ప్రస్తుతం ఇండస్ట్రీలో పెళ్లి భాజాలు మోగుతున్నాయి. త్వరలో వరుణ్`లావణ్య త్రిపాఠీలు మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కానుండగా.. తాజాగా మరో సినీ సెలబ్రెటీ జంట పెళ్లి బంధంతో ఒక్కటి కానుంది. యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా పెద్ద కూతురు ఐశ్వర్య.. తమిళ నటుడు తంబీ రామయ్య కొడుకు, ఉమాపతి రామయ్యతో ఘనంగా ఎంగేజ్మెంట్ జరుపుకుంది. గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట అక్టోబర్ 27న చెన్నైలో అంగరంగ వైభవంగా నిశ్చితార్థపు వేడుక జరుపుకున్నారు. ఈ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులతో పాటు అత్యంత సన్నిహితులు హాజరయ్యారు. ప్రస్తుతం వీరి ఎంగేజ్మెంట్కు సంబంధించిన ఫోటోలు సోషల్ విూడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
అర్జున్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఓ రియాలిటీ షోలో ఉమాపతి పాల్గొనడంతో ఇరు కుటుంబాల మధ్య పరిచయం ఏర్పడిరదట. ఈ క్రమంలో ఉమాపతి, ఐశ్వర్య మధ్య ప్రేమ చిగురించింది. ఇక ఇదే విషయాన్ని ఇంట్లో చెప్పడంతో వాళ్లు కూడా అంగీకరించారు. తంబీ రామయ్య తమిళంలో పేరున్న నటుడు. వందలాది సినిమాల్లో.. పెద్ద పెద్ద స్టార్ హీరోలతో నటించాడు. ఇక ఉమాపతి రామయ్య కూడా తమిళంలో నటుడిగా కొనసాగుతున్నాడు. హీరోగా ఉమాపతి రామయ్య నాలుగు సినిమలు చేశాడు. ఇక ఐశ్వర్య సర్జా మనకు సుపరిచితమే. ఆ మధ్య విశ్వక్ సేన్‌తో అర్జున్ ప్లాన్ చేసిన సినిమాలో హీరోయిన్గా ఐశ్వర్యనే నటించింది. వీళ్లకు సంబంధించిన కొన్ని సీన్ల షూటింగ్ కూడా పూర్తయింది. అయితే విశ్వక్‌కు, అర్జున్‌కు మధ్య విభేదాలు రావడంతో అర్థాంతరంగా షూటింగ్ ఆగిపోయింది. విశాల్ హీరోగా నటించిన పట్టత్తు యానై సినిమాతో ఐశ్వర్య సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో ధీరుడు పేరుతో ఈ సినిమ డబ్ అయింది. ఆ తర్వాత 5ఏళ్లు గ్యాప్ తీసుకుని అర్జున్ దర్శకత్వం వహించిన ప్రేమ బరహ సినిమాలో నటించింది.