ఈ నెల 20-21 తేదీలలో ఎకాగ్రా ఇంటర్ నేషనల్ ఓపెన్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్ హైదరాబాద్ లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ హాలులో ప్రారంభం కానుంది. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో…. ఏకాగ్రా ఇంటర్నేషనల్ చెస్ టోర్నమెంట్ వైస్ చైర్మన్, సీనియర్ పాత్రికేయుడు, ఫిల్మ్ మేకర్, నంది అవార్డు గ్రహీత షరీఫ్ మహమ్మద్ మాట్లాడుతూ .. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఇలాంటి టోర్నమెంట్ జరుగుతోందని, భారీ మొత్తాన్ని 22 లక్షల 22 వేల 222 రూపాయలను ప్రైజ్ మనీగా విజేతలకు ఇవ్వ నున్నట్టు చెప్పారు. ఈ టోర్నమెంట్లో పాల్గొనడానికి 5 వేల రూపాయలు ఎంట్రీ ఫీజుగా నిర్ణయించినట్టు చెప్పారు. ఇంటర్నేషనల్ మాస్టర్ లకు, గ్రాండ్ మాస్టర్లకు, వుమెన్ ఇంటర్నేషనల్ మాస్టర్లకు, ఉమెన్ గ్రాండ్ మాస్టార్లకు ఎలాంటి ఎంట్రీ ఫీజు లేదని కూడా ఆయన చెప్పారు. క్రీడాకారులు 5 వేల రూపాయలతో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి చివరితేదీ డిసెంబర్ 15. అపరాధ రుసుము వెయ్యి రాపాయలు కలిపి 6 వేల రూపాయలతో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి డిసెంబర్ 18 వ తేదీ చివరి తేది. కాగా క్రీడాకారులు ఆన్ లైన్ లోనే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మా వెబ్సైట్ www.EKAGRA CHESS ACADEMY. COM లో లాగిన్ అయి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చనని షరీఫ్ మహ్మద్ అన్నారు మరిన్ని వివరాలకు +91 7981358105, +91 626 464 64 22, +91 7842843999 ఫోన్ నెంబర్లలో సంప్రదించవచ్చునని ఆయన తెలిపారు. ఈ టోర్నమెంట్ ను ప్రైమ్ 9 TV తో కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్నట్టు చెప్పారు. నెదర్ల్యాండ్ కు చెందిన టివల్ కోవు సెరిజ్, రష్యాకు చెందిన సవ్ చెంకో బోరిస్, బల్గేరియాకు చెందిన పెట్రోవ్ మరియన్, భారత్ కు చెందిన రాయ్ చౌదరి సప్తర్షిలాంటి గ్రాండ్ మాస్టార్లు ఈ టోర్న మెంట్లో పాల్గొంటారు అని ఆయన తెలిపారు. చదరంగంలో విశ్వ విజేతలను అందించడమే ఏకాగ్రా చెస్ అకాడమీ లక్ష్యమని.. యువతను ప్రోత్సహించడానికి 2020లో ఏకాగ్రా చెస్ అకాడమీ ఏర్పాటు చేసి ఇప్పటి వరకు వేలాదిమంది క్రీడా కారులకు శిక్షణ ఇచ్చినట్టు టోర్నమెంట్ డైరెక్టర్ గిరీష్ రెడ్డి చెప్పారు. 2022లో నిర్వహించిన ఏకగ్రా ఫిడే రేటెడ్ ఓపెన్ టోర్నమెంట్లో గ్రాండ్ మాస్టార్లు, ఇంటర్ నేషనల్ మాస్టార్లతో సహా 13 వందలకు పైగా క్రీడాకారులు పాల్గొన్నట్టు గిరీష్ రెడ్డి తెలిపారు. చెస్ అన్ని వయసుల వారు ఆడే క్రీడ అని ఈ ఆటలో వారికి తగిన మెళకువలు క్రమశిక్షణ, సూచనలు ఇస్తే వారు రానున్న రోజుల్లో మేటి క్రీడాకారులుగా, అంతర్జాతీయ, జాతీయ స్థాయిలలో విజయాలను సాధించేలా తీర్చి దిద్దడమే ఏకాగ్రా ధ్యేయమని గిరీష్ రెడ్డి చెప్పారు. తెలంగాణ క్రీడాకారులు గ్రాండ్ మాస్టార్లుగా ఎదగడానికి తమ అకాడమీ శిక్షణ ఇస్తుందని,ఈ టోర్నమెంట్లో గెలు పొందిన విద్యార్థులు తమ సంస్థ నిర్వహించే ఏకాగ్రా చెస్ స్కాలర్ ఎంపికకు అర్హులని గిరీష్ రెడ్డి చెప్పారు.
వుమెను ఆర్గనైజింగ్ సెక్రటరీ సౌమ్య జాను మాట్లాడుతూ తమ సంస్థ భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని టోర్న మెంట్లను నిర్వహించనున్నదని చెప్పారు. ప్రపంచంలో తెలివైన ఆటగా ప్రసిద్ధి కెక్కన్ చెస్ తో ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం, జ్ఞాపక శక్తి పెరుగుతాయని కూడా ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రశాంత్,నితిన్,సోహెల్ తదితరులు పాల్గొన్నారు.
ఏకాగ్రా ఇంటర్ నేషనల్ ఓపెన్ రాపిడ్ చెస్ టోర్నమెంట్ డిసెంబర్ 20-21 తేదీలలో హైదరాబాద్ లో ప్రారంభం
