‘కోర్ట్’ సినిమా ప్రీ రిలీజ్ వేదికగా నేచురల్ స్టార్ నాని మాట్లాడుతూ…”ఇన్నేళ్ల కెరీర్‌లో ఈ సినిమా తప్పకుండా చూడండి అని ఎవర్నీ అడిగింది లేదు.. మొదటిసారి అడుగుతున్నా ‘కోర్ట్’ సినిమా చూడమని. ఎందుకంటే ఇలాంటి సినిమాను తెలుగు ప్రేక్షకులు మిస్ కాకూడదని. ఒకవేళ సినిమా చూసి నచ్చకపోతే.. త్వరలో రాబోతున్న నా ‘హిట్–3’ సినిమా ఎవరూ చూడొద్దు” అని పేర్కొన్నాడు. “కోర్ట్ నచ్చకపోతే నా ‘హిట్ 3’ చూడకండి” అంటూ నాని ఇచ్చిన స్టేట్మెంట్ చిన్నపాటి సెన్సేషన్ క్రియేట్ చేసింది. నాని ఇంత కాన్ఫిడెంట్‌గా మాట్లాడుతున్నాడేంటని చాలామంది ఆలోచనలో పడ్డారు. నిర్మాతగా తన ప్రాడక్ట్‌పై ఉన్న నమ్మకం అని కొందరు అనుకున్నారు. న్యాచురల్ స్టార్ నాని ప్రొడక్షన్ హౌస్ వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై తెరకెక్కిన చిత్రమిది. నాని నిర్మాణంలో ఒక సినిమా వస్తుంది అంటే దానిపై అంచనాలు బాగానే ఉంటాయి. హీరోగానే కథ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకునే నాని నిర్మాతగా మారి సినిమా చేశాడంటే.. అందులో కచ్చితంగా కథ ఇంకా అద్భుతంగా ఉంటుంది అనే నమ్మకాన్ని ప్రేక్షకుల్లో కలిగించాడు నాచురల్ స్టార్. ఎలాంటి హీరోయిక్ ఎలివేషన్స్ లేకుండా టాలీవుడ్ లో కోర్ట్ రూమ్ డ్రామాలు చాలా తక్కువగా వచ్చాయి. ఆ లోటు తీర్చేందుకు నాని నూతన దర్శకుడు రామ్ జగదీష్ దర్శకత్వంలో తెరకెక్కించిన ‘కోర్టు :స్టేట్ వర్సెస్ ఎ నోబడీ’ చిత్రం ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శివాజీ, ప్రియదర్శి ప్రధాన పాత్రలు పోషించారు. పోక్సో యాక్ట్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏ మేరకు ఆకట్టుకుంది ? లాయర్‌గా ప్రియదర్శి క్యారెక్టర్ ఎలా ఉంది. సినిమా నాని నమ్మకాన్ని నిలబెట్టిందా లేదా అనేది సమీక్షలో తెలుసుకుందాం…
కథ: ఇంటర్ తప్పిన కుర్రాడు మెట్టు చంద్రశేఖర్ అలియాస్ చందు (హార్ష్ రోషన్). అతని తండ్రి వాచ్‌మేన్. తల్లి ఐరన్ చేస్తుంది. సాధారణ కుటుంబానికి చెందిన చందు ఖాళీగా ఉండటం ఇష్టం లేక డబ్బుల కోసం సెల్ ఫోన్ సెల్లింగ్, బార్‌లో బాయ్‌గా ఇలా ఏదో ఒక పనితో బిజీ ఉంటూ తన డబ్బు తాను సంపాదించుకుంటుంటాడు. చందూ మాటలు, చలాకీతనాన్ని గమనించిన ఇంటర్ చదివే మైనర్ అమ్మాయి జాబిలి (శ్రీదేవి) అతని ఫోన్ నంబర్ తీసుకుని పరిచయం పెంచుకొని మాటలు మొదలుపెడుతుంది. అది కాస్త ప్రేమగా మారుతుంది. ఈ విషయం తెలిసి కులం, పరువు, ప్రతిష్ట అంటూ ఆలోచనలతో ఉండే మంగపతి (శివాజీ) తమ ఇంటి పరువుగా భావించే అమ్మాయి జాబిలిని బలవంతంగా తీసుకెళ్లి రేప్ చేశాడని చందూపై పోక్సో కేసు పెట్టి నిర్దాక్షిణ్యంగా జైల్లో పెట్టిస్తాడు. ఊర్లో మంచి పేరు, పరపతి, రాజకీయ మరియు అధికార బలం ఉన్న వ్యక్తి మంగపతి. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో చందు పై ‘ఫోక్సో’ వంటి భయంకరమైన సెక్షన్లతో కేసులు పెట్టి ఇరికించేలా చేస్తాడు. పేద కుటుంబంలో పుట్టిన చందూకి న్యాయం చేయడానికి ఏ లాయర్ ముందుకు రారు. వచ్చినా.. మంగపతి లంచంతో కొనేస్తాడు. ఇలాంటి నేపథ్యంలో ఈ కేసును జూనియర్ లాయర్ సూర్య తేజ (ప్రియదర్శి) వాదిస్తాడు. మరి చందూని నిర్దోషి అని ప్రూవ్ చేయడానికి సూర్య తేజ ఏం చేశాడు ?. ఎలాంటి వాదన చేశాడు ?, ఈ క్రమంలో అతనికి ఎదురైన పరిస్థితులు ఏమిటి ? జాబిలిని చందూ నిజంగా రేప్ చేశాడా? బెయిల్ కూడా రాకుండా అతని మీద పోక్సో పెట్టించిన లాయర్ దాము (హర్షవర్థన్) కోర్టులో ఎలా వాదించారు? ఈ కేస్‌ను టేకప్ చేయడానికి ఏ లాయరు ముందుకురాని తరుణంలో మోహన్‌రావు (సాయికుమార్)దగ్గర అసిస్టెంట్‌గా పని చేస్తున్న సూర్యతేజ (ప్రియదర్శి) ఈ కేస్ టేకప్ చేసి ఎలా ముందుకెళ్లాడు. జాబిలి తల్లి సీతారత్నం (రోహిణి), సూర్యతేజ బాస్ మోహన్ రావు (సాయి కుమార్) ఏం చేశారు? కోర్ట్‌లో జరిగిన వార్ ఏంటి? ఫైనల్‌గా చందూకి న్యాయం జరిగిందా? లేదా అన్నది అసలైన కథ.
విశ్లేషణ: ‘కోర్ట్’ అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ డ్రామాలో.. మెయిన్ కాన్సెప్ట్ తో పాటు ఫోక్సోకి సంబంధించిన ఓ మంచి మెసేజ్ కూడా ఉంది. అలాగే.. కొన్ని బలమైన కోర్ట్ సీన్స్ అండ్ ఎమోషనల్ సీన్స్ ఆకట్టుకున్నాయి. దర్శకుడు రామ్ జగదీష్ చెప్పాలనుకున్న పాయింట్ మంచిది. కథను ముందుకు తీసుకువెళ్లిన తీరు ప్రేక్షకులు అందరూ మెచ్చేలా ఉంది. స్క్రీన్ ప్లేలో ఎటువంటి మెరుపులు లేవు. సినిమా ప్రారంభం నుంచి విశ్రాంతి వరకు సీటులో కూర్చున్న ప్రేక్షకుడి ఊహకు అనుగుణంగా ముందుకు వెళుతుంది. టీనేజ్ ప్రేమ కథను అంతకుమించి తీయలేమన్నట్టు రొటీన్ రెగ్యులర్ పంథాలో తీశారు. కుర్రాడి మీద కేసు పెట్టిన తర్వాత సినిమాలో కాస్త చలనం వచ్చింది. అందువల్ల, ఆ ప్రేమను గానీ అప్పటివరకు సాగిన కథను గానీ అద్భుతమని చెప్పలేం. అయితే… శివాజీ తన నట విశ్వరూపంతో అప్పటివరకు జరిగిన తప్పులను మర్చిపోయి కొత్తగా సినిమాను చూసేలా చేశారు. విశ్రాంతి తర్వాత కథలోనూ, కథనంలోనూ కొత్తదనం లేదు. కోర్టులో ఒక వీడియో ప్రవేశ పెట్టడం మినహా ఊహలకు అనుగుణంగా ముందుకు వెళుతుంది. అయితే, దర్శకుడు ప్రేక్షకుల భావోద్వేగాలను బలంగా స్పృశించాడు. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మీద నమోదైన లైంగిక వేధింపుల ఆరోపణల కారణంగా పోక్సో చట్టం గురించి తెలుగు ప్రేక్షకులకు బాగా తెలిసింది. ఆ చట్టం నేపథ్యంలో రూపొందిన చిత్రమిది. ఒకవేళ పోక్సో నేపథ్యంలో కేసు నమోదు అయితే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో చూపించే చిత్రమిది. న్యాయం కోసం కోర్టును ఆశ్రయించే ప్రజలు మెజారిటీ అయితే… చట్టాలను అడ్డుగా పెట్టుకుని తమ పగ, ప్రతీకారాలు నెరవేర్చుకునే వ్యక్తులు ఈ సమాజంలో మనకు కొందరైనా తారసపడతారు. తమ ఇగో కోసం, పరువు ప్రతిష్టల కోసం ఇరవై ఏళ్లు కూడా నిండని ఒక కుర్రాడి భవిష్యత్తును డబ్బు బలంతో ఒక వ్యక్తి నాశనం చేయాలని అనుకుంటే… కుర్రాడి భవిష్యత్తును ఒక యువర్ లాయర్ ఎలా కాపాడాడు? బయటకు ఎలా తెచ్చాడు? అనేది సినిమా. స్టార్టింగ్ పాయింట్ దగ్గర ఇంటర్వెల్, ఇంటర్వెల్ తర్వాత క్లైమాక్స్ తెలిసే సినిమా. ఎంగేజింగ్ కోర్ట్ రూమ్ డ్రామాలకు గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే మరియు ఆసక్తికరమైన వాదప్రతివాదనలు చాలా కీలకం. వాదనల్లో లాజిక్కులు, మిస్టరీలు ఎంత బాగా వర్కవుట్ అయితే.. సినిమా అంతలా ప్రేక్షకుల్ని అలరిస్తుంది. ఈ “కోర్ట్” సినిమాలో ఈ రెండూ లోపించాయి. అయినప్పటికీ.. శివాజీ పెర్ఫార్మెన్స్, సాయికుమార్ సెటిల్డ్ డైలాగ్స్, హర్ష్ రోషన్ క్యారెక్టర్ బిహేవియర్, రామ్ జగదీశ్ సెన్సిబిలిటీస్ “కోర్ట్”ను ఓ మంచి సినిమాగా నిలిపాయి. పోక్సో చట్టం నేపథ్యంలో కేసు నమోదు అయితే దాని పరిణామాలు ఎలా ఉంటాయి. ఆ కేసు నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంటుందా? లేదా అన్న నేపథ్యంలో సాగే చిత్రమిది. కులం, పరపతి, పరువు కోసం పాకులాడే కొందరు కింది స్థాయివారితో ఎలా ప్రవర్తిస్తారు? తమ ఇగో కోసం ఇరవై ఏళ్లు నిండని ఒక కుర్రాడి భవిష్యత్తును ఓ వ్యక్తి నాశనం చేయాలనుకుంటే ఆ కుర్రాడి భవిష్యత్తును ఓ యువ న్యాయవాది ఎలా కాపాడాడు అనేది సినిమా ఇతివృత్తం. ప్రథమార్థం అంతా టీనేజ్ లవ్‌స్టోరీతో సోసోగా సాగింది. అంతకు మించి టీనేజ్ లవ్‌ను చెప్పలేం అన్నట్లు ఉంది. చందూపై పెట్టిన కేసు, న్యాయం కోసం తిరిగే స్నేహితులు… అదంతా కాస్త కాలయాపన ఉన్నా.. సూర్య తేజ (ప్రియదర్శి) కేస్ టేకప్ చేసిన దగ్గరి నుంచి సినిమాపై ఆసక్తి పెరిగింది. కోర్ట్ రూమ్ డ్రామా అంతా ఆసక్తిగా సాగింది. వాదన జరుగుతున్నంత సేపు లా, లాజిక్ ఇలాంటివి ఏమీ గుర్తు రావు. కేవలం కథలో మాత్రమే లీనమయ్యేలా ఉంది. దర్శకుడు రామ్ జగదీష్ ఎంచుకున్న పాయింట్ మంచిది. తెరకెక్కించిన తీరు బాగానే ఉంది. కానీ స్టార్టింగ్ నుంచి చివరి వరకూ ముందు ఏం జరగబోతుంది అన్నది ఊహించేలా ఉంది. శివాజీ పాత్ర ఎంటర్ అయిన తర్వాత అతని నటన చూశాక.. అప్పటిదాకా జరిగిన పొరపాట్లు కనిపించవు. అప్పటిదాకా ముందు సన్నివేశం ఏంటో ఊహించేలా ఉన్నా.. కోర్టులో ఒక వీడియో ప్రవేశ పెట్టడం నుంచి కథ మలుపు తిరిగింది. అది ఊహించనిది. కోర్టు రూమ్‌లో జరిగే వార్, అక్కడి పాత్రలు, డిఫెన్స్, ప్రాసిక్యూషన్ ఆసక్తికరంగా సాగాయి. ప్రతి ప్రేక్షకుడికి భావోద్వేగాలు కలిగించాడు దర్శకుడు. శివాజీ తెరపై కనిపించిన ప్రతిసారీ ఆ పాత్రపై కోపం కలుగుతుంది. ఆయన కారణంగా, ఓ వ్యక్తి పరువు, ఇగో కోసం జైల్ పాలైన కుర్రాడు శిక్ష నుంచి బయటకు రావాలని ప్రతి ప్రేక్షకుడు కోరుకుంటాడు. అక్కడ ప్రేక్షకుల మనసు గెలిచేశాడు దర్శకుడు. పాత్రలతో బాండింగ్ కుదిరేలా చేశాడు. క్లైమాక్స్‌లో పోక్సో చట్టం గురించి ప్రియదర్శి చెప్పే మాటలు సైతం ఆలోచన కలిగిస్తాయి. చట్టం మీద అవగాహన కలిగించడమే కాకుండా.. చక్కని కోర్టు రూమ్ డ్రామా చూశామనే ఫీలింగ్ కలుగుతుంది. టీనేజ్‌లో ప్రేమికులకు ఎదురయ్యే కష్టాలు, పేదలకు న్యాయం జరగడం లేదనే కోణం, న్యాయవ్యవస్థలో లూప్ హోల్స్‌ను దర్శకుడు చక్కగా చూపించాడు. సినిమాను సినిమాలా కాకుండా ఒక కొత్త పాయింట్ చెప్పాలి అని ట్రై చేసిన ప్రతిసారి దర్శకులు సక్సెస్ అవుతూనే ఉంటారు. తమ సినిమా నుంచి జనాలకు ఎంతో కొంత అవగాహన కల్పించాలని అనుకునే దర్శకులు అరుదుగా ఉంటారు. తాజాగా కోర్టు సినిమా విషయంలో కూడా దర్శకుడు రామ్ జగదీష్ ఇదే చేశాడు. తన సినిమాతో న్యాయ వ్యవస్థలో ఉన్న కొన్ని లొసుగులను కొంతమంది ఎలా తప్పుదారి పట్టిస్తున్నారు అనేది అద్భుతంగా చూపించాడు. నిజానికి కోర్టు రూమ్ డ్రామాలకు ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. అక్కడ వాదన ఎంత బాగా జరిగితే.. సినిమా అంత ఆసక్తికరంగా ఉంటుంది. కోర్టు సినిమాకు కూడా ఈ అడ్వాంటేజ్ బాగా పనికొచ్చింది. తాను చెప్పాలనుకున్న పాయింట్ పక్కదారిపట్టకుండా సూటిగా చెప్పాడు దర్శకుడు. ఫోక్సో చట్టం గురించి చాలా మందికి ఐడియా ఉండదు. అసలు అలాంటి ఒక చట్టం ఉందనే విషయం కూడా చాలా మందికి తెలియకపోవచ్చు. దాన్ని నేపథ్యంగా చేసుకున్నప్పుడే కోర్టు సినిమా విషయంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. దాని చుట్టూ ఒక సింపుల్ కథ అల్లుకున్నాడు. ఒక యంగ్ లవ్ స్టోరీ చూపించాలి అనుకున్నప్పుడు కొన్ని రిస్కులు తీసుకోవాల్సి వస్తుంది.. కానీ సినిమాలో ఎలాంటి అసభ్యత లేకుండా చాలా క్లీన్ గా తెరకెక్కించాడు. క్లైమాక్స్ లో చూపించే ట్విస్ట్ కూడా హీరో హీరోయిన్ అమాయకత్వానికి పరాకాష్టలా ఉంటుంది. కానీ సినిమాలో ఎమోషనల్ సీన్ కూడా అదే. ఎందుకంటే ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరిగిన అన్ని వేళ్ళు దర్శకుడి వైపు చూపిస్తాయి. తన వైపు నుంచి ఆ తప్పు జరగకుండా జాగ్రత్తగా స్క్రిప్ట్ రాసుకున్నాడు దర్శకుడు రామ్ జగదీష్. ఫస్ట్ ఆఫ్ అంతా హీరో, హీరోయిన్ లవ్ ట్రాక్.. పరువే ప్రాణంగా బ్రతికే ఇంటి పెద్దకు విషయం తెలియడం.. ఆ కుర్రాడిపై లేనిపోని కేసులు పెట్టి జైలుకు పంపించడం.. ఇవన్నీ చకచకా జరిగిపోతాయి. అసలు కథ మొత్తం ప్రియదర్శి కేసు టేకప్ చేసిన దగ్గర నుంచి నుంచి మొదలవుతుంది. సెకండ్ హాఫ్ అంతా వాదనలు, ప్రతివాదనలు, ట్విస్ట్ లతో ఇంట్రెస్టింగ్ గా వెళ్ళిపోతుంది. ఎక్కడా మనం ఊహించని మలుపులు అయితే ఉండవు కానీ.. మనం ఊహించినప్పుడు మాత్రం ఆ మలుపులు రావు. కోర్టు సినిమా చూస్తున్నప్పుడు అదే అనిపించింది. కథ మనం అనుకున్నట్టుగానే ముందుకు సాగుతుంది కానీ కథనం మాత్రం అలా కాదు. కథ ఎంత సున్నితంగా ఉందో.. ఎమోషన్స్ అంత బలంగా ఉన్నాయి. కోర్టు డ్రామా అంతా బాగా వర్కవుట్ అయింది. క్లైమాక్స్ కూడా చాలా బాగా రాసుకున్నాడు దర్శకుడు. మరీ ముఖ్యంగా ఇలాంటి కథలో ఎలాంటి అసభ్యత లేకుండా చూసుకున్నాడు. క్లైమాక్స్ లో న్యాయ వ్యవస్థను ప్రశ్నించాడు కూడా. సినిమాలో మెయిన్ థీమ్, అలాగే టీనేజ్ లో పుట్టే తొలిప్రేమ తాలూకు కష్టనష్టాలు, ఇక పేదవాళ్ళకి ఈరోజుల్లో న్యాయం జరగడం లేదు’ అనే కోణం.. వీటి మధ్య మంగపతి లాంటి బలమైన పాత్రలు.. వాటి సంఘర్షణలు.. మొత్తంగా ఈ కోర్ట్ సినిమా ఆకట్టుకుంది. దర్శకుడు రామ్ జగదీష్ రాసుకున్న కోర్టు ఎపిసోడ్స్ అండ్ ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి. ముఖ్యంగా ఫ్యామిలీస్ మధ్య సెంటిమెంట్ చాలా బాగుంది. అలాగే, టీనేజ్ ప్రేమను దృష్టిలో పెట్టుకొని ఈ చిత్రాన్ని దర్శకుడు చాలా బాగా తెరకెక్కించాడు. ప్రేమ సన్నివేశాలు కూడా మెప్పిస్తాయి. శివాజీ టైమింగ్ కూడా సినిమాకి బాగా ప్లస్ అయింది. ‘కోర్టు : స్టేట్ వర్సెస్ ఎ నోబడీ’ వంటి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి. వినోదం కోసం చూసే సినిమా కాదిది. సమాజం పట్ల దర్శక నిర్మాతలకు బాధ్యత ఉన్నప్పుడు ఇటువంటి సినిమాలు వస్తాయి. పోక్సో చట్టం మీద అవగాహన కల్పించడంతో పాటు మనసుల్ని కాస్త కదిలించే కోర్టు రూమ్ డ్రామా చూశామనే సంతృప్తి ఇచ్చే చిత్రమిది. వినోదం పంచడం కోసం, కమర్షియల్ యాంగిల్‌లో కొన్ని సినిమాలు వస్తుంటాయి. కానీ ఈ తరహా కథలు రేర్‌గా వస్తుంటాయి. సమాజంపై బాధ్యత ఉన్న మేకర్స్ మాత్రమే ఈ తరహా సినిమాలు తీయగలరు. పోక్సో చట్టం అంటే ఏంటి? అన్నది చెప్పడంతోపాటు దానిపై ఎంతో కొంత అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు దర్శకుడు. కోర్ట్ రూమ్ డ్రామా మనసుల్ని కదిలించింది. చదువుతో పాటు చట్టం కూడా తెలిసి ఉండాలి అనే చక్కని సందేశం ఇచ్చారు. 18 ఏళ్లు నిండటానికి ఒక ఘడియ ముందు, ఘడియా తర్వాల చట్టంలో ఎంత మార్పు ఉంది అనేది క్లియర్‌గా చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు. కమర్షియల్ సినిమాలను ఇష్టపడేవారు, సినిమా అంటే భారీ అంచనాలు పెట్టుకునే వారికి ఈ సినిమా ఎక్కకపోవచ్చు. కానీ.. సోసైటీలో ఓ మనిషి, అతనికి వచ్చిన కష్టం, న్యాయం జరగాలి, సమస్యకు పరిష్కారం దొరకాలి అని ఆలోచించే మనసున్న అందరికీ తప్పకుండా ఈ చిత్రం నచ్చుతుంది. చదువుతోపాటు చట్టం కూడా తెలియాలి అనే పాయింట్ సగటు ప్రేక్షకుడిని ఆలోచించేలా చేసింది. సినిమాపై నాని నమ్మకం నిజం అయింది. దర్శకుడు రామ్ జగదీశ్ చాలా సెన్సిబుల్ సబ్జెక్టు అయిన “పోక్సో” యాక్ట్ ను మూలకథగా తీసుకొని, ఎక్కడా అసభ్యతకు తావులేకుండా ఆ టాపిక్ ను డిస్కస్ చేసినందుకు కచ్చితంగా ప్రశంసించాలి. అయితే.. కన్వీనియెంట్ గా స్క్రీన్ ప్లే కోర్ట్ ప్రొసీడింగ్స్ రాసుకున్నాడు. నిజానికి హర్షవర్ధన్ వాదించే పాయింట్స్ అన్నీ క్రాస్ ఎగ్జామినేషన్ లో తేలిపోతాయి అని అర్థమవుతూనే ఉంటుంది. అంత సింపుల్ పాయింట్స్ మీద పోక్సో యాక్ట్ కేస్ ను నడిపించడం అనేది ఎందుకో పొసగలేదు. అలాగే.. శివాజీ పాత్ర ఎంత అద్భుతంగా పేలినప్పటికీ, అతడి పాత్ర తాలూకు వ్యవహారశైలి అలా ఎందుకు ఉంది అనేది క్యారెక్టర్ ఆర్క్ లో ఇంకాస్త ఎక్స్ ప్లోర్ చేసి ఉంటే ఇంకాస్త బెటర్ కనెక్టివిటీ ఉండేది. సాయికుమార్-ప్రియదర్శి మధ్య సన్నివేశాలను రాసుకున్న విధానం ప్రశంసార్హం. “క్వశ్చన్ చేయాలి” అంటూ సాయికుమార్ విపులంగా లాయర్ బాధ్యతను వివరించే విధానం మంచి హై ఇస్తుంది. అయితే.. సినిమా చివర్లో జాబిలి పాత్ర “ఇవాళ నా 18వ బర్త్ డే” అని చెప్పి హగ్ చేసుకోవడం అనేది మాత్రం అప్పటివరకు “పోక్సో” చట్టం, దానిపై ప్రస్తుత తరం ప్రేక్షకులు అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని చెప్పుకుంటూ వచ్చిన క్రూషియల్ పాయింట్ ను డైల్యూట్ చేసేసింది. ఆ ఒక్క డైలాగ్ ను మ్యూట్ చేస్తే బాగుంటుంది. లేదంటే.. 18 ఏళ్లు వచ్చాక ఏదైనా చేయండి అనే తప్పుడు సందేశం ఇచ్చినట్లుగా ఉంటుంది. ఓవరాల్ గా కథకుడిగా కంటే దర్శకుడిగా ఎక్కువ మార్కులు సంపాదించుకున్నాడు రామ్ జగదీష్.
నటీనటులు విషయానికొస్తే… ప్రియదర్శి నటన గురించి కొత్తగా ఏం చెప్పాలి.. ఛాలెంజింగ్ క్యారెక్టర్ ఎప్పుడు వచ్చినా చాలా బాగా నటించి చూపిస్తాడు. కోర్టులో లాయరుగా అదరగొట్టాడు. మరోసారి చక్కని నటన కనబర్చారు. క్యారెక్టర్ పరిధి దాటి.. అంటే పాత్రను మరింత మెరుగుపరిచేలా యాక్ట్ చేశాడు. అల్లరిగా, కామెడీగా అలరించే ప్రియదర్శికి కొత్త పాత్ర ఇది. మంచి మార్కులే కొట్టేశాడు. కోపం, ఆశ్చర్యం, హాస్యం వంటి భావాలన్నీ ఒకేసారి పండించగల సత్తా ప్రియదర్శి సొంతం. అతడికి తెలుగు వాచకం మీద ఉన్న కమాండ్ కారణంగా పదాలు చాలా స్పష్టంగా పలుకుతాడు. ఈ చిత్రంలో పోషించిన లాయర్ పాత్రలో ప్రతి డైలాగ్ స్పష్టంగా పలుకుతూ.. మంచి ఎమోషన్స్ ను పలికిస్తూ నటుడిగా తన స్థాయిని మరింత పెంచుకున్నాడు. చివరిలో పోక్సో గురించి ప్రియదర్శి చెప్పే మాటలు సైతం ఆలోచన కలిగిస్తాయి. చట్టం మీద అవగాహన కలిగించడం మాత్రమే కాదు… డీసెంట్ కోర్టు రూమ్ డ్రామాను చూశామనే చిన్న సంతృప్తిని అందిస్తుందీ ‘కోర్టు’. సినిమాలో బోలెడుమంది సీనియర్ ఆర్టిస్టులు, యంగ్ యాక్టర్స్ ఉన్నప్పటికీ.. వాళ్లందరినీ తన స్క్రీన్ ప్రెజన్స్ .. టెర్రిఫిక్ డైలాగ్ డెలివరీతో డామినేట్ చేసేశాడు శివాజీ. “బూచమ్మ బూచోడు” తర్వాత దాదాపు 11 ఏళ్ల అనంతరం వెండితెర ఎంట్రీ ఇచ్చి తాను కనిపించే ప్రతి సన్నివేశంలోనూ అత్యద్భుతమైన నటన కనబరిచి ప్రేక్షకులను అలరించడం అనేది మామూలు విషయం కాదు. తెలుగు సినిమా ఇండస్ట్రీ చరిత్రలో శివాజీ రీఎంట్రీ ఎప్పటికీ నిలిచిపోతుంది. ఆస్థాయిలో మంగపతి పాత్రలో జీవించేశాడు. నిజంగానే మన ఇంట్లో బాబాయ్, మావయ్య లేదా తాతలు గుర్తుకొస్తారు. చాలా రిలేటబుల్ క్యారెక్టర్ ఇది. నెగటివ్ షేడున్న పాత్రలో శివాజీ చక్కగా నటించారు. అక్కడక్కడా అతిగా అనిపించినా క్లైమాక్స్‌లో బ్యాలెన్స్ చేశారు. ‘90స్ మిడిల్ క్లాస్’ వెబ్ సిరీస్ తర్వాత ఆయన ఫామ్‌లోకి వచ్చారు. ఇప్పుడు ఈ సినిమాలో విలనీ కూడా బాగా చేశాడు. పాత్ర మీద కోపం వచ్చేలా చేశాడంటే ఆ పాత్రకు ప్రాణం పోసినట్టే. శివాజీ నటన చూసిన ప్రతిసారీ ఆయన మీద కోపం కలుగుతుంది. ఆయన కారణంగా జైలు పాలైన కుర్రాడు శిక్ష పడకుండా బయటకు వస్తే బావుంటుందని ఒక చిన్నపాటి ఆశ మొదలవుతుంది. లాజిక్స్, కన్వీనియెంట్ రైటింగ్స్ వంటివి పక్కన పెట్టి క్యారెక్టర్లతో ఎమోషనల్ బాండింగ్ క్రియేట్ అయ్యేలా ఇంటర్వెల్ తర్వాత రామ్ జగదీష్ డైరెక్షన్ సాగింది. మరో సీనియర్ యాక్టర్ సాయికుమార్ కి మంచి పాత్ర లభించింది. అతడి పాత్ర హుందాగా ఉంది సెకండాఫ్ లో ప్రియదర్శి ఇంటికి వెళ్లి సాయికుమార్ చెప్పే మాటలు అర్థవంతంగా ఉంటూనే ఆలోజింపజేస్తాయి. ఆ సన్నివేశాన్ని కంపోజ్ చేసిన విధానం కూడా బాగుంది. స్వాగ్” సినిమాతో నటుడిగా ఆశ్చర్యపరిచిన హర్ష్ రోషన్ ఈ సినిమాలో కీలకపాత్రలో నటించిన తీరు రెగ్యులర్ గా ఉన్నప్పటికీ.. సెకండాఫ్ మొత్తం ఒక్క డైలాగ్ కూడా లేకుండా కేవలం హావభావాలతో రియాక్ట్ అవుతూ పాత్రను పండించిన విధానం బాగుంది. అలాగే.. శ్రీదేవి సినిమాకి ఒక ఫ్రెష్ నెస్ యాడ్ చేసింది. ఆమె అమాయకంగా కన్నీరు పెట్టుకుంటే ప్రేక్షకుడి మనసులో ఎక్కడో తడి తగులుతుంది. హర్షవర్ధన్ ఓ కన్నింగ్ లాయర్ గా తన మార్క్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. రోహిణి ఓ సగటు ఆడపిల్ల తల్లిగా అలరించింది. హర్ష్ రోషన్, శ్రీదేవి జంట బావుంది. చిన్న వయసులోనే వాళ్ళిద్దరూ మంచి నటన కనబరిచారు. వాళ్ల క్యాస్టూమ్స్ సహజంగా ఉన్నాయి. పాత్రలూ అంతే. పెద్దగా మాటలు లేని పాత్రను రోహిణి ఎందుకు చేశారనే భావన కలుగుతున్న తరుణంలో వాటిని కొట్టిపడేసేలా క్లైమాక్స్‌లో ఆమె పాత్ర ఉంటుంది. అయితే ఆమెకు తగిన పాత్ర కాదిది. కానీ ఆ పాత్ర ఆమె చేయడం వల్ల హుందాతనం వచ్చింది. లాయర్‌గా హర్షవర్థన్ పాత్ర బావుంది. వడ్లమాని శ్రీనివాస్, సురభి ప్రభావతి పాత్రలకు న్యాయం చేశారు. బాల నటుడిగా ఇప్పటికే చాలా సినిమాల్లో మెప్పించిన హర్ష రోషన్ ఈ సినిమాలో చందు పాత్రలో చాలా మెచ్యూర్డ్ గా నటించాడు. కొత్తమ్మాయి శ్రీదేవి బాగుంది.. నటన కూడా ఆకట్టుకుంటుంది. సాయి కుమార్ కనిపించేది కొన్ని సీన్స్ అయినా కూడా చాలా ఇంపాక్ట్ ఉంది. ఈ సినిమాలో ఎంతమంది ఉన్నా ఈ సినిమాను నిలబెట్టింది శివాజీ.. ఆయన నటన నెక్స్ట్ లెవెల్. తనలోని సరికొత్త విలనిజం చూపించాడు శివాజీ. రోహిణి, శుభలేఖ సుధాకర్ లాంటి వాళ్లంతా తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.
ఇక టెక్నికల్ విషయానికొస్తే.. విజయ్ బుల్గానిన్ నేపథ్య సంగీతం సినిమాకు ఎసెట్. కెమెరా వర్క్ బావుంది. కమర్షియల్ సినిమా చూసిన ఫీల్ కలిగించింది. చందూ పాత్రకు బెయిల్ రిజెక్షన్ వంటి సన్నివేశాలు కాస్త సాగదీతగా ఉన్నాయి. ఎడిటర్ కాస్త కత్తెర వేసుంటే క్రిస్ప్‌గా ఉండేది. దినేష్ పురుషోత్తమన్ సినిమాటోగ్రఫీ వర్క్, కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్, విజయ్ బుల్గానిన్ సంగీతం వంటి టెక్నికల్ అంశాలన్నీ ఒకదాన్ని మరొకటి కాంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చాయి. అందుకే టెక్నికల్ గా ఎక్కడా మైనస్ అనేది కనిపించదు. ఆర్ట్ డిపార్ట్మెంట్ ను కోర్ట్ సెట్ విషయంలో కచ్చితంగా మెచ్చుకోవాలి. అది సెట్ అనే విషయం వాళ్లు చెప్తే తప్ప ఎవరికీ తెలియదు. సినిమాలో చెప్పాలనుకున్న కాన్సెప్ట్ మరియు మెసేజ్ చాలా బాగుంది. కథనం కూడా ఆసక్తికరంగానే ఉంది. ఇక సంగీత దర్శకుడు విజయ్ బుల్గానిన్ సమకూర్చిన పాటలు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే.. లొకేషన్స్ అన్ని న్యాచురల్ విజువల్స్ తో ఆకట్టుకున్నాయి. ఈ సినిమాకు మెయిన్ హైలెట్ బేబీ ఫేమ్ విజయ్ బుల్గానిన్ సంగీతం. ప్రేమలో సాంగ్ ఇప్పటికే బాగా పాపులర్ అయింది.. సినిమాలో ఉన్న మిగిలిన రెండు పాటలు కూడా ఆకట్టుకున్నాయి. కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ షార్ప్ గా ఉంది. దినేష్ పురుషోత్తమన్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఇక నాని తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు కొత్త దర్శకుడు రామ్ జగదీష్. నాని నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయి. కథకు నేపథ్య సంగీతం బలంగా నిలిచింది. కమర్షియల్ సినిమా చూసిన ఫీల్ కలిగించింది. ఇటువంటి సినిమాలకు మరింత సహజంగా ఉంటే బాగుంటుంది. చిత్ర సమర్పకులు నాని, నిర్మాత ప్రశాంతి తిపిర్నేని నిర్మాణ విలువలు కథకు తగ్గ స్థాయిలో ఉన్నాయి.
(చిత్రం: కోర్ట్, విడుదల: 14 మార్చి-2025, రేటింగ్ : 3.5/5, నటీనటులు: శివాజీ, ప్రియదర్శి, హర్ష రోషన్, శ్రీదేవి ఆపల్లా, సాయి కుమార్, శుభలేఖ సుధాకర్, రోహిణి తదితరులు. సాంకేతిక నిపుణులు: సినిమాటోగ్రఫీ :దినేష్ పురుషోత్తమన్, సంగీతం: విజయ్ బుల్గానిన్, ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్ ఆర్, నిర్మాత: ప్రశాంతి తిపిర్నేని, సమర్పణ: హీరో నాని, దర్శకత్వం: రామ్ జగదీష్)
Court movie review : ‘కోర్ట్’ మూవీ రివ్యూ.. ఆకట్టుకునే ‘కోర్ట్’ డ్రామా!
