చిత్రం: ‘గుడ్ లక్ సఖి’
విడుదల తేదీ: జనవరి 28, 2022
టాలీవుడ్ టైమ్స్ రేటింగ్ : 2.25/5
దర్శకత్వం: నగేష్ కుకునూర్
నటీనటులు:
కీర్తీ సురేష్, ఆది పినిశెట్టి, జగపతి బాబు,
రాహుల్ రామకృష్ణ, రఘుబాబు తదితరులు
సినిమాటోగ్రఫీ: చిరంతాన్ దాస్
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
నిర్మాణ సంస్థ: వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్
సహ నిర్మాత: శ్రావ్యా వర్మ
సమర్పణ: ‘దిల్’ రాజు (శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్)
నిర్మాత: సుధీర్ చంద్ర పదిరి
కరోనాతో ప్రస్తుతం బాక్సాఫీస్‌కు ఏమాత్రం అనుకూలంగా లేని రోజులివి. మార్కెట్లో చిత్రమైన పరిస్దితి నెలకొంది. థియేటర్లు అందుబాటులో ఉన్నా సినిమాల విడుదలకు నిర్మాతలు ధైర్యం చేయడంలేదు. ఇలాంటి పరిస్థితుల్లో విడుదలైన చిత్రం. ‘గుడ్ లక్ సఖి’. ‘మహానటి’ కీర్తి సురేష్ ప్రధానపాత్ర పోషించిన ఈ చిత్రం జనవరి 28, 2022న ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ చిత్రం కీర్తి సురేష్ కు విజయాన్ని ఇచ్చిందా? ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన రాబట్టుకుంటుందో తెలుసుకుందాం…
కథలోకి వెళితే.. సఖి (కీర్తి సురేష్) ఆర్ధికంగా దిగువస్థాయి కుటుంబానికి చెందిన ఒక సాధారణమైన తండా అమ్మాయి. చిన్నప్పటి నుండి గురి చూసి కొట్టగొలదు. సఖి స్నేహితుడు గోళీ రాజు ( ఆది పినిశెట్టి) చిన్నతనం నుంచే సఖి టాలెంట్ ను గుర్తించి ఆమెలో నమకాన్ని పెంచుతాడు. ఇక సూరి (రాహుల్ రామకృష్ణ) మరో చిననాటి స్నేహితుడు అతనికి సఖి అంటే పడదు. ఈ క్రమంలో దేశం గర్వపడేలా షూటర్స్ ను రెడీ చేయడానికి ఆ ఊరు వచ్చిన కల్నల్ (జగపతిబాబు) సఖి టాలెంట్ ను గుర్తించి ఆమెకు శిక్షణ ఇస్తాడు. ఈ క్రమంలో ఆమె తన ప్రత్యర్థులను తట్టుకుని ఎలా నిలబడింది ? చివరకు నిలబడి విజేతగా ఎలా నిలిచింది ? మొత్తంగా అతి సాధారణ అమ్మాయి షూటర్ గా ఎలా ఎదిగింది ? ఈ మధ్యలో ఆమె జర్నీ ఎలా సాగింది ? అనేది అసలైన కథ.
విశ్లేషణ : స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్.. హీరోయిన్ ఓరియెంటెడ్..అదీ కీర్తి సురేష్ నటించటంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ సినిమా అంచనాలకు భిన్నంగా ఉండి బ్యాడ్ లాక్ సఖి అయింది. కీర్తి సురేష్ పాత్ర ప్లాట్ గా ఉండిపోతుంది. పరిస్దితులకు అనుగుణంగా తన ప్రస్దానాన్ని కొనసాగిస్తుంది. సెకండాఫ్ లో కాసేపు తప్పించి ఎక్కడా చెప్పుకోతగ్గఛాలెంజ్ చేయదు. ఈ అడ్డంకులు అన్నీ దాటుకుని ఈ పాత్ర ఎలా గెలుస్తుందనే ఉత్సుకత ఆడియన్స్ లో క్రియేట్ చేయలేకపోయింది. ఒక హీరోయిన్ ఇలాంటి లేడీ ఓరియెంటెడ్ స్పోర్ట్స్ సినిమాలు చేసేటప్పుడు మరింత పర్ఫెక్షన్తో నటించాలి. తన పాత్ర పై ఎంతో తపన ఉండాలి. కీర్తి సురేష్ పాత్ర అయితే చాలా చైల్డిష్ గా ఉంటుంది. సినిమా మెయిన్ కథాంశం బాగున్నా.. సినిమాలో చాలా సన్నివేశాలు బాగా స్లోగా సాగడం, అలాగే మెయిన్ కాన్ ఫ్లిక్ట్ ని క్లారిటీగా ఎలివేట్ చెయ్యకుండా పూర్తి రొటీన్ ప్లే పాయింటాఫ్ వ్యూలో స్క్రీన్ ప్లేని సాగతీయడంతో.. మెయిన్ క్యారెక్టర్స్ సరిగ్గా కనెక్ట్ కావు. దర్శకుడు నగేష్ కథకు సంబంధించి మంచి స్టోరీ లైన్ ను తీసుకున్నారు కానీ, ఆ లైన్ ను పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా కథ కథనాన్ని రాసుకోలేదు. కొన్ని సన్నివేశాలు మరీ బోర్ గా అనిపిస్తాయి. ముఖ్యంగా సెకెండాఫ్ లో చాలా సన్నివేశాలు సాగతీసినట్లు, దానికి తోడు సినిమాటిక్ గా అనిపిస్తాయి. దర్శకుడిగా నగేష్ కుకునూర్ కు మంచి పేరుంది. అయినా స్క్రిప్టులో వచ్చిన సమస్యలను అధిగమించలేకపోయారు. సినిమా మొదలైన కాసేపటికే గ్రిప్ కోల్పోయాడు. బలహీన పాత్రలతో మరింత బలహీనమైన కథనంతో కుదైలైపోయింది స్క్రిప్టు. దాంతో నటీనటులు కూడా సాదాసీదాగా చేసుకుంటూ పోయారు. దేవిశ్రీ ప్రసాద్ నుంచి ఇలాంటి మ్యూజిక్ అయితే ఆశించం. ‘ఇంత అందంగా ఉంటుందా లోకం’ పాట బావుంది. ‘బ్యాడ్ లక్ సఖి’ సాంగ్ ఓకే అన్నట్లుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సోసోగా ఉంది. సినిమాటోగ్రఫీ జస్ట్ ఓకే. శ్రీకర్ ప్రసాద్ ..చాలా లేపేసి సాధ్యమైనంత బోర్ తగ్గించే ప్రయత్నం చేసారు. డబ్బింగ్ సరిగ్గా కుదరలేదు. గ్రామీణ అమ్మాయిలు ఇంకా అలాగే ఉన్నారా అనిపిస్తుంది ఆ డ్రస్ లు, మేకప్ చూస్తే…మారిన గ్రామాలను పట్టుకోలేదు. ఆర్ట్ డిపార్టమెంట్ వర్క్ బాగుంది. కీర్తిసురేష్, ఆది పినిశెట్టి, జగపతి బాబు, రాహుల్ రామకృష్ణ వీళ్ల చుట్టూనే కథ తిరుగుతుంది. ఆది పినిశెట్టి కు తగ్గ వర్త్ ఉన్న పాత్ర కాదు. జగపతిబాబు పాజిటివ్ నెస్ కు బ్రాండ్ అంబాసిడర్ లాంటి పాత్ర. రాహుల్ రామకృష్ణ రొటీన్ గా లాగేసాడు. ‘గుడ్ లక్ సఖి’ అంటూ మంచి కాన్సెప్ట్ తో వచ్చిన ఈ చిత్రంలో కీర్తి సురేష్ తో పాటు జగపతిబాబు, అది పినిశెట్టి కూడా తమ నటనతో ఆకట్టుకున్నారు. అయితే బోర్ గా సాగే కథనం, అలాగే మెయిన్ క్యారెక్టైజేషన్స్ బలహీనంగా ఉండటం, పైగా సినిమాలో ఫేక్ ఎమోషన్స్ వంటి అంశాలు సినిమా ఫలితాన్ని బాగా దెబ్బ తీశాయి. ఆ కారణంగా ఈ సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ కాలేకపోయింది.