– పేద జర్నలిస్టులు ఓ ఇంటివాళ్ళను చేయండి
– JNJ సొసైటీకి కేటాయించిన స్థలాలు అప్పగించాలి
– ప్లాట్లు చేసుకునేందుకు సహకరించాలని అధికారులను ఆదేశించండి
– సీఎం రేవంత్ రెడ్డికి JNJ సభ్యుల వినతి
జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీకి రేవంత్ రెడ్డి ప్రభుత్వం 38 ఎకరాలు అప్పగించి ఏడాది పూర్తి అయింది.. అయినా ప్రభుత్వ అధికారులు కేసులు ఉన్నాయన్న సాకుతో సొసైటీకి పెట్ బషీరాబాద్ స్థలాన్ని సొసైటీకి హ్యాండ్ ఓవర్ చేయలేదు. దీంతో పేద జర్నలిస్టులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. 1100 మంది సీనియర్ జర్నలిస్టుల్లో సగం మందికి పైగా కెరీర్ చరమాంకంలో ఉన్నారు. ఇప్పటికే 80 మంది జర్నలిస్టు మృత్యువాత పడ్డారు.. మరో 300 మంది జర్నలిస్టులు అనారోగ్య సమస్యలతో మంచాన పడ్డారు. జర్నలిస్టుల జీవితకాల కోరిక అయిన సొంత గూడు కోసం తపిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి చొరవ తీసుకొని JNJ సొసైటీకి 18 ఏళ్ల క్రితం అప్పటి సీఎం Y.S. రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చిన 70 ఎకరాల స్థలాన్ని JNJ సొసైటీ సభ్యులు లే అవుట్ వేసుకొని స్థలాలు పంచుకునేందుకు సహకరించాల్సిందిగా ప్రభుత్వ అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించాలని కోరుతూ JNJ సొసైటీ జర్నలిస్టులు ఈరోజు రిలే నిరాహార దీక్షను ప్రారంభించారు. స్థలాలు సాధించే వరకు దీక్షను విరమించేది లేదని స్పష్టం చేశారు.
