మెగాస్టార్ చిరంజీవికి.. యంగ్ హీరో కార్తికేయ డైహార్డ్ అభిమాని అన్నది చెప్పాల్సిన పనిలేదు. చిరంజీవి స్పూర్తితో సినిమాల్లోకి వచ్చి ఎదుగుతున్నాడు. నటుడిగా ఇప్పుడిప్పుడే నిలదొక్కు కుంటున్నాడు. కార్తికేయ పట్ల చిరంజీవి అంతే అభిమానంతో ఉంటారు. ఇలా తన స్పూర్తితో ఎదిగిన వారికి చిరు ఎప్పుడూ తన వంతు సహకారం అందిస్తుంటారు. తమ సినిమా ప్రచారాల్లో పాల్గొనడం వంటివి చేస్తుంటారు. తాజా గా కార్తికేయ నటించిన ‘బెందురులంక 2012’ విడుదలకి రెడీ అవుతోంది. ఇందులో హీరో పాత్ర పేరు చిరంజీవి వాస్తవ పేరుని పెట్టారు. దీంతో ఈ సినిమాలో చిరంజీవి బ్రాండ్ ని వాడుతున్నారా? అన్న ప్రశ్నకు కార్తికేయ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. ఇందులో నా పాత్ర పేరు శివ. ఓ సన్నివేశంలో శివ బిగిన్స్..ఆట మొదలు అన్నట్లు చెప్పాలి. కానీ శివ పేరు చిన్నగా ఉండటంతో దాని ప్రభావం అంతగా కనిపించడం లేదనిపించింది. అదే సమయంలో సెట్లో ఎవరో శివ శంకర్ అనే పేరు ఉంటే బాగుంటుం దన్నారు. అప్పుడే శివశంకర వర ప్రసాద్ పేరు మదిలోకి వచ్చింది. అలా అప్పటికప్పుడు అనుకుని ఆ షాట్ లో చెప్పాం తప్ప సినిమాలో చిరంజీవి పేరు వాడుకోవాలని అన్న ఉద్దేశం లేదన్నారు. సిటీలో జాబ్ మానేసి ‘బెదురులంక’ వచ్చిన తర్వాత ఆ గ్రామంలో చోటుచేసుకున్న సంఘటనలే ఈ సినిమా. అన్ని రకాల అంశాలు కథలో ఉన్నాయి. మంచి విజయం సాధిస్తామన్న నమ్మకం ఉంది. ప్రతీ సినిమా హిట్ అవ్వాలనే చేస్తాం. కానీ అలా జరగదు. కొన్ని ఆడతాయి. కొన్ని పోతాయి. పోయిన సినిమాలో ఎక్కడ తప్పు జరిగిందో విశ్లేషించుకుంటా. యూవీ క్రియేషన్స్ లో ప్రశాంత్ అనే కొత్త కుర్రాడితో ఓ సినిమా చేస్తున్నా. యాక్షన్ తో కూడిన కైమ్ర్ కామెడీ చిత్రమిది. మరో రెండు..మూడు సినిమాలు చర్చలో దశలో ఉన్నాయి. అవి ఓకే అయితే అధికారికంగా నేనే చెబుతా’ అని అన్నారు.
Related posts
-
రాఘవరాజ్ భట్ కు జాతీయ తులసి సమ్మాన్ పురస్కారం
Spread the love ప్రముఖ కథక్ నాట్యగురు రాఘవరాజ్ భట్ కు ప్రతిష్టాత్మక తులసి సమ్మాన్ లభించింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం సాంస్కృతిక శాఖ... -
చివరి వరకు సస్పెన్స్ మెయింటైన్ అవుతూనే ఉంటుంది.. “ఒక పథకం ప్రకారం” దర్శక, నిర్మాత వినోద్ కుమార్ విజయన్
Spread the love సంచలన దర్శకుడు పూరి జగన్నాధ్ సోదరుడు సాయిరామ్ శంకర్ నటించిన సీట్ ఎడ్జ్ సస్పెన్స్ థ్రిల్లర్ “ఒక... -
Oka Pathakam Prakaaram will Maintain Suspense Till The End: Director Vinod Kumar Vijayan
Spread the love Sai Ram Shankar, the younger brother of sensational director Puri Jagannadh, is starring in...