ఎల్.ఆర్.ఎస్ ఫీజు చెల్లించేందుకు కనీసం మూడు నెలల పాటు గడువు పెంచాలని బి.ఆర్.ఎస్ రాష్ట్ర నాయకులు, ఆలేరు మాజీ జెడ్పిటిసి బొట్ల పరమేశ్వర్ కోరారు. ఈ మేరకు ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. ఎల్.ఆర్.ఎస్ ఫీజు చెల్లించేందుకు పేద ప్రజలు ఒకేసారి వేల రూపాయలు చెల్లించాలంటే డబ్బులు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని.. గడువు దాటితే లక్షలు చెల్లించాలంటే మూలుగుతున్న నక్కపై తాటికాయ పడ్డ విధంగా అవుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. . గత రెండు రోజుల నుండి ఎల్.ఆర్.ఎస్ దరఖాస్తుదారుల ఆన్ లైన్ ఫీజు చెల్లింపులకు సర్వర్ మొరాయించటంతో గంటల తరబడి మున్సిపల్ కార్యాలయాలకే పరిమితం కావలసి వచ్చిందని. తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలో అనేక చోట్ల ఇదే విధంగా సర్వర్ మొరాయించడం జరిగింది. అందువలన ప్రభుత్వం ఆలోచన చేసి ఎల్.ఆర్.ఎస్ సమయం పొడిగించాలని ఈ సందర్భంగా బొట్ల పరమేశ్వర్ ప్రభుత్వాన్ని కోరారు.
ఎల్.ఆర్.ఎస్ సమయం పొడిగించాలి : బి.ఆర్.ఎస్ రాష్ట్ర నాయకులు, ఆలేరు మాజీ జెడ్పిటిసి బొట్ల పరమేశ్వర్
