నేపాలీ , తెలుగు బాషల్లో బ్రహ్మానందం ‘హ్రశ్వ దీర్ఘ’ రిలీజ్ డేట్ పోస్టర్ విడుదల

Brahmanandam 'Hraswa Dirgh' release date poster released in Nepali and Telugu languages
Brahmanandam 'Hraswa Dirgh' release date poster released in Nepali and Telugu languages
Spread the love

ఈరోజు హాస్య బ్రహ్మ పుట్టినరోజు. ఇంకో రకంగా నవ్వుకి పుట్టినరోజు అనాలి. ఈ సందర్భంగా బ్రహ్మానందం కీలక పాత్ర పోషిస్తున్న మొట్ట మొదటి తెలుగు- నేపాలీ చిత్రమైన ‘హ్రశ్వ దీర్ఘ’ నుండి ఆయన పాత్రకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ అలాగే విడుదల తేదీని ప్రకటించడం జరిగింది. 2024 సెప్టెంబర్ 27 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది ‘హ్రశ్వ దీర్ఘ’. ఇక హరిహర్ అధికారి,నీతా దుంగన లీడ్ రోల్స్ చేస్తున్నారు. ప్రదీప్ రావత్, మొహమ్మద్ అలీ, సునీల్ వర్మ, కభీర్ దుహన్ సింగ్ , సరోజ్ ఖనాల్ వంటి వారు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ‘నీతా ఫిలిమ్స్ ప్రొడక్షన్’ బ్యానర్ పై నీతా దుంగన ఈ చిత్రాన్ని నిర్మిస్తూ ఉండగా హరిహర్ అధికారి కథని అందిస్తున్నారు. చంద్ర పంత్ దర్శకుడు.