నిర్మాత కాట్రగడ్డ మురారి ఇకలేరు

katragadda murari no moer
Spread the love

ఎన్నో గొప్ప సినిమాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత కాట్రగడ్డ మురారి (78) కన్నుమూశారు. దీనితో తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. గత రాత్రి చెన్నైలోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన ‘యువ చిత్ర ఆర్ట్స్’ పేరుతో బ్యానర్ స్థాపించి ‘సీతామాలక్ష్మి’, ‘గోరింటాకు’, ‘త్రిశూలం’, ‘అభిమన్యుడు’, ‘సీతారామ కల్యాణం’, ‘శ్రీనివాస కల్యాణం’, ‘జానకి రాముడు’, ‘నారీనారీ నడుమ మురారి’ వంటి హిట్ సినిమాలు నిర్మించారు. శనివారం రాత్రి చెన్నైలోని తన నీలాంగరై నివాసంలో తుది శ్వాస విడిచారు. పలు సంచలనాత్మక చలన చిత్రాలను ఆయన నిర్మించారు. యువ చిత్ర బ్యానర్‌పై కాట్రగడ్డ మురారీ నిర్మించిన పలు సినిమాలు విజయాలు సొంతం చేసుకున్నాయి. విజయవాడ మొగల్రాజపురానికి చెందిన మురారి ఎంబీబీఎస్ చదువుతున్న రోజుల్లో సినిమాలు చూసి వాటిపై సమీక్షలు, వ్యాసాలు రాసేవారు. ఎంబీబీఎస్ చివరి సంవత్సరంలో ఉన్నప్పుడు దానిని వదిలేసి సినిమాలపై ఆసక్తితో చిత్రపరిశ్రమలో అడుగుపెట్టారు. దర్శకుడు మధుసూదనరావు వద్ద 1969లో సహాయ దర్శకుడిగా చేరారు. ‘మనుషులు మారాలి’ సినిమాకు తొలిసారి పనిచేశారు. ఆ తర్వాత దర్శకుడు చక్రపాణితో ఏర్పడిన పరిచయం ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది. వి.మధుసూదనరావు, ఆదుర్తి సుబ్బారావు, బాలచందర్, సేతుమాధవ్, బాపు వంటి ప్రముఖుల వద్ద సహాయ దర్శకుడిగా పనిచేశారు. ఆ తర్వాత నిర్మాతగా మారారు. ఎన్నో మంచి సినిమాలను చేశారు. మురారి మరణవార్త విని సినీ పరిశ్రమ దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. ఆయన మృతికి సినీ ప్రముఖులు నివాళులు అర్పించారు.

Related posts

Leave a Comment