నేషనల్ అవార్డ్ గెలుచుకున్న చిత్రం ‘కలర్ ఫోటో’.. బ్లాక్‌బస్టర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య ఎంటర్టైన్మెంట్స్ అధినేత రవీంద్ర బెనర్జీ ముప్పానేని రూపొందిస్తోన్నచిత్రం ‘దండోరా’. ఈ మూవీ శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ, మనికా చిక్కాల, మౌనికా రెడ్డి, బిందు మాధవి, రాధ్య, అదితి భావరాజు తదితరులు పాత్రధారులు. మురళీకాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. 25న మూవీ రిలీజ్ అవుతోంది. శనివారం ఈ సినిమా నుంచి టైటిల్ సాంగ్ రిలీజ్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్బంగా నటుడు శివాజీ మాట్లాడుతూ ..తెలంగాణ రూటెడ్ ఫిల్మ్ ఇది. నాకు డైరెక్టర్‌గారు స్క్రిప్ట్ చెప్పగానే ఏం చదువుకున్నారని అడిగాను. నేను అమెరికా నుంచి వచ్చానని ఆయన అన్నాడు. ఈ సినిమా గురించి చెప్పాలంటే ఎమోషన్స్‌తో కూడిన కమర్షియల్ మూవీ. జనాలకు సందేశాలు, సలహాలు ఇచ్చే పరిస్థితిలో ఈవాళ సినిమా లేదు. ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్, ఎమోషన్స్, డ్రామా, ఎగ్రెషన్ అన్నీ ఉన్నాయి. టైటిల్ వినగానే వన్ సైడ్ అయిపోతుందిగా అన్నాను. కానీ అది కాదు.. కామెడీ ఉన్నా అది దండోరా వేసినట్లే ఉంటుంది. ఎమోషన్స్ ఏదైనా దండోరా వేసినట్లే ఉంటుంది. కోర్ట్ కన్నా ముందే ఈ సినిమాను నేను కమిట్ అయ్యాను. ఫుల్టీ కంటెంట్ లోడెడ్ మూవీ. ఏ లాంగ్వేజ్‌లో వచ్చినా సినిమా ఆడుతుందనేది నా అభిప్రాయం. స్క్రీన్ స్పేస్ అనేది పక్కన పెడితే ఇందులో నటించిన అందరికీ ఓ ఇంపార్టెన్స్ ఉంటుంది. ప్రతీ క్యారెక్టర్‌కి ఓ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. నేనైదే 90స్ కథ వినేటప్పుడు నేనెలాగైతే ఫీల్ అయ్యానో.. ఈ కథ విన్నప్పుడు అలాగే అనిపించింది. మంచి కథలు, పాత్రలు చేయాలనుకుంటున్న సమయంలో నేను విన్న 70-80 కథల్లో నాకు నచ్చిన కథల్లో ఇదొకటి. ఇందులో కులాలు, మతాలు అనే కాన్సెప్ట్ ఉండదు. నాకు తెలిసి ఈ ప్రపంచంలో రెండే కులాలు.. ఒకటి డబ్బున్నోడు.. రెండోది డబ్బులేనోడు. ఒకడేమో తొక్కాలని, రెండో వాడేమో తొక్కినా లేవాలని చూస్తుంటారు. ఇందులో పాత్రలు కూడా అలాగే ఉంటాయి. చాలా మంచి కథ. ఈ సినిమా కథ గురించి దేశం (ఫిల్మ్ ఫెటర్నిటీస్) మాట్లాడుదుందేమోనని పిస్తోంది. మంచి ఆర్టిస్టులు కుదిరారు. డిసెంబర్ 23 నుంచి ఓవర్సీస్లో ప్రీమియర్స్ ఉంటాయి. అదే రోజున ఇక్కడ వేద్దామని అంటున్నాను. కథను నమ్మి చేసిన సినిమా. ప్రేక్షకుల ఆశీర్వాదం కావాలి. మురళీగారికి, బెన్నీగారికి, మైత్రీ, ప్రైమ్ షో, అథర్వణ భద్రకాళి పిక్చర్స్ వారికి థాంక్స్’’ అన్నారు.
ఈ కార్యక్రమంలో మైత్రీ శశిధర్ మాట్లాడుతూ ‘‘మాకు ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసే అవకాశం ఇచ్చిన నిర్మాత రవీంద్ర బెనర్జీగారికి థాంక్స్. మేం సినిమాను చూశాం. కచ్చితంగా సినిమా హార్డ్ హిట్ సినిమాగా అన్నీ వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తుంది. డిసెంబర్ 25న రిలీజ్ అవుతోన్న ఈ సినిమాను అందరూ థియేటర్స్‌లో చూడాలని కోరుకుంటున్నాను. శివాజీగారు సహా నటీనటులందరూ చాలా బాగా యాక్ట్ చేశారు. మంచి లవ్ స్టోరీ ఉంది. సినిమా నుంచి బయటకు వచ్చేటప్పుడు హై మూమెంట్‌తో బయటకు వస్తారు’’ అన్నారు.
దర్శకుడు మురళీకాంత్ మాట్లాడుతూ ‘‘మార్క్ అద్భుతమైన సంగీతాన్నిచ్చారు. తను మా సినిమా కోసం కంపోజ్ చేసిన తొలి పాట ఇది. పాటలోని ఇంటెన్సిటీ అర్థమై ఉంటుందని అనుకుంటున్నాను. మరో పాటను రిలీజ్ చేయటానికి ప్లాన్ చేస్తున్నాం. డిసెంబర్ 25న రిలీజ్ అవుతోన్న సినిమాలో ఏం చెప్పాలనుకున్నామో థియేటర్స్‌కు వస్తే తెలుస్తుంది. అందరూ వచ్చి సపోర్ట్ చేయండి’’ అన్నారు.
నిర్మాత రవీంద్ర బెనర్జీ ముప్పనేని మాట్లాడుతూ ‘‘దండోరా టైటిల్ సాంగ్ అందరికీ నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను. పాటలో ఉన్న ఎమోషన్ ఏదైతే ఉందో.. అదే సినిమాలోనూ కనిపిస్తుంది. సినిమా చేసేటప్పుడు మాకు కొన్ని డౌట్స్ ఉండేవి. అయితే మంచి కంటెంట్‌ను ప్రేక్షకులు ఎప్పటికీ ఆదరిస్తారనే నమ్మకంతో ముందడుగు వేశాం. అదే నమ్మకం నిజమైంది. ఎందుకంటే సినిమా చూడగానే శశిధర్గారు, నిరంజన్‌గారు, మా ఓవర్సీస్ బయ్యర్ అథర్వణ భద్రకాళి పిక్చర్స్ సహా అందరికీ థాంక్స్. ఓవర్సీస్లో డిసెంబర్ 23నే ప్రీమియర్స్ ఉంటాయి. ఇక్కడ కూడా ముందుగానే ప్రీమియర్స్ ఎప్పుడనే చెబుతాం’’ అన్నారు.
హీరో రవికృష్ణ మాట్లాడుతూ ‘‘దండోరా..ఈ ఏడాది అందరూ గుర్తు పెట్టకునే సినిమా అవుద్ది. టీజర్ నుంచి ఇప్పటి వరకు మా కంటెంట్‌ను చూసిన వాళ్లు చాలా బావుందని అప్రిషియేట్ చేస్తున్నాను. జెన్యూన్‌గా చాలా మంచి సినిమా చేశామని చెబుతున్నాను. మార్క్ నెక్ట్స్ లెవల్ మ్యూజిక్ ఇచ్చాడు. డిసెంబర్ 25న మీ ముందుకు వస్తున్నాం. మీ లవ్ అండ్ సపోర్ట్ మాకు ఉండాలని కోరుకుంటున్నాం’’ అన్నారు.
హీరో నందు మాట్లాడుతూ ‘‘మార్క్ కె రాబిన్ చాలా మంచి మ్యూజిక్ చేస్తుంటారు. అయితే చాలా సందర్భాల్లో ఆయన పేరు ముందు రాలేదు. కానీ ఈ సాంగ్‌తో ఆయనకు చాలా మంచి పేరు వస్తుంది. కాసర్ల శ్యామ్‌గారు అద్భుతమైన సాహిత్యాన్ని ఇచ్చారు. కరెక్ట్‌గా విని అర్థం చేసుకుంటే ఏం చెప్పాలనకున్నారనేది అర్థమవుతుంది. చాలా ఇంటెన్స్ మూవీ. కుల వ్యవస్థపై జరుగుతున్న చాలా లోతైన విషయాలను.. మంచి ఇంపాక్ట్ పాయింట్‌ను హ్యుమరస్‌గా, కమర్షియల్‌గా డైరెక్టర్ చెప్పారు. తొలి సినిమాకే మురళీకాంత్‌గారు ఇంత స్పాన్ ఉన్న కథను ఇలా చెప్పటం గొప్ప విషయం. మా నిర్మాతగారు ఇది వరకు కలర్ ఫొటో, బెదురులంక వంటి యూనిక్ స్క్రిప్ట్స్‌తో సినిమాలు చేశారు. ఇప్పుడలాంటి పాయింట్‌తోనే దండోరా సినిమా చేశారు. ఇలాంటి మంచి సినిమాలు చేసినప్పుడు మైత్రీ మూవీస్ శశిధర్గారికి, ప్రైమ్ షో వాళ్లకి, ఓవర్సీస్లో డిస్ట్రిబ్యూట్ చేస్తోన్న అథర్వణ భద్రకాళి పిక్చర్స్ వాళ్లకు థాంక్స్. డిసెంబర్ 25న మీ ముందుకు వస్తున్నాం. తప్పకుండా అందరికీ నచ్చుతుంది’’ అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ మార్క్ కె రాబిన్ మాట్లాడుతూ ‘‘డైరెక్టర్‌గారు నాకు స్టోరీ నెరేట్ చేసిన తర్వాత కంపోజ్ చేసిన సాంగ్ ఇదే. తనకేం కావాలనే దానిపై స్ట్రాంగ్ క్లారిటీ ఉన్న డైరెక్టర్. నిర్మాతగారి సపోర్ట్‌కి థాంక్స్. నటీనటులందరూ సూపర్బ్‌గా పెర్ఫామ్ చేశారు’’ అన్నారు.
హీరోయిన్ మణిక మాట్లాడుతూ ‘‘నేను కూడా ఇప్పుడే సాంగ్ చూశాను. చాలా బావుంది. మార్క్గారు అద్భుతంగా కంపోజ్ చేశారు. డిసెంబర్ 25న మూవీ మీ ముందుకు రానుంది. అందరూ తప్పకుండా సినిమా చూడండి. ఈ సినిమా, టీమ్‌తో భాగం కావటంపై నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను’’ అన్నారు.
ఎడిటర్ సృజన మాట్లాడుతూ ‘‘‘దండోరా’ సినిమాలో నన్ను భాగం చేసిన దర్శకుడు మురళీకాంత్గారికి, నిర్మాత రవీంద్ర బెనర్జీగారికి థాంక్స్. డిసెంబర్ 25 కోసం నేను కూడా ఆసక్తిగా వెయిట్ చేస్తున్నాను’’ అన్నారు.
25న ‘దండోరా’ వేసినట్లే..
