తెలుగు ఇండ్రస్టీలో హాట్ టాపిక్కు తెర లేపుతూ, పార్ధ గోపాల్ నిర్మాణంలో, దర్శకుడు సూర్య జి. యాదవ్ రూపొందిస్తున్న మూవీ ‘డైమండ్ డెకాయిట్’. ఈ సినిమా చిత్ర ట్రైలర్‌ను ఆంధ్రప్రదేశ్ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆవిష్కరించారు. ఈ ట్రైలర్‌ను వీక్షించిన స్పీకర్ చిత్రయూనిట్‌ను అభినందించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ వాకడ అప్పారావు, శివాజీరాజా, థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ తదితరులు పాల్గొని చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంధర్భంగా ప్రముఖ నిర్మాత శిరీష్ రెడ్డి మాట్లాడుతూ.. సినిమా ట్రైలర్ చాలా గ్రిప్పింగ్‌గా ఉంది. విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, కథలో ఉన్న థ్రిల్ చాలా స్ట్రాంగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ టీమ్ మంచి కంటెంట్‌తో వచ్చారు. ఈ సినిమా ఖచ్చితంగా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంది అని తెలిపారు. హీరో పర్ధ గోపాల్ మాట్లాడుతూ..ఆంధ్రప్రదేశ్ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ‘డైమండ్ డెకాయిట్’ మూవీ ట్రైలర్‌ను ఆవిష్కరించి అభినందించడం సంతోషంగా ఉంది. ఆయనకు ధన్యవాదాలు. ట్రైలర్‌కు వస్తున్న స్పందన ఎంతో ఆనందంగా ఉంది. ఇది సాధారణ కథ కాదు, సస్పెన్స్, ఎమోషన్స్, థ్రిల్ అన్నీ కలిసిన పూర్తి ఎంటర్టైనర్. ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతి ఇస్తుంది. ప్రతి ఒక్కరూ మా సినిమాను ఆదరించాలని కోరుతున్నాం” అని తెలిపారు. రచయిత, దర్శకుడు సూర్య జి యాదవ్ మాట్లాడుతూ, స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, పలువురు సినీ ప్రముఖులు మా సినిమా ట్రైలర్ వీక్షించి అభినందించడం మా కృషికి ఫలితం దక్కిందనిపిస్తుంది. రెగ్యులర్‌గా కాకుండా డిఫరెంట్ కాన్సెప్ట్‌తో సినిమా రూపొందించాము, ప్రతి సీన్ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ట్రైలర్‌కు వస్తున్న పాజిటివ్ రెస్పాన్స్‌పై ఆనందం ఉంది. ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యే మా సినిమాను ప్రతి ఒక్కరూ థియేటర్లో వీక్షించి సపోర్టు తెలపాలి అని కోరారు.
ఎమోషనల్ రివెంజ్ డ్రామా..’డైమండ్ డెకాయిట్’ ట్రైలర్
