికి కాస్త ఎక్కువగానే సమయం తీసుకొన్నాడు. పాత్రల పరిచయం.. డిటేయిలిటీ కారణంగా కొంత సాగదీసినట్టు అనిపిస్తుంది. అయితే ఇంటర్వెల్‌కు ఇరవై నిమిషాల ముందు టేకాఫ్ తీసుకొన్న విధానం సినిమాను అమాంతం లేపేసింది. ఇక సెకండాఫ్‌లో అదే జోష్ కొనసాగుతుందనుకొంటే.. దర్శకుడు మళ్లీ వెంకటేష్ మహా లాంటి కథకు అవసరం లేని క్యారెక్టర్లను తీసుకొచ్చి ఫీల్ గుడ్ ఫ్యాక్టర్స్‌ను డిస్ట్రబ్ చేశాడు. స్క్రిప్టు పరంగా కొన్ని లోపాలు ఉన్నప్పటికీ.. వాటిని కప్పిపుచ్చుకోవడానికి అనుసరించిన వీఎఫ్ఎక్స్, క్లైమాక్స్ డిజైన్ బ్యాలెన్స్ చేసింది. మొదటిగా దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని ఎంచుకున్న కథ తన విజన్ ఈ సినిమాలో గ్రాండ్ గా కనిపిస్తాయి. ఒక ఇంట్రెస్టింగ్ నేపథ్యాన్ని తాను ఎంచుకొని ఒక గ్రాండ్ ట్రీట్ ఇచ్చే ప్రయత్నం తాను చేయడం హర్షణీయం. ముఖ్యంగా తన శక్తికి మించి పెట్టిన ఎఫర్ట్స్ భారీ విజువల్స్ అందులో డివోషనల్ గా ఇచ్చిన ఎలివేషన్స్ లో తన విజన్ కనిపిస్తుంది. ముఖ్యంగా సప్తపది గరుడ ఎపిసోడ్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ఆ విజువల్ ఎఫెక్ట్స్ మాత్రం బిగ్ స్క్రీన్ పై సాలిడ్ గా కనిపిస్తాయి. అలాగే తేజ సజ్జ రోల్ నీట్ గా వెళుతుంది. తన అడ్వెంచరస్ ప్రయాణం అందులోని సవాళ్లు నీట్ గా డిజైన్ చేసుకున్నారు. అలాగే మంచు మనోజ్ ఈ పాత్రని ఎందుకు ఎంచుకున్నాడో సమాధానం ఈ సినిమాలో గట్టిగా కనిపిస్తుంది. తాను ఈ సినిమాలో రోల్ ని చాలా ఛాలెంజింగ్ గా కూడా చేశారు. కొన్ని ఇబ్బందికర సన్నివేశాలని సైతం మనోజ్ చేయడం తన గట్స్ ని మరోసారి ప్రూవ్ చేస్తుంది. ముఖ్యంగా తనపై శబ్ద గ్రంధం యాక్షన్ ఎపిసోడ్ కంప్లీట్ డిఫరెంట్ గా ఉంటుంది. బహుశా ఇలాంటి ఎపిసోడ్ ఇండియన్ సినిమా దగ్గర ఇది వరకు వచ్చి కూడా ఉండకపోవచ్చు. అది చాలా యునిక్ గా అనిపిస్తుంది. ఈ సినిమా నిర్మాణ విలువలు మాత్రం ఎక్స్ట్రార్డినరీగా ఉన్నాయని చెప్పవచ్చు. తక్కువ బడ్జెట్ లోనే సాలిడ్ ప్రాజెక్ట్ లు చేయొచ్చు అని చూపించడానికి మిరాయ్ ని మరో చక్కటి ఉదాహరణగా చెప్పొచ్చు అనే విధంగా మేకర్స్ తీర్చి దిద్దారు. సినిమాలో యాక్షన్ పార్ట్ కానీ విజువల్ ఎఫెక్ట్స్ పనితీరు గాని సాలిడ్ గా ఉన్నాయి. ఈ రేంజ్ అవుట్ ఫుట్ ని అయితే చాలామంది ఊహించి కూడా ఉండకపోవచ్చు. అలాగే హను మాన్ సంగీత దర్శకుడు గౌర హరి ఈ సినిమాకి కూడా మంచి డ్యూటీ చేశారు. ఆయా సన్నివేశాలని తన నేపథ్య సంగీతంతో మరింత పవర్ఫుల్ గా ఎలివేట్ చేశారు. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేనే కెమెరా వర్క్ కూడా అందించారు. తన వర్క్ ఇందులో స్టన్నింగ్ గా ఉంది. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ డీసెంట్ గా ఉంది. ఇక కార్తీక్ దర్శకత్వ పనితీరు విషయానికి వస్తే.. తాను ఎంచుకున్న కథ, గ్రాండ్ విజన్ బాగున్నాయి. అంధుడు తగ్గట్టుగా ప్లాన్ చేసుకున్న మూమెంట్స్ కూడా ఇంప్రెస్ చేస్తాయి. అవెంజర్స్, అమెరికన్ సూపర్ హీరోస్ వంటి సినిమాలు చూసి ఛ ఇలాంటి సినిమాలు మనవాళ్లు ఎప్పుడు తీస్తార్రా అని ఆవేదన చెందిన ఎంతోమంది ప్రేక్షకులకి మిరాయ్ ఖచ్చితంగా ఒక ఊరటనిస్తుంది. అందులోనూ ఈ వీఎఫ్‌ఎక్స్ వర్క్ చేసింది మన హైదరాబాద్ టీమ్ అవ్వడం నిజంగా గర్వకారణం. ఎక్కడో హాలీవుడ్‌కి వెళ్లి విదేశాలకి వెళ్లి తాము గ్రాఫిక్స్ చేయలేదు.. మన హైదరాబాద్‌లో మా స్టూడియోలోనే చేసిన గ్రాఫిక్స్ ఇవన్నీ అంటూ తేజ సజ్జా చాలా గర్వంగా గొప్పగా ఇంటర్వ్యూల్లో చెప్పాడు. సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ కూడా అది నిజమే అనిపించకమానదు. సూపర్ పవర్స్, మెరుపులు, స్పెషల్ ఎఫెక్ట్స్ ఇలా విజువల్స్ పరంగా సినిమా వేరే లెవల్లో ఉంది. హాలీవుడ్ సినిమాలకి ఏమాత్రం తగ్గకుండా పేరు పెట్టే అవకాశం లేకుండా వీఎఫ్‍ఎక్స్ వర్క్ చేశారు. ముఖ్యంగా సినిమాలో సంపాతి (భారీ గద్ద) వచ్చే సీన్లు అయితే ఆడియన్స్‌కి థియేటర్లో గూస్‌బంప్స్ తెప్పిస్తాయి. అలానే రాముడ్ని చూపించే సీన్లలో, కళింగ యుద్ధాన్ని చూపించే సన్నివేశాల్లో గ్రాఫిక్స్ కూడా చాలా బావున్నాయి. మిరాయ్‌కి మరో ప్రధాన బలం మాత్రం మంచు మనోజ్ అనే చెప్పాలి. హీరోయిజమైనా విలనిజమైనా ఏదైనా సరే నాకు ఒక్కటే అనే విధంగా మనోజ్ యాక్ట్ చేశారు. నిజానికి ఇందులో మనోజ్ చేసిన నటన చూశాక.. ఛ మనోళ్లు మనోజ్‌ని ఇప్పటివరకూ సరిగా వాడుకోలేదే అనే ఫీలింగ్ కలుగుతుంది. కోపం, ఆవేశం, ఆక్రోశం, ఆవేదన, అహంకారం ఇలా అన్నీ తన కళ్లల్లో, ముఖంలో చాలా బాగా పలికించారు మనోజ్. ఇక చూడటానికి కూడా చాలా స్టైలిష్‌గా ఉన్నారు. జెన్‌జీ పిల్లలకి రామాయణ, మహాభారతాల గురించి పురాణాల గురించి చెప్పడానికి వీఎఫ్ఎక్స్‌ని మించిన మాద్యమం లేదేమో అనిపించే విధంగా ఈ మధ్య కాలంలో సినిమాలు వస్తున్నాయి. గతేడాది హను మాన్, కల్కి 2898 ఏడీ రీసెంట్‌గా వచ్చిన కొత్త లోక ఇలా అన్నీ వీఎఫ్‌ఎక్స్ విషయంలో అద్భుతమే చేశాయి. ఇప్పుడు మిరాయ్ కూడా అదే రిపీట్ చేసింది. సినిమాలో కథ, కథనం, లాజిక్స్ ఇవన్నీ పక్కన పెడితే థియేటర్‌కి వచ్చిన ప్రేక్షకుడికి ఒక సరికొత్త అనుభూతిని.. విజువల్ వండర్‌ని అయితే ఖచ్చితంగా మిరాయ్ చూపించింది.
నటీనటులు ఎలా చేశారంటే… తేజ సజ్జ తన పాత్రకి సరిగ్గా కుదిరాడు. మంచి లుక్స్ అండ్ ఎమోషన్స్ ని పండించాడు. యాక్షన్ పార్ట్ లో అయితే అదరగొట్టాడని చెప్పవచ్చు. యాక్షన్, ఎమోషనల్ సన్నివేశాల్లో అదరగొట్టాడు. సినిమాకు బ్యాక్‌బోన్‌గా నిలిచాడని చెప్పొచ్చు. ఈ సినిమాలోని వేద్ పాత్ర హనుమాన్ సినిమాలోని క్యారెక్టర్‌కు ఎక్స్‌టెన్షన్‌గా అనిపిస్తుంది. కానీ వేద్ పాత్రలో పరకాయ ప్రవేశం చేసిన విధానం బాగుంది. వేద్‌గా తేజా సజ్జా లుక్, బాడీ లాంగ్వేజ్, బిహేవియర్ పర్‌ఫెక్ట్‌గా సెట్ అయ్యాయి. ఎమోషనల్ సీన్లలోను, యాక్షన్ సీన్లలోను అదరగొట్టేశాడు. తన పాత్ర ద్వారా, ఇతర పాత్రల నుంచి పెర్ఫార్మెన్స్ రాబట్టేందుకు చేసిన ఎఫర్ట్ బాగుంది. మంచు మనోజ్ బ్లాక్ స్వోర్డ్ విలన్‌గా తన ఫైట్ సన్నివేశాల్లో డామినేట్ చేశాడు. ఆయన క్యారెక్టర్ డిజైన్ చేసిన తీరు కూడా బాగుంది. మహావీర పాత్రలో క్రేజీగా ఉన్నాడు. తెరపైన డిఫరెంట్ లుక్, యాటిట్యూడ్‌తో సినిమాకు మరింత బలంగా మారాడు. మనోజ్‌లో కొత్త అవతారాన్ని చూసే ఛాన్స్ లభించింది. శ్రీయా సరన్ తన ఇమేజ్‌కు భిన్నంగా కథను మలుపు తిప్పే క్యారెక్టర్‌లో ఒదిగిపోయింది. అంతేకాకుండా సినిమాను నెక్ట్స్ రేంజ్‌కు చేర్చే బాధ్యతను ఆమె తన భుజాలపైకి ఎత్తుకొన్నారు. ఆమెకు లైఫ్ టైం క్యారెక్టర్ పడింది అని చెప్పొచ్చు. అంబిక పాత్రలో శ్రియ బాగా చేశారు. చాన్నాళ్ల తర్వాత ఆమెకి చాలా మంచి బరువైన పాత్ర దక్కింది. సినిమాలో అంబిక పాత్రలో శ్రియ ఒదిగిపోయిన తీరు కథకి మరింత బలాన్ని ఇచ్చింది. ఎమోషనల్ సీన్లలో శ్రియ నటన చాలా నేచురల్‌గా ఉంది. ఇక ఇటీవల కాలంలో హీరోయిన్ అంటే పాటలకు, గ్లామర్‌కు పరిమితమవుతున్నారనే విమర్శలను తిప్పి కొట్టే విధంగా రితిక నాయక్ చేసిన విభ పాత్ర ఉంటుంది. యాక్టింగ్ పరంగానే కాకుండా పెర్ఫార్మెన్స్ పరంగా కూడా ఆకట్టుకొన్నది. అలాగే నటుడు జైరాం కూడా మంచి పాత్రలో కనిపించి మెప్పించారు. జగపతి బాబు తన పాత్రలో సమర్థవంతంగా నటించి మెప్పించారు. గెటప్ శ్రీను రోల్ బాగుంది మంచి కామెడీ సీన్స్ వర్కౌట్ అయ్యాయి.
టెక్నికల్ విశాలాయాకొస్తే… ఈ సినిమాకు మరో హీరో ఉన్నాడు.. అతడే మ్యూజిక్ డైరెక్టర్ గౌరీ హరి. సినిమాకు ఆయువు రీ రికార్డింగ్. చాలా సన్నివేశాలు కేవలం ఆర్.ఆర్ తో హైలైట్ అయ్యాయి. ఎడిటింగ్ కూడా బాగుంది. సినిమాటోగ్రఫీ టాప్ నాచ్. విజువల్ ఎఫెక్ట్స్ ఈ సినిమాకు ప్రాణం. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని దర్శకుడుగానే కాదు సినిమాటోగ్రాఫర్ గానూ సత్తా చూపించాడు. సినిమాటోగ్రఫిని, స్క్రీన్ ప్లేను అందించి.. ఈ మూవీకి నెక్ట్స్ రేంజ్‌కు చేర్చాడు. సన్నివేశాలను స్క్రీన్ మీద పెయింటింగ్‌లా మార్చాడు. సినిమాను విజువల్ ట్రీట్‌గా అందించారు. ఇక ఈ సినిమాకు మరో స్పెషల్ ఎట్రాక్షన్ మ్యూజిక్. హరి అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలెట్. ఎడిటింగ్ ఓకే . అనిపిస్తుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అనుసరించిన నిర్మాణ విలువలు హై స్టాండర్డ్స్‌లో ఉన్నాయి. విశ్వ ప్రసాద్‌కు సినిమాపై ఉన్న తపన, అభిరుచి ఏమిటో ఈ సినిమా ద్వారా తెలుసుకోవచ్చు. ఓవరాల్‌గా ఈ సినిమా గురించి చెప్పాలంటే.. టెక్నికల్ బ్రిల్లియెన్స్‌తో పురాణాలను జోడించి సోషల్ ఎలిమెంట్స్‌తో స్క్రీన్ మీద చూపించిన దృశ్య కావ్యం. ఇతిహాసాలను ఈ జనరేషన్‌కు టచ్ చేసే విధంగా రూపొందించిన ఫుల్లీ థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ ఉన్న సినిమా. కన్వినియెంట్ స్క్రీన్ ప్లేతో కథను కన్విన్సింగ్‌గా చెప్పడంలో దర్శకుడు కార్తీక్ సక్సెస్ అయ్యాడు. డైరెక్టర్ విజన్‌ను ఒక టీమ్‌గా నటీనటులు, సాంకేతిక నిపుణులు ఫుల్‌ఫిల్ చేశారు. స్క్రిప్టులో కొన్ని లోపాలు ఉన్నా లాజిక్‌లు వెతక్కుండా చూస్తే.. డెఫినెట్‌గా విజువల్ ట్రీట్. ఈ “మిరాయ్” టాలీవుడ్ నుంచి మరో ఇంప్రెస్ చేసే కొత్త ప్రయత్నం అని చెప్పవచ్చు. మంచి అడ్వెంచరస్ డ్రామాలు అందులో మైథలాజి, హిస్టారికల్ ఎలిమెంట్స్ తో సాలిడ్ యాక్షన్ సహా హై మూమెంట్స్ ఎపిసోడ్స్ లాంటివి ఇష్టపడేవారికి మిరాయ్ సాలిడ్ ట్రీట్ ని అందిస్తుంది. ముఖ్యంగా తేజ సజ్జ, మనోజ్ లు తమ రోల్స్ లో అదరగొట్టారు. అలాగే దర్శకుడు విజన్ తన ప్రయత్నంకి మరిన్ని మార్కులు ఇవ్వొచ్చు. సో.. ఈ చిత్రాన్ని బిగ్ స్క్రీన్స్ పై ఎంజాయ్ చేయవచ్చు. ఎలాంటి అనుమానాలు లేకుండా థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ పొందాలనుకొంటే ‘మిరాయ్’ని చూసేందుకు వెళ్లాల్సిందే.