రాజమండ్రిలో #RAPO22 చిత్రీకరణలో రామ్ పోతినేనిని కలిసిన ఏపీ సినిమాటోగ్రఫీ, పర్యాటక శాఖామాత్యులు కందుల దుర్గేష్

Minister Kandula Durgesh Meets Ram Pothineni at #RAPO22 Shooting in Rajahmundry
Spread the love

ఉస్తాద్ రామ్ పోతినేని కథానాయకుడిగా యంగ్ అండ్ టాలెంటెడ్ మహేష్ బాబు పి దర్శకత్వంలో టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ ఓ సినిమా నిర్మిస్తోంది. నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మాతలు. హీరోగా రామ్ 22వ చిత్రమిది. అందుకని #RAPO22ను వర్కింగ్ టైటిల్‌గా వ్యవహరిస్తున్నారు. ఇటీవల రాజమండ్రిలో సెకండ్ షెడ్యూల్ మొదలైంది.
రాజమండ్రిలో జరుగుతున్న #RAPO22 చిత్రీకరణకు ఏపీ సినిమాటోగ్రఫీ, టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్ విచ్చేశారు. రామ్ పోతినేనిని కలిసి ముచ్చటించారు. సుమారు గంట సేపు చిత్రీకరణలో ఆయన ఉన్నారు.
రామ్ డ్యాన్సులు తనకు ఇష్టమని ఏపీ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. రబ్బరు స్ప్రింగ్ తరహాలో రామ్ అద్భుతంగా డ్యాన్స్ చేస్తారన్నారు. చిత్ర బృందంతోనూ ముచ్చటించిన కందుల దుర్గేష్… ఏపీలో మంచి పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని, గోదావరి నదీ తీర ప్రాంతాల్లో చిత్రీకరణలు చేసిన ఘన విజయాలు సాధించాయని, ఈ సినిమా కూడా ఘన విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు. చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
రాజమండ్రిలో రెండు వారాల క్రితం సినిమా సెకండ్ షెడ్యూల్ షూటింగ్ మొదలైంది. చిత్రీకరణకు వెళ్లిన రామ్ పోతినేనికి ఎయిర్ పోర్టులో దిగిన తర్వాత ఘన స్వాగతం లభించింది. అరటి గెలలతో తయారు చేసిన భారీ గజమాలతో అభిమానులు వెల్కమ్ చెప్పారు.
రామ్ జంటగా భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్ : అవినాష్ కొల్లా, ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్, సినిమాటోగ్రఫీ: మధు నీలకందన్, మ్యూజిక్: వివేక్ – మెర్విన్, సీఈవో: చెర్రీ, ప్రొడక్షన్ హౌస్: మైత్రి మూవీ మేకర్స్, ప్రొడ్యూసర్స్: నవీన్ ఎర్నేని, రవి శంకర్ యలమంచిలి, కథ – కథనం – దర్శకత్వం: మహేష్ బాబు పి.

Related posts

Leave a Comment