* ‘తమిళ వేట్రి కజగమ్’ పేరుతో పార్టీ ప్రకటన
* తమిళనాట మరో ప్రాంతీయపార్టీ
తమిళనాట మరో సినీహీరో రాజకీయరంగ ప్రవేశం చేస్తున్నారు. ఏకంగా పార్టీని ప్రకటించి రాకీయాల్లోకి రాబోతున్నారు. ‘తమిళగ వేట్రి కజగమ్ -టీవీపీ’ పేరుతో పార్టీని స్థాపిస్తున్నట్లు విజయ్ వెల్లడిరచారు. ఈ విషయాన్ని హీరో విజయ్ స్వయంగా సోషల్ విూడియా వేదికగా ప్రకటించారు. ఈ క్రమంలోనే ‘తమిళగ వేట్రి కజగమ్’ పార్టీ నేతలు.. విజయ్‌ని పార్టీ అధినేతగా ఎన్నుకున్నారు. ‘తమిళగ వేట్రి కజగమ్’ అంటే తమిళనాడు విజయ పార్టీ అని అర్థం.యితే తాము 2024 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయడం లేదని విజయ్ స్పష్టం చేశారు. అంతే కాకుండా ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతు ప్రకటించేది లేదని తేల్చి చెప్పారు. ఈ నిర్ణయాన్ని తమ పార్టీ జనరల్ అండ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్నట్లు విజయ్ తెలిపారు. తమిళగ వేట్రి కజగమ్ పార్టీ ముఖ్య ఉద్దేశం 2026 లో తమిళనాడులో జరిగే అసెంబ్లీ ఎన్నికలే అని ఈ నిర్ణయంతో స్పష్టం అవుతోంది. అయితే హీరో విజయ్ పార్టీ పెట్టనున్నట్లు గత కొన్నేళ్లుగా ప్రచారం జరుగుతోంది. ఆ దిశగానే విజయ్ చేసిన కొన్ని ప్రకటనలు, చేసిన పనులు ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నారనే వార్తలకు బలం చేకూర్చాయి. కానీ ఆయన మాత్రం ఎక్కడా బహిరంగంగా ప్రకటన చేయలేదు. ఈ క్రమంలోనే ఇటీవల తన అభిమానులు, సన్నిహితులు, ఇతర వర్గాల వారితో విజయ్ వరుస భేటీలు నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే రాజకీయాల్లోకి విజయ్ అరంగేట్రం చేస్తారనే వార్తలు జోరందుకున్నాయి. ఈ క్రమంలోనే విజయ్ తాజాగా పార్టీ పేరును ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. కొత్తగా పార్టీ పెట్టిన తమిళనాడు ఇళయ దళపతి హీరో విజయ్ దగ్గర ఎంత ఆస్తి ఉంది.. ఎంత డబ్బు ఉంది అనేది ఇప్పుడు చర్చనీయాం శం అయ్యింది. రాజకీయ పార్టీ పెట్టినట్లు ప్రకటించిన వెంటనే.. విజయ్ ఆస్తులు ఎంత అనే ప్రశ్నలను గూగుల్ లో తెగ వెతికేశారు నెటిజన్లు. హీరో విజయ్ ఆస్తులు.. 2023 జనవరి నాటికి.. గూగుల్ లో వివిధ కథనాల ప్రకారం స్థిరాస్తులు 445 కోట్లు.. అంటే ఇళ్లు, పొలాలు, స్థలాలు ఇలా.. స్థిరాస్థిగా ఆయన ఇన్ కం ట్యాక్స్ అధికారులకు చూపించింది 445 కోట్ల రూపాయలు. ఇది గవర్నమెంట్ వ్యాల్యూనే.. మార్కెట్ వ్యాల్యూ ఐదారు ఇంతలు ఉండొచ్చు.. ఇవన్నీ స్థిరాస్తులు.. మరి రాజకీయం చేయటానికి ఈ డబ్బు సరిపోతుందా అంటే.. సరిపోతుందని అభిమానులు అంటున్నారు. సినిమాల్లో రెమ్యునరేషన్ విషయానికి వస్తే.. సౌత్ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీలోని బిగ్గెస్ట్ స్టార్స్‌లో విజయ్ ఒకరు. రజినీకాంత్, షారుఖ్, అక్షయ్ కుమార్ వంటి నటులకు సమానంగా రెమ్యునరేషన్ అందుకుంటున్నాడు. రీసెంట్‌గా జైలర్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్ డైరెక్షన్‌లో వచ్చిన బీస్ట్ సినిమాకు రూ.100 కోట్లు తీసుకున్నట్లు టాక్. వంశీ పైడిపల్లి తెరకెక్కించిన వారసుడు మూవీకి రూ.150 కోట్ల వరకు రెమ్యునరేషన్ రూపంలో ముట్టినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. విజయ్ ఇప్పటి వరకు 61 చిత్రాలలో నటించి.. ఎన్నో అవార్డ్స్ తో పాటు పెద్ద ఎత్తున అభిమానులను సొంతం చేసుకున్నారు. విజయ్ కి అంతర్జాతీయ స్థాయిలో డై హార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన మూడు తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్, ఒక కాస్మోపోలిటన్ పురస్కారం, ఎనిమిది విజయ్ పురస్కారాలు, మూడు ఎడిసన్ పురస్కారాలు, రెండు వికటన్ అవార్డులు దక్కించుకున్నాడు. ఇప్పటివరకు తాను ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేయాలని తాను నిర్ణయం తీసుకున్నట్లు విజయ్ వెల్లడిరచారు. అలా చేసినపుడే పార్టీ కార్యక్రమాల కోసం తన పూర్తి సమయాన్ని వెచ్చించే అవకాశం ఉంటుందని.. రాజకీయాల్లో ప్రజలకు సేవ చేసే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. తమిళగ వేట్రి కజగమ్ పార్టీ పెట్టి రాజకీయాల్లోకి రావడం.. తమిళనాడు ప్రజలకు కృతజ్ఞతగా భావిస్తున్నానని తెలిపారు. తమిళ సినిమాలో తర్వాతి రజినీకాంత్‌గా భావించే విజయ్.. ఇప్పటివరకు 68 సినిమాల్లో నటించారు. అయితే గత దశాబ్ద కాలంగా రాజకీయాల్లోకి రావాలని విజయ్ భావించినట్లు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఇందులో భాగంగానే పేదలకు ఉచిత భోజనం, విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, లైబ్రరీలు, ట్యూషన్లు, న్యాయ సహాయం వంటి అనేక స్వచ్ఛంద, సంక్షేమ కార్యక్రమాల్లో విజయ్ అభిమాన సంఘాలు పాల్గొంటున్నాయి.