సూపర్ స్టార్ కు బ్లాక్‌ బస్టర్‌ ఇచ్చిన ‘జైలర్‌’

'Jailer' gave blockbuster to superstar
Spread the love

కమల్‌ హాసన్‌ ‘విక్రమ్‌’ సినిమా లాస్ట్‌ ఇయర్‌ వచ్చిన బ్లాక్‌ బస్టర్‌ సినిమాల్లో ఒకటి మాత్రమే కాదు కోలీవుడ్‌ లో వచ్చిన క్లాసిక్‌ సినిమాల్లో కూడా ఒకటని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. లోకేష్‌ కనగరాజ్‌ బ్రిలియంట్‌ డైరెక్షన్‌ ఏంటి అన్నది ‘విక్రమ్‌’తో చూపించాడు. సరైన హిట్‌ పడితే కమల్‌ హాసన్‌ బాక్సాఫీస్‌ రేంజ్‌ ఏంటన్నది ‘విక్రమ్‌’ చూపించింది. అయితే తాజాగా వచ్చిన సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ‘జైలర్‌’ కూడా వసూళ్లతో అదరగొట్టేస్తుంది. రజనీకాంత్‌కు కూడా జైలర్‌’ ఒక సూపర్‌ కమ్‌ బ్యాక్‌ మూవీ అని చెప్పొచ్చు. అయితే కమర్షియల్‌ గా విక్రమ్‌ కలెక్షన్స్‌ ని జైలర్‌ దాటేసిందని తెలుస్తున్నా ‘విక్రమ్‌’ తో పోలిస్తే ‘జైలర్‌’ చాలా వెనుక ఉంటుందని చెప్పొచ్చు. ‘జైలర్‌’ డైరెక్టర్‌ నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ కూడా తన మార్క్‌ డైరెక్షన్‌ తో సూపర్‌ స్టార్‌ ఫ్యాన్స్‌ అంచనాలకు తగినట్టుగా సినిమా చేశాడు. అయితే ‘జైలర్‌’ సినిమా రొటీన్‌ రెగ్యులర్‌ కథ.. ఫస్ట్‌ హాఫ్‌ బాగున్నా సెకండ్‌ హాఫ్‌ ఆశించిన స్థాయిలో లేదు.రజనీకాంత్‌కు ఉన్న ఫ్యాన్‌ బేస్‌ మీద సినిమా ఇలా కలెక్షన్స్‌ రాబడుతుంది. కమల్‌ కి విక్రమ్‌ లానే రజనీకాంత్‌కు ‘జైలర్‌’ అని కోలీవుడ్‌ ఫ్యాన్స్‌ చెప్పుకుంటున్నారు. విక్రమ్‌, జైలర్‌ రెండు సూపర్‌ హిట్‌ అయినందుకు ఫ్యాన్స్‌ సంతోషపడటంలో తప్పులేదు!

Related posts

Leave a Comment