హైదరాబాద్: పుట్టిన రోజు…ప్రతి ఒక్కరికి ఎంతో ప్రత్యేకమైన రోజు. స్నేహితులు, కుటుంబ సభ్యులతో వేడుకలు జరుపుకుంటారు. బర్త్ డే….చాలా మందికి ఎంతో స్పెషల్ డే. యువకళావాహిని ఉపాధ్యక్షులు ఎమ్.ఏ హమీద్ జన్మదినోత్సవం 14.9.2025 (ఆదివారం) సాయంత్రం 7 గంటలకు గెట్ టు గెదర్ ప్రెస్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమం అత్యంత సన్నిహితులు, మిత్రుల మధ్య ఆడంబరంగా జరిగింది. ఈ సందర్బంగా జరిగిన వేడుకలో రసమయి డాక్టర్ ఎం.కె.రాము, కిన్నెర రఘురాం, యువకళావాహిని లంక లక్ష్మీనారాయణ, సంగీత దర్శకుడు కలగా కృష్ణమోహన్, టివి సినీ నటులు కాదంబరి కిరణ్ కుమార్, కృష్ణ తేజ, ఏసీపీ రాజశేఖర్, రెరా డైరెక్టర్ కొత్త శ్రీనివాస్, సీనియర్ జర్నలిస్ట్ డా. మహ్మద్ రఫీ, నంది అవార్డు గ్రహీత ఎండి అబ్దుల్, కో ఆపరేటివ్ డిప్యూటీ రిజిస్ట్రార్ విజయ్ కుమార్, లయన్ డాక్టర్ చిల్లా రాజశేఖర్ రెడ్డి, ఆరాధన లోకం కృష్ణయ్య, సత్కళా భారతి సత్యనారాయణ, జీవిఆర్ ఆరాధన వివి రాఘవరెడ్డి, పెప్సీ విజయ్ కుమార్, జమలాపురం రాధాకృష్ణ, వి. సతీష్ బాబు, మహమ్మద్ షరీఫ్, విజయ్ భగవాన్, డాక్టర్ జుర్రు చెన్నయ్య, వాకిటి మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్.ఏ హమీద్ పుట్టిన రోజు సందర్బంగా ఆర్టిస్ట్ చారి గీసిన హమీద్ చిత్రం అందరి మనసులను దోచుకుంది.
ఈ కార్యక్రంలో నంది అవార్డు గ్రహీత ఎండి అబ్దుల్ మాట్లాడుతూ ...” ఈ రోజు మీకు ఆనందాన్ని మరియు సంతోషాన్ని తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నాను. మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలి. ఇది మీ జీవితంలో ఒక అద్భుతమైన రోజు అని ఆశిస్తున్నాను. ఈ జన్మదినం మీకు కొత్త ఆశలు, కొత్త కలలు మరియు కొత్త విజయాలు తీసుకురావాలని కోరుకుంటున్నాను. ప్రతి పుట్టినరోజు ఒక కొత్త ప్రారంభం. ఈ రోజు నుండి మీ జీవితం మరింత విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. జన్మదినం అంటే ఆనందించే రోజు, బహుమతులు పొందే రోజు మరియు కృతజ్ఞతతో ఉండాల్సిన రోజు. ఈ రోజు మీకు చాలా ప్రత్యేకంగా ఉండాలి. మీ పుట్టినరోజు సందర్భంగా, మీకు ప్రపంచంలోని ఆనందం అంతా దక్కాలని కోరుకుంటున్నాను” అంటూ బర్త్ డే విషెస్ తెలిపారు.
సీనియర్ జర్నలిస్ట్ డా. మహ్మద్ రఫీ మాట్లాడుతూ …”మీ జీవితంలోని ప్రతి క్షణం ఆనందంతో నిండి ఉండాలి. కోటి కాంతుల చిరునవ్వులతో, అల్లా మీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. మీ ప్రతి పుట్టిన రోజు మీకు రెట్టింపు సంతోషాన్ని ఇవ్వాలి” అని శుభాకాంక్షలు తెలిపారు.
లయన్ డాక్టర్ చిల్లా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ …” ఇలాంటి పుట్టిన రోజు వేడుకలు మరెన్నో జరుపుకుంటూ…నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. మీ జీవితంలోని ఈ ప్రత్యేకమైన రోజు…అద్భుతమైన క్షణాలతో నిండిపోవాలి. ఆనందంగా జీవించాలి. మీరు నిండు నూరేళ్లు హాయిగా నవ్వుతూ జీవించాలని . ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని.. అల్లా నీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటూ బర్త్ డే విషెస్ చెప్పారు.
సీనియర్ జర్నలిస్ట్ మహమ్మద్ షరీఫ్ మాట్లాడుతూ… ఈ పుట్టిన రోజు సందర్భంగా….ఉప్పొంగిన ఉత్తేజంతో ముందుకు సాగాలని మనసారా కోరుకుంటూ….. వెండి వెన్నెల వెలుగులో, చక్కని చిరునవ్వు సాక్షిగా….మీకు ఇవే నా జన్మదిన శుభాకాంక్షలు” అన్నారు.
రసమయి డాక్టర్ ఎం.కె.రాము, కిన్నెర రఘురాం, యువకళావాహిని లంక లక్ష్మీనారాయణ, సంగీత దర్శకుడు కలగా కృష్ణమోహన్, టివి సినీ నటులు కాదంబరి కిరణ్ కుమార్ లు మాట్లాడుతూ.. మీ జీవితంలో ప్రతి క్షణం ఆనందంగా మరియు సంతోషంగా ఉండాలని .. మీరు, మీ కుటుంబం ఎప్పుడూ సంతోషంగా ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ…. ఈ ప్రత్యేకమైన రోజును మరింత ఆనందం, సంతోషంతో గడపాలని .. మీరు భవిష్యత్‌లో ఉన్నత శిఖరాలను చేరుకోవాలి. పెద్దల దీవెనలతో…మీ కలలు, కోరికలు నెరవేరాలని .. ఎల్లప్పుడూ హాయిగా నవ్వుతూ…సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ…హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అంటూ బర్త్ డే విషెస్ తెలిపారు.
ఘనంగా ఎమ్.ఏ హమీద్ పుట్టిన రోజు వేడుక
