ప్రముఖ చలనచిత్ర, టీవి నిర్మాత, రచయిత వి. మహేశ్ (85) శనివారం రాత్రి గుండెపోటుతో చెన్నయ్ లో కన్నుమూశారు. ‘మాతృమూర్తి’ చిత్రంతో 1975 లో వి. మహేశ్ నిర్మాణరంగంలోకి అడుగుపెట్టారు. ఆ చిత్ర నిర్మాతల్లో ఒకరైన వి.వి. రాజేంద్ర కుమార్ సోదరుడే మహేశ్. ఎన్టీఆర్ కథానాయకుడిగా దాసరి నారాయణరావు దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ‘మనుష్యులంతా ఒక్కటే’ (1976) చిత్ర నిర్మాణంలో భాగస్వామిగా వ్యవహరించడమే కాకుండా దానికి మూలకథను అందించింది వి. మహేశ్. ఆ చిత్రానికి గానూ ఆయన ఉత్తమ కథా రచయితగా నంది అవార్డును అందుకున్నారు. ఆ తర్వాత లక్ష్మి దీపక్ దర్శకత్వంలో ‘మహాపురుషుడు’ (1981), చిరంజీవి, కోడి రామకృష్ణ కాంబినేషన్ లో ‘సింహపురి సింహాం (1983), సుమన్, బోయిన సుబ్బారావు కాంబినేషన్ లో ‘ముసుగు దొంగ’ (1985) చిత్రాలను నిర్మించారు. అలానే కిరణ్ జ్యోతి ఆర్ట్స్ బ్యానర్ పై భూమయ్యతో కలిసి ‘భగత్’ చిత్రాన్ని నిర్మించారు. శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ లో ప్రసారమైన ‘హరి భక్త కథలు’ ధారావాహికకు ఆయనే నిర్మాత, రచయిత. ఈ ధారావాహికలో భాగమైన ‘విప్రనారాయణ’ కు 2009 సంవత్సరంలో ఉత్తమ మెగా సీరియల్ గా బంగారు నందితో పాటు మూడు విభాగాలలో నంది పురస్కారాలను అందుకున్నారు. తన అన్నయ్య, ప్రముఖ కళాదర్శకుడు వి.వి. రాజేంద్ర కుమార్ తో కలిసి చిత్రాలకు ప్రచార సామగ్రిని తయారు చేసే ‘రూప కళ’ సంస్థను, చిత్ర నిర్మాణ సంస్థ ‘ఆదిత్య చిత్ర’ను నెలకొల్పారు. ఆయన స్వగ్రామం నెల్లూరు జిల్లా కోరుతురు. అవివాహితుడైన వి. మహేశ్ మృతి పట్ల తెలుగు సినిమా, టీవీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. వి. మహేశ్ అంత్యక్రియలు చెన్నయ్ లో సోమవారం జరుగనున్నాయి. నిర్మాత, రచయిత స్వర్గీయ మహేశ్ అంత్యక్రియలు సోమవారం చెన్నయ్ లో జరుగుతాయని ఆయన మేన్లలుడైన టెలివిజన్ నిర్మాత, దర్శకుడు మహీధర్ వల్లభనేని తెలిపారు.
Related posts
-
ఘనంగా “రాజు గారి దొంగలు” సినిమా టీజర్ లాంఛ్
Spread the love లోహిత్ కల్యాణ్, రాజేష్ కుంచాడా, జోషిత్ రాజ్ కుమార్, కైలాష్ వేలాయుధన్, పూజా విశ్వేశ్వర్, టీవీ రామన్,... -
Grand Teaser Launch Event of “Raju Gari Dongalu”
Spread the love The movie Raju Gari Dongalu, featuring Lohith Kalyan, Rajesh Kunchada, Joshith Raj Kumar, Kailash... -
రానా దగ్గుబాటి ప్రెజెంట్స్, విశ్వదేవ్ రాచకొండ, బిందు మాధవి, శశాంక్ శ్రీవాస్తవయ, వాల్టెయిర్ ప్రొడక్షన్స్ & స్పిరిట్ మీడియా డార్క్ చాక్లెట్ ఇంట్రస్టింగ్ ఫస్ట్ లుక్ విడుదల, 2025లో థియేటర్లలో రిలీజ్
Spread the love ఇంపాక్ట్ ఫుల్ సినిమాలని అందించే రానా దగ్గుబాటి, మరోసారి వారి మూడో కొలాబరేషన్ కోసం వాల్టెయిర్ ప్రొడక్షన్స్‌తో చేతులు...