Guntur Kaaram Movie Review in Telugu : ‘గుంటూరు కారం’ రుచి చూడాల్సిందే…!

Guntur Kaaram Movie Review in Telugu
Spread the love

సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ‘గుంటూరు కారం’ కోసం ముచ్చటగా మూడోసారి చేతులు కలిపారు. అతడు, ఖలేజా వంటి కల్ట్ క్లాసిక్ సినిమాల తర్వాత వారి కలయికలో వచ్చిన మూడో చిత్రమిది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. అతడు, ఖలేజా వంటి కల్ట్ క్లాసిక్ సినిమాల తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు …దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ కావడంతో సహజంగానే సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. మహేష్ బాబు … త్రివిక్రమ్ కాంబో అంటే సినిమాపై ఏ విధంగా అంచనాలు ఏర్పడతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వీరి కాంబోలో అతడు, ఖలేజా వంటి కల్ట్ క్లాసిక్ చిత్రాలు వచ్చాయి. బాక్సాఫీస్ ఫలితాల్ని పక్కన పెడితే వాటికి ఎప్పుడూ సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. అయితే ఈ సారి కమర్షియల్‌గానూ గట్టిగా సౌండ్ చేసేందుకు ‘గుంటూరు కారం’ అంటూ వచ్చారు. శ్రీలీల, మీనాక్షి, రమ్యకృష్ణ, జయరామ్, ప్రకాశ్ రాజ్ ఇలా చాలా భారీ తారాగణంతో త్రివిక్రమ్ తీసిన ఈ చిత్రం భారీ అంచనాల నడుమ సంక్రాంతి కానుకగా నేడు (జనవరి 12, 2024)న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదలయింది. ఈ చిత్రానికి ఎస్. థమన్ సంగీతం అందించారు. ఈ సినిమా విడుదలకు ముందు ఓ రేంజ్ లో హైప్ క్రియేటైంది. హైదరాబాద్ లో ఒక రోజు ముందు నుంచే మహేష్ ఫ్యాన్స్ హడావిడి మొదలైంది. అర్ధరాత్రి 1, తెల్లవారుఝామున 4 గంటల షోలకే వాళ్లు ఎగబడ్డారు. ఒక్కో టికెట్ వేల ధర పలికింది. రెండేళ్ల తర్వాత వస్తున్న తమ అభిమాన హీరో సినిమా తొలి షోనే చూడాలనుకునే ఫ్యాన్స్.. టికెట్ కోసం ఎన్ని వేలైనా పెట్టడానికి సిద్ధపడ్డారు. త్రివిక్రమ్ డైరెక్షన్ లో వస్తున్న సినిమా కావడం, మాస్ మసాలాతో ట్రైలర్ అలరించడంతో ‘గుంటూరు కారం’ మూవీపై హైప్ మరింత పెరిగింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? అంచనాలను అందుకుందా? సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ కు ‘గుంటూరు కారం’ రుచి చూపించిందా? తెలుసుకుందాం…

కథ: వీర వెంకట రమణ అలియాస్ రమణ (మహేష్ బాబు) గుంటూరులో మిర్చి బిజినెస్ చేస్తూ రౌడీ యాటిట్యూడ్‌తో తల్లిపై విఫరీతమైన ద్వేషంతో ఉంటాడు. తన చిన్నతనంలోనే తల్లి వసుంధర (రమ్యకృష్ణ) వదిలేసి వెళ్లడం, ఆ తర్వాత తండ్రి (జైరామ్) జైలుకు వెళ్లడంతో అత్త (ఈశ్వరీరావు) పెంపకంలో పెరుగుతాడు. ఈ నేపథ్యంలో అతడితో ఓ బాండ్ పేపర్‌పై సంతకం పెట్టించాలని తల్లి, తాత (ప్రకాశ్ రాజ్) ప్రయత్నిస్తుంటారు. భర్తను, కొడుకు రమణను తల్లి ఎందుకు వదిలేసి మరో వ్యక్తి ( రావు రమేష్)ను ఎందుకు పెళ్లి చేసుకొన్నది? కొడుకు నుంచి వసుంధరను ఆమె తండ్రి వెంకటస్వామి ( పకాశ్ రాజ్) ఎందుకు దూరం చేశాడు. రమణ తండ్రి సత్యం ఎందుకు జైలుకు వెళ్లాడు? అమ్ము (శ్రీలీల) ఎవరు? ఆమెతో రమణ ఎలా లవ్‌‌లో పడ్డాడు? రాజీ (మీనాక్షి చౌదరీ)తో రమణ సంబంధం ఏమిటి? చివరకు తల్లి, తాత కోరిన బాండ్‌పై రమణ సంతకం పెట్టాడా? తల్లి ప్రేమను రమణ పొందాడా? చేయి విడిచిన కొడుకు చేతిని తల్లి వసుంధర పట్టుకొందా? అనే విషయాలు తెలియాలంటే ‘గుంటూరు కారం’ రుచి చూడాల్సిందే.

విశ్లేషణ: ఈ ‘గుంటూరు కారం’ సూపర్ స్టార్ మహేష్ బాబు వన్ మెన్ షో అని చెప్పొచ్చు. మహేష్ బాబు స్క్రీన్ ప్రజెన్స్ వేరే లెవెల్లో ఉంది. సినిమాకు కావాల్సిన బలమైన పాయింట్‌ను తొలి పది నిమిషాల్లోనే రివీల్ చేసిన దర్శకుడు త్రివిక్రమ్ వెంటనే హీరోను ఇంట్రడ్యూస్ చేసి థియేటర్‌లో ఎలక్ట్రిఫైయింగ్ మూమెంట్స్‌ను తీసుకొచ్చారు. మహేష్ తన మార్కు ఎంట్రీ, యాక్షన్, కామెడీ టైమింగ్‌తో ఇరగదీశాడనే చెప్పాలి. ఫస్టాఫ్‌లో నాది నెక్లెస్ గొలుసు, ఒక్కడు పాటలకు శ్రీలీల వేసిన డ్యాన్సులు అదరగొట్టాయి. మహేష్, శ్రీలీల మధ్య రొమాంటిక్ సీన్లు చాలా క్లాసీగా సైటైరికల్ డైలాగ్స్‌తో మంచి ఫీల్, ఫన్ క్రియేట్ చేశాయి. ఇంటర్వెల్‌కు భారీ యాక్షన్ ఎపిసోడ్, ఎమోషనల్ సీన్‌తో ఫస్టాఫ్‌ను ముగించి సెకండాఫ్‌పై రెండింతలు అంచనాలు పెంచేశారు. ఇక సెకండాఫ్‌లో రవిశంకర్, అజయ్ ఘోష్, అజయ్ క్యారెక్లర్లతో డిజైన్ చేసిన విధానం చాలా హిలేరియస్‌గా ఉంది. ఈ మూడు ఎపిసోడ్స్ సినిమాకు మంచి ఫన్ స్టఫ్ క్రియేట్ చేస్తాయి. లేడీస్ ఫైట్ ఎపిసోడ్ సినిమాకు మరో హైలెట్. ఇక ప్రకాశ్ రాజ్.. రావు రమేష్ బ్లాస్టింగ్ సీన్లు కథను మలుపుతిప్పేలా చేస్తాయి. ప్రీ క్లైమాక్స్‌లో రమ్యకృష్ణ, మహేష్ మధ్య వచ్చే ఎమోషనల్ సీన్లు కళ్లలో నీళ్లు తిరిగేలా చేస్తాయి. వెన్నెల కిషోర్ మహేష్ బాబు మధ్య వచ్చే ట్రాక్ ఫుల్ ఫన్‌గా ఉంది. శ్రీలీల డ్యాన్స్‌లు ఎప్పటిలానే అదిరిపోయాయి. నవీన్ నూలి ఎడిటింగ్ వండర్ ఫుల్‌ గా ఉంది. ఫస్ట్ హాఫ్ ఆసక్తికరంగా సాగి అదిరిపోయింది. మహేష్ బాబు కామెడీ టైమింగ్ సీన్స్ బాగా పేలాయ్.. కుర్చీ మడతపెట్టి సాంగ్, క్లైమాక్స్ ఎమోషనల్ సీన్స్‌ సెకండాఫ్‌లో హైలెట్ గా నిలిచింది. ఓవరాల్‌గా హిట్టు బొమ్మ . ఫస్ట్ హాఫ్ కంటే సెకాండాఫ్ భలేగా ఉంది. ఫస్ట్ ఫ్రేమ్ నుంచే మహేష్ బాబు వీరలెవెల్లో ఇరగదీశాడు. మహేష్ బాబు ఇది వరకెన్నడూ కనిపించని కొత్త అవతారంలో కనిపించాడు. అతడి కెరీర్‌లో టాప్ 3 చిత్రాల్లో ఇది కూడా ఉంటుందని చెప్పొచ్చు. పోకిరి, ఒక్కడు, గుంటూరు కారం ఇలా చెప్పొచ్చు దర్శకుడు త్రివిక్రమ్ బాగా తీశాడు.. కమర్షియల్ సినిమా ఫార్మాట్ త్రివిక్రమ్ కి బాగా తెలుసు.. మహేష్ బాబుని ఎలా చూపించాలో కూడా తెలుసు.. చాలా కాలం తరువాత త్రివిక్రమ్ కామెడీ ట్రాక్ బాగా పేలింది. మహేష్ బాబు కెరీర్‌లో బెస్ట్ సినిమాల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో త్రివిక్రమ్ రాసిన డైలాగ్స్‌కు మహేష్ టైమింగ్ బాగుంది. తనదైన శైలిలో చెప్పిన డైలాగ్స్, చేసిన రొమాంటిక్ సీన్లు ఫ్యాన్స్ ఫుల్ మీల్స్‌లో ఉంటాయి. ముఖ్యంగా శ్రీలీలతో కెమిస్ట్రీ బ్రహ్మండంగా స్క్రీన్‌పై పండింది. రమ్యకృష్ణ, రావు రమేష్, జయరాం, జగపతి బాబు పాత్రల నిడివి తక్కువగా ఉన్న వారి ప్రజెన్స్ టోటల్ స్టోరీలో ఇంపాక్ట్ చూపిస్తుంది. మీనాక్షి, అజయ్, అజయ్ ఘోష్, రవిశంకర్, బ్రహ్మాజీ ఇలా ప్రతీ పాత్ర కూడా ఫర్‌ఫెక్ట్‌గా డిజైన్ చేశారు.

టెక్నికల్ అంశాల విషయానికి వస్తే.. అందరూ బాగా నటించారు.. తమన్ వర్క్ డీసెంట్‌గా ఉంది.. మనోజ్ పరమహంస కెమెరా లెన్స్ నుంచి మహేష్ బాబుని చూడటం ఓ కిక్కే. మహేష్ బాబు ఫస్ట్ హాఫ్‌లో ఏడిపిస్తాడు..నవ్విస్తాడు.. సెకాండాఫ్‌లో అన్ని పాత్రలకు ఇంపార్టెన్స్ ఉంటుందట. క్లైమాక్స్ ఫుల్ ఎమోషనల్‌గా సాగింది. సినిమాటోగ్రఫి, యాక్షన్, మ్యూజిక్ బలంగా కనిపించాయి. ఈ సినిమాకు తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, స్క్రీన్ మీద పాటలు చాలా క్రేజీగా ఉన్నాయి. ఈ సినిమాలో యాక్షన్ సీన్లు చూస్తే మహేష్ బాబు గత 10 ఏళ్లలో ఎన్నడూ చేయని విధంగా చేశారు. ఇక మనోజ్ పరమహంస, పీఎస్ వినోద్ అందించిన సినిమాటోగ్రఫి ప్రతీ సీన్‌ను రిచ్‌గా మార్చాయి. ప్రొడక్షన్ వ్యాల్యూస్ హారిక, హాసిని క్రియేషన్స్ బ్యానర్‌ ప్రమాణాలకు తగినట్టుగా ఉన్నాయి. ఈ చిత్రంలో ఆర్టిస్టుల ఫెర్ఫార్మెన్స్ సినిమాకు మరో బలమైన అంశాలుగా కనిపిస్తాయి. పంచ్ డైలాగ్స్, హీరో, హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ, మదర్ సెంటిమెంట్ ఈ సినిమాను అన్ని వర్గాలను ఆకట్టుకొనేలా ఉంటాయి. ఫైనల్ గా చెప్పాలంటే ఫన్, యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘గుంటూరుకారం’. మహేష్ బాబు కెరీర్ లో అతిపెద్ద బ్లాక్‌బస్టర్ గా ‘గుంటూరు కారం’ నిలుస్తుంది.

(చిత్రం : గుంటూరు కారం, విడుదల : 12 జనవరి-2024, రేటింగ్: 3.75/5 , నటీనటులు: మహేష్ బాబు, శ్రీలీల, మీనాక్షి చౌదరీ, జగపతి బాబు, రమ్యకృష్ణ, ప్రకాశ్ రాజ్, రావు రమేష్, ఈశ్వరీరావు, మురళీ శర్మ, రాహుల్ రవీంద్రన్, వెన్నెల కిషోర్ తదితరులు. రచన-దర్శకత్వం: త్రివిక్రమ్ శ్రీనివాస్, నిర్మాత: ఎస్ రాధాకృష్ణ సినిమాటోగ్రఫి: మనోజ్ పరమహంస, పీఎస్ వినోద్, ఎడిటింగ్: నవీన్ నూలి, మ్యూజిక్: థమన్, నిర్మాణం : హారిక హాసిని క్రియేషన్స్ )

Related posts

Leave a Comment