విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న తాజా చిత్రం ’ఖుషి ’. నిన్ను కోరి, మజిలీ, టక్ జగదీష్ చిత్రాల ఫేమ్ శివ నిర్వాణ ఈ చిత్రానికి దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్ సంస్థ నిర్మిస్తున్నది. ఈ సినిమా చిత్రీకరణ పూర్తికాగా.. సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేశారు. ఇప్పటికే మేకర్స్ ఈ సినిమా నుంచి విడుదల చేసిన ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌తోపాటు ’నా రోజా నువ్వే’ ’ఆరాధ్య’ ’ఖుషి’ అంటూ సాగే పాటలకు సోషల్‌విూడియాలో మంచి స్పందన లభిస్తున్నది. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ సినిమా ట్రైలర్ అప్‌డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. ఎప్పుడెప్పుడా అని విజయ్, సమంత ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురు చేస్తున్న ట్రైలర్ అప్‌డేట్ వచ్చేసింది. ఆగష్టు 9న ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేయబోతున్నట్లు విజయ్ దేవరకొండ సోషల్ విూడియాలో వెల్లడిరచాడు. ఈ ట్రైలర్ 2 నిమిషాల 41 సెకన్ల నిడివి ఉందంటూ విజయ్ ట్విట్టర్‌లో తెలిపాడు. అంతకుముందు ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌కు సీబీఎఫ్‌సీ ’యూ’ సర్టిఫికేట్ ఇచ్చినట్లు విజయ్ తెలిపిన విషయం తెలిసిందే.
Related posts
-
రాఘవరాజ్ భట్ కు జాతీయ తులసి సమ్మాన్ పురస్కారం
Spread the love ప్రముఖ కథక్ నాట్యగురు రాఘవరాజ్ భట్ కు ప్రతిష్టాత్మక తులసి సమ్మాన్ లభించింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం సాంస్కృతిక శాఖ... -
చివరి వరకు సస్పెన్స్ మెయింటైన్ అవుతూనే ఉంటుంది.. “ఒక పథకం ప్రకారం” దర్శక, నిర్మాత వినోద్ కుమార్ విజయన్
Spread the love సంచలన దర్శకుడు పూరి జగన్నాధ్ సోదరుడు సాయిరామ్ శంకర్ నటించిన సీట్ ఎడ్జ్ సస్పెన్స్ థ్రిల్లర్ “ఒక... -
Oka Pathakam Prakaaram will Maintain Suspense Till The End: Director Vinod Kumar Vijayan
Spread the love Sai Ram Shankar, the younger brother of sensational director Puri Jagannadh, is starring in...