ఫోక్ బీట్స్, మాస్ హీట్ & ప్యూర్ యూఫోరియాతో అదిరిపోయే రెస్పాన్స్
నేచురల్ స్టార్ నాని పాన్ ఇండియా యాక్షన్ ఎక్స్‌ట్రావ్యాగెంజా ‘ది ప్యారడైజ్’ ఇప్పటికే పోస్టర్స్, ఫస్ట్ సింగిల్ ‘ఆయా షేర్’, ఇటీవల విడుదలైన టీజర్‌తో భారీ హైప్‌ను సొంతం చేసుకుంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, SLV సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ‘ఆయా షేర్’ కు వచ్చిన అద్భుతమైన స్పందన తర్వాత మేకర్స్ ‘యెష నాగుల’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. జానపద బాణీకి అనిరుధ్ తనదైన హై-ఎనర్జీ మ్యూజిక్‌ను జోడించిన ఈ పాటను డల్లాస్‌లో జరిగిన అనిరుధ్ కాన్సర్ట్‌లో లైవ్‌గా విడుదల చేశారు. వేలాది మంది అభిమానుల మధ్య పాటను లైవ్‌లో ప్రదర్శించగా, ప్రేక్షకులు డ్యాన్స్ చేస్తూ, కేరింతలు కొడుతూ సంబరాలు చేసుకోవడంతో అక్కడ పండుగ వాతావరణం నెలకొంది.
ఈ పాటలో ప్రధానంగా ఆకట్టుకునేది తెలిసిన జానపద బాణీకి కొత్తదనాన్ని జోడించిన విధానం. ఇప్పటికే పాపులర్ అయిన ఫోక్ నంబర్‌కు అనిరుధ్ మరింత గ్రాండ్, సినిమాటిక్ ట్రీట్‌మెంట్ ఇచ్చారు. ఎనర్జిటిక్ పర్కషన్, వైబ్రెంట్ ఇన్‌స్ట్రుమెంటేషన్, రిథమిక్ లేయర్స్‌తో పాటకు పవర్‌ఫుల్ కాంటెంపరరీ ఫీల్ తీసుకొచ్చారు. అదే సమయంలో పాటలోని నేటివ్ ఫ్లేవర్ ఎక్కడా తగ్గకుండా జాగ్రత్త తీసుకున్నారు.
కాసర్ల శ్యామ్ రాసిన లిరిక్స్ పాట మూడ్‌కు పర్ఫెక్ట్‌గా సరిపోయాయి. లైవ్లీగా, క్యాచీగా సాగుతూ పక్కా జానపద నేటివిటీని ప్రజెంట్ చేశాయి. జంగి రెడ్డి వోకల్స్ పాటకు అథెంటిక్ రస్టిక్ టచ్‌ను అందించగా, ప్రభా తన వోకల్స్ పాటలోని ఎనర్జీని మరింత పెంచారు. ఆట సందీప్ రిథమ్‌కు అనుగుణంగా ఫోక్ మూవ్‌మెంట్స్, మాస్ డ్యాన్స్ స్టెప్స్‌ను మేళవిస్తూ కొరియోగ్రఫీ అందించారు. పాటను కలర్‌ఫుల్‌గా, ఎనర్జిటిక్‌గా ప్రజెంట్ చేయడంతో మ్యూజిక్‌తో పాటు విజువల్‌గానూ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తోంది.
ఈ పాటలో నాని ప్రధాన ఆకర్షణగా నిలిచారు. పూర్తి ఎనర్జీతో నాని చేసిన పెర్ఫార్మెన్స్ ఆకట్టుకుంటుంది. నాని డ్యాన్స్‌లో ఎనర్జీ, స్టైల్, యాటిట్యూడ్ కనిపిస్తాయి. రిథమ్‌కు తగ్గట్టుగా నాని వేసిన మాస్ స్టెప్పులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పాటలో ఆయన స్క్రీన్ ప్రెజెన్స్‌కు కావాల్సిన స్టార్ పవర్‌ను అందించారు. కీర్తి సురేష్ నాని ఎనర్జీకి పర్ఫెక్ట్ కాంప్లిమెంట్‌గా నిలుస్తూ విజువల్స్‌కు మరింత చార్మ్‌ను జోడించారు. వీరిద్దరి కాంబినేషన్ డ్యాన్స్ పోర్షన్స్‌కు మరింత ఆకర్షణగా నిలిచింది.
‘యెష నాగుల’ ప్రేక్షకులను కదిలించే బీట్స్, వెంటనే కనెక్ట్ అయ్యే వోకల్స్, స్క్రీన్‌పై ఆకట్టుకునే విజువల్ ఎనర్జీతో ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ఈ పాట సినిమాను దాటి ప్లేలిస్టులు, సెలబ్రేషన్స్, పార్టీల్లోనూ తనదైన స్థానం సంపాదించుకోనుంది.ఇప్పటికే రెండు పాటలు మ్యూజికల్‌గా మంచి బజ్‌ను క్రియేట్ చేయడంతో ‘ది ప్యారడైజ్’ ఆల్బమ్‌పై అంచనాలు మరింత పెరిగాయి.
ఈ చిత్రంలో మోహన్ బాబు, కాయదు లోహర్, రాఘవ్ జుయల్, సోనాలి కులకర్ణి, సంపూర్ణేష్ బాబు, తనికెళ్ల భరణి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
‘ది ప్యారడైజ్’కు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా, డీవోపీ సిహెచ్ సాయి, ఎడిటింగ్ నవీన్ నూలి, ప్రొడక్షన్ డిజైన్ అవినాష్ కొల్లా నిర్వహిస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులకు భారీ థియేట్రికల్ అనుభూతిని అందించేలా రూపొందుతున్న ‘ది ప్యారడైజ్’ సెప్టెంబర్ 24న పాన్-వరల్డ్ స్థాయిలో విడుదల కానుంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, ఇంగ్లిష్, స్పానిష్ సహా ఎనిమిది భాషల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
తారాగణం: నాని, మోహన్ బాబు, కయదు లోహర్, కీర్తి సురేష్ (స్పెషల్ సాంగ్ అప్పియరెన్స్), రాఘవ్ జుయల్, సోనాలి కులకర్ణి, సంపూర్ణేష్ బాబు
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: శ్రీకాంత్ ఓదెల
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
బ్యానర్: SLV సినిమాస్
DOP: సిహెచ్ సాయి
సంగీతం: అనిరుధ్ రవిచందర్
ఎడిటింగ్: నవీన్ నూలి
ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా
PRO: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో
