దుల్కర్ సల్మాన్ ‘కింగ్‌ ఆఫ్‌ కోత’ నుంచి హల్లా మచారే పాట విడుదల

Halla Machare song from Dulquer Salmaan's 'King of Kota' released
Spread the love

దుల్కర్‌ సల్మాన్ హీరోగా నటిస్తున్న పాన్‌ ఇండియా మాస్ ఎంటర్‌టైనర్ ‘కింగ్‌ ఆఫ్‌ కోత’. జీ స్టూడియోస్, వేఫేరర్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అభిలాష్ జోషి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రంలోని ప్రమోషనల్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ‘కింగ్‌ ఆఫ్‌ కోత’ మ్యూజికల్ జర్నీ ప్రారంభమైయింది. జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి హల్లా మచారే అనే పాటని విడుదల చేశారు మేకర్స్. ఎనర్జిటిక్ పుట్ ట్యాపింగ్ నెంబర్ గా ఈ పాటని స్వరపరిచారు జేక్స్ బిజోయ్. ఎల్‌వి రేవంత్, సింధూజ శ్రీనివాసన్ ఎనర్జిటిక్ గా పాడిన పాటకు కృష్ణకాంత్ సాహిత్యం మరింత ఆకర్షణగా నిలిచింది. ఈ పాటలో దుల్కర్ సల్మాన్ మాస్ డ్యాన్స్ మూమెంట్స్ ఎంతగానో ఆకట్టుకున్నాయి. జీ స్టూడియోస్, వేఫేరర్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రం యూనిక్ కంటెంట్, ఎంటర్ టైన్ మెంట్ తో ప్రేక్షకులను అలరించనుంది. ఈ చిత్రంలో డ్యాన్సింగ్ రోజ్, ప్రసన్న, ఐశ్వర్య లక్ష్మి, నైలా ఉష, చెంబన్ వినోద్, గోకుల్ సురేష్, షమ్మి తిలకన్, శాంతి కృష్ణ, వడ చెన్నై శరణ్, అనిఖా సురేంద్రన్ వంటి ప్రముఖ తారాగణం ఉంది. చిత్రాన్ని ఈ ఏడాది ఓనం పండుగ కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Related posts

Leave a Comment