మంతపురి గ్రామంలో ఘనంగా డాక్టర్ వై.ఎస్.ఆర్ వర్ధంతి
ఆలేరు, సెప్టెంబర్ 2 (టాలీవుడ్ టైమ్స్) : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం మంతపురి గ్రామంలో మాజీ ముఖ్యమంత్రివర్యులు డాక్టర్ వై.ఎస్.ఆర్ వర్ధంతి సందర్భంగా గ్రామంలోని పాఠశాలలో పిల్లలకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా జరిగిన కార్యక్రమంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి పల్లె శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. మాట్లాడుతూ.. రాజకీయాల్లో ముక్కుసూటితనానికి, నిర్మొహమాట ధోరణికి రాజశేఖరరెడ్డి ప్రసిద్ధుడు అని పేర్కొన్నారు. కళాశాల దశ నుంచే రాజకీయాలపై ఆసక్తి చూపిన రాజశేఖరరెడ్డి 1980-83 కాలంలో రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిపదవిని నిర్వహించారు. కడప లోక్‌సభ నియోజకవర్గం నుంచి 4 సార్లు ఎన్నికయ్యారు. పులివెందుల శాసనసభ నియోజకవర్గం నుంచి 6 సార్లు విజయం సాధించారు. రాష్ట్ర శాసనసభ ప్రతిపక్షనేత గా, రెండు సార్లు రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రేస్ కమిటీ అధ్యక్షుడిగానూ పనిచేశారు. 1980 నుంచి 1983 దాకా గ్రామీణాభివృద్ధి, వైద్యశాఖ, విద్యాశాఖ మొదలైన కీలకమైన మంత్రి పదవులను నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా వై.ఎస్.రాజశేఖరరెడ్డి రెండు సార్లు పనిచేశారు. తొలిసారి 1983 నుంచి 1985 వరకు, రెండో పర్యాయం 1998 నుంచి 2000 వరకు ఆ పదవిలో ఉన్నాడు. 1999 నుంచి 2004 వరకు 11 వ శాసనసభలో ప్రతిపక్షనేతగానూ వ్యవహరించిన సందర్భాన్ని అయన గుర్తు చేశారు. 2003 వేసవికాలంలో ప్రతిపక్షనేతగా ఉన్న సమయంలో పాదయాత్ర చేపట్టి 1,467 కిలోమీటర్లు పర్యటించారు. పాదయాత్ర వలన వ్యక్తిగతంగా వైఎస్.కు మంచి జనాదరణ లభించడమే కాకుండా ఆ తదుపరి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి దోహదపడిందని పల్లె శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. 2004 మేలో జరిగిన 12వ శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికస్థానాలు సాధించడంతో అదివరకే పార్టీలో పేరు సంపాదించిన వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. పాదయాత్ర వలన జనాదరణ పొందడమే కాకుండా ఎన్నికల ప్రచారంలో వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు, పెండింగులో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తిచేయటం, జలయజ్ఞంలకు ప్రాధాన్యం ఇవ్వడంతో ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన పిదప తొలి సంతకం ఉచిత విద్యుత్తు ఫైలు పైనే చేశారు. 2009 ఏప్రిల్‌లో జరిగిన 13వ శాసనసభ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలలో విజయం సాధించడానికి కృషిచేసి వరుసగా రెండో పర్యాయం ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారని అన్నారు. ఈ కార్యక్రమంలోబండి నాగన్న, గ్రామ శాఖ అధ్యక్షుడునోముల చందు, కస్తూరి వెంకటేష్, గుమ్మడి సోములు, కొరుటూరు సిద్ధులు, పల్లె రాజాలు, ఐలి శ్రీను, కొరూటూరి సతీష్, మరగని నరసయ్య, ఎండి షరీఫ్, బిట్కూరి మల్లయ్య తదితరులు పాల్గొని డాక్టర్ వై.ఎస్.ఆర్ కు శ్రద్ధాంజలి ఘటించారు.