బాలీవుడ్‌లో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘రామాయణ’ నితీశ్ తివారీ దర్శకత్వంలో బాలీవుడ్ అగ్ర నిర్మాతలతో కలిసి భారీ బడ్జెట్‌తో అల్ల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో రాముడిగా రణ్‌బీర్ కపూర్ నటిస్తుండగా.. సీతగా సాయిపల్లవి కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ అపడేట్‌ను రణ్‌బీర్ పంచుకున్నారు. ‘‘రామాయణ ప్రాజెక్ట్‌లో వర్క్ చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఇది ఎంతో గొప్ప కథ. చిన్నప్పటినుంచి వింటూ పెరిగాం. ఎంతోమంది ప్రతిభావంతులైన కళాకారులు ఇందులో వర్క్ చేస్తున్నారు. నితీశ్ తివారి అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. రెండు పార్టులుగా ఈ చిత్రం విడుదల కానుంది. పార్ట్1లో నా భాగం షూటింగ్ పూర్తి చేశాను. త్వరలోనే పార్ట్2 చిత్రీకరణ కూడా మొదలవుతుంది. ఇలాంటి పాత్రలో నటించడం నాకు కల. ఈ చిత్రంతో ఆ కల నిజమైంది. మన భారతీయ సంస్కృతి, గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిచెప్పే గొప్ప సినిమా ‘రామాయణ’’ అని అన్నారు. ఇటీవలే ఈ సినిమా గురించి నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. విడుదల తేదీలను తెలుపుతూ పోస్టర్ విడుదల చేసింది. 2026 దీపావళికి మొదటి పార్టు , 2027లో రెండో పార్ట్ విడుదల కానుంది. ఈ చిత్రం గురించి చాలా కాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఫొటోలు షేర్ అవుతూనే ఉన్నాయి. సైలెంట్‌గా చిత్రీకరణను పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో తన పాత్ర కోసం రణ్‌బీర్ శిక్షణ తీసుకున్నారు. డైట్ ఫాలో అవుతున్నట్లు తెలిపారు. ఈ సినిమా పూర్తయ్యే వరకే మధ్యం మానేసినట్లు చెప్పారు. ఇక సీత పాత్రలో నటించడం తన అదృష్టమని సాయిపల్లవి చెప్పారు. ఇక ఇందులో రావణుడిగా యశ్ కనిపించనున్నారు. హనుమంతుడి పాత్రలో సన్నీ దేవోల్, కైకేయిగా లారా దత్తా, శూర్పణఖగా రకుల్ ప్రీత్‌సింగ్ కనిపించనున్నట్లు సమాచారం.
Related posts
-
చిత్ర పరిశ్రమ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తా.. చలన చిత్ర అభివృద్ధి సంస్థ నూతన చైర్మన్ దిల్ రాజ్
Spread the love రాష్ట్ర చలన చిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా వి. వెంకట రమణ రెడ్డి @ దిల్ రాజు బుధవారం... -
అత్యంత ఘనంగా ‘నాగన్న’ మూవీ ట్రైలర్ విడుదల
Spread the love చాందిని క్రియేషన్స్ బ్యానర్ పై మహేష్ కుమార్ హీరోగా, చిత్రం శ్రీను ప్రధాన పాత్రలో నెక్కింటి నాగరాజు నిర్మిస్తున్న... -
జనవరి 1 న విడుదల కానున్న క్రావెన్: ది హంటర్
Spread the love మైండ్ బ్లోయింగ్ యాక్షన్ డ్రామా, క్రావెన్: ది హంటర్ ఇంకో రెండు వారాల్లో థియేటర్లలో విడుదల కానుంది....