కొట్ర గ్రామంలో 369 సర్వే భూ కబ్జా నుంచి కాపాడండి : తహసిల్దార్ కు ముస్లిం మైనార్టీల ఫిర్యాదు

Protect land in Survey No. 369 in Kotra village from encroachment: Muslim minorities complain to the Tahsildar.
Protect land in Survey No. 369 in Kotra village from encroachment: Muslim minorities complain to the Tahsildar.
Spread the love

నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం కొట్ర గ్రామ రెవెన్యూ శివారులో గల సర్వే నెంబర్ 369లో ముస్లిం మైనార్టీలకు కేటాయించిన ప్రభుత్వ భూమిని అదే గ్రామానికి చెందిన కె.అశ్విని కాంతారావు కబ్జా చేశారని ఆ గ్రామానికి చెందిన ముస్లిం మైనార్టీలు తహసిల్దార్ కార్తీక్ కుమార్ కు ఫిర్యాదు చేశారు. మంగళవారం తహసిల్దార్ని ముస్లిం మైనార్టీలు కలిసి తమకు 369 సర్వే నెంబర్లు ఆరెకరాల 22 గుంటల భూమిని ఓఆర్సీ పట్టా ద్వారా కేటాయించడం జరిగిందని.. తాతల నాటి నుంచి అట్టి భూమిని సాగు చేస్తూ ప్రతి ఏటా పీర్ల పండుగను నిర్వహించడం జరుగుతుందన్నారు. అదే విధంగా మహబూబ్ స్వామి దర్గాను కుల మతాలకతీతంగా అక్కడికి ప్రతిరోజు వచ్చి ప్రార్థనలు చేయడం జరుగుతుందన్నారు. అట్టి భూమిపై ఎలాంటి సమాచారం ఇవ్వకుండా గ్రామానికి చెందిన అశ్విని కాంతారావు వెంకటేశ్వరరావు, రాములు అక్రమంగా కబ్జాకు పాల్పడి కంచే నిర్మాణం చేపట్టడం జరిగిందని ఇట్టి విషయంపై సమగ్రంగా విచారించి న్యాయం చేయాలని వారు వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం నాయకులు నయీమ్, మహమ్మద్ ఖదీరుద్దీన్, ఖలీల్, షాబుద్దీన్, బషిరుద్దిన్, రవుఫ్, రమేష్, సద్దాం నజీర్, షఫీ సలీం, అఫ్రోజ్ తదితరులు పాల్గొన్నారు.