ఈ మధ్యన రవితేజ వరుస చిత్రాలు విడుదలైనా ఏదీ సరిగ్గా విజయం సాధించలేదు. ‘ధమాకా’ ఒక్కటే హిట్‌గా నిలిచి వంద కోట్ల క్లబ్‌లో చేరింది. దాంతో ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన నక్కిన త్రినాథరావు పై టాలీవుడ్‌లో హీరోలకు నమ్మకం పెరిగింది. ఇప్పుడు ఆయన ‘మజాకా’ సినిమా తీస్తున్నారు. సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్నారు. ఈ సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ‘మజాకా’ తరవాత నక్కిన త్రినాథరావు రవితేజతో ఓ మరో సినిమా చేయబోతున్నట్టు టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. అందుకు సంబంధించిన కథ కూడా సిద్థం చేసుకొన్నట్టు సమాచారం. ‘ధమాకా’ విడుదలైన వెంటనే నక్కిన త్రినాధరావుతో మరో సినిమా చేయడానికి రవితేజ ఆసక్తి చూపించారు. అయితే.. రవితేజ చేతిలో అప్పటికే చాలా సినిమాలున్నాయి. మరోవైపు నక్కిన త్రినాథరావు కూడా వేరే నిర్మాతల దగ్గర అడ్వాన్సు తీసుకొన్నారు. అందుకే రవితేజతో సినిమా కాస్త ఆలస్యమైంది. అయితే ‘మజాకా’ పూర్తయిన వెంటనే రవితేజతో సినిమా ఉండబోతోందని ఇన్ సైడ్ వర్గాలు నుంచి సమాచారం. ‘ధమాకా’ సమయంలోనే రవితేజకు మరో లైన్ చెప్పి ‘ఓకే’ చేయించుకొన్నాడు నక్కిన. ‘మజాకా’ పనులు ఓ వైపు జరుగుతున్నా, మరో రైటింగ్ టీమ్ తో రవితేజ కథపై చర్చలు జరుగుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రవితేజ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల రవితేజకు ఆపరేషన్ జరగడం వల్ల, ఆ సినిమా షూటింగ్‌కు కాస్త బ్రేక్ ఇచ్చారు. అయితే ఫిబ్రవరి, మార్చ్ నాటికి రవితేజ సినిమా షూటింగ్ పూర్తయ్యే అవకాశాలున్నాయి. వేసవిలో రవితేజ సినిమా విడుదల అవుతుంది. ఆ తరవాత నక్కిన సినిమా పట్టాలెక్కుతుంది. ఈలోగా నక్కిన ‘మజాకా’ కూడా వచ్చేస్తుంది.
Related posts
-
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ అందరినీ అలరిస్తుంది :నిర్మాత దిల్ రాజు
Spread the love దిల్‌రాజుగారితో కలిసి ‘గేమ్ చేంజర్’ సినిమాను తమిళంలో విడుదల చేయబోతుండటం ఆనందంగా ఉంది – ఆదిత్యరామ్ మూవీస్... -
Shankar’s Game Changer featuring global star Ram Charan will universally captivate everyone – Dil Raju.
Spread the love I am delighted to be releasing Game Changer in Tamil in collaboration with Dil... -
ఆ పార్టీలకు వెళితేనే బాలీవుడ్లో ఛాన్సులు వస్తాయ్ : రెజీనా
Spread the love సినిమాల్లోకి వచ్చి దాదాపు 20 ఏళ్లు కావొస్తుండగా బాలీవుడ్ ఎంట్రీ ఎందుకు ఆలస్యమైందని ఎదురైన ఓ ప్రశ్నకు రెజీనా...