(చిత్రం : కూలీ, రేటింగ్ : 3/5, నటీనటులు: రజనీకాంత్, నాగార్జున, సౌబీన్ షాషిర్, ఉపేంద్ర, శృతి హాసన్, సత్యరాజ్, అమీర్ ఖాన్, రెబా మోనికా జాన్, జూనియర్ ఎంజీఆర్, మోనిషా బ్లెస్సీ, పూజా హెగ్డే (పాటలో ప్రత్యేక పాత్ర), అమీర్ ఖాన్ (అతిథి పాత్ర) తదితరులు.తదితరులు. దర్శకత్వం: లోకేష్ కనకరాజ్, నిర్మాత: కళానిధి మారన్, సినిమాటోగ్రఫి: గిరీష్ గంగాధరన్, ఎడిటింగ్: ఫిలోమన్ రాజ్, మ్యూజిక్: అనిరుధ్ రవిచందర్, బ్యానర్: సన్ పిక్చర్స్, విడుదల :ఆగస్టు 14, 2025)
సూపర్ స్టార్ రజనీకాంత్, కింగ్ నాగార్జున కలయికలో వచ్చిన చిత్రం ‘కూలీ’. బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహకందని హైప్ తో ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా నేడు (14 ఆగస్టు 2025) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో తెలుసుకుందాం ..
కథ : సైమన్ ( నాగార్జున అక్కినేని) పోర్టులో అక్రమ దందాలు నిర్వహిస్తుంటాడు. సైమన్ వద్ద దయాల్ (సౌబీన్ షాహిర్) నమ్మకంగా పనిచేస్తుంటాడు. సైమన్ చేసే అక్రమ వ్యాపారాన్ని తెలుసుకోవడానికి పోలీసులు అండర్ కవర్ ఆపరేషన్ చేస్తుంటారు. అలాంటి వారిని గుర్తించి చంపేయడం దయాల్ పనిగా పెట్టుకొంటాడు. అయితే రాజశేఖర్ (సత్యరాజ్)ను దయాల్ చంపేస్తుంటాడు. అయితే తన స్నేహితుడు రాజశేఖర్ మరణిస్తే..చివరి చూపు కోసం దేవా (రజనీకాంత్) వెళ్తే అతడి కూతురు ప్రీతీ (శృతిహాసన్) అడ్డుకొంటుంది. అయితే రాజశేఖర్ మరణం తర్వాత ప్రీతీతో ఇద్దరు చెల్లెల ప్రాణాలకు ముప్పు ఉందని తెలుసుకొన్న దేవా వారిని రక్షించడానికి రంగంలోకి దిగుతాడు. సైమన్ చేసే అక్రమ వ్యాపారాలు ఏంటి? సైమన్ కంపెనీలో పనిచేసే సిబ్బందిని చంపేసి ఆనవాళ్లు లేకుండా వాళ్ళను కాల్చివేస్తుంటారు? సైమన్ బిజినెస్‌పై పోలీసులు ఎందుకు అండర్ కవర్ ఆపరేషన్ చేశారు? రాజశేఖర్‌ను దయాల్ ఎందుకు చంపాడు? దయాల్ చంపేసే సమయంలో రాజశేఖర్ చెప్పిన మాట ఏమిటి? అసలు రాజశేఖర్, దేవాకు మధ్య ఉన్న సంబంధం ఏమిటి? తన స్నేహితుడి కోసం దేవా దేనికైనా తెగించేందుకు సిద్దపడ్డారు. ఆపదలో ఉన్నప్పుడు ఓ ఫోన్ నెంబర్ కాల్ చేసి రాజశేఖర్ కూలీ నంబర్ ఎందుకు చెప్పమన్నాడు? ఆ కూలీ నంబర్ ఎవరిది? సైమన్‌కు దేవాకు ఉన్న వైరం ఏమిటి? దాహా (అమీర్ ఖాన్)కు దేవాకు ఉన్న కనెక్టవిటీ ఏమిటి? దేవా అసలు జీవితం ఏమిటి? సైమన్‌కు దేవా ఎలాంటి గుణపాఠం చెప్పాడు అనే ప్రశ్నలకు సమాధానమే కూలి సినిమా కథ.
విశ్లేషణ: ‘కూలీ’ అంటూ భారీ తారాగణంతో వచ్చిన ఈ చిత్రంలో రజినీకాంత్ నటన, నాగార్జున విలనిజం, ఉపేంద్ర, అమీర్ ఖాన్ గెస్ట్ అప్పీరియన్స్ మరియు యాక్షన్ సీన్స్ బాగున్నాయి. కథనంలో పూర్తి స్థాయిలో ఉత్సుకతను పెంచటంలో లోకేష్ విఫలమయ్యారు. స్క్రీన్ ప్లేను ఇంకా ఆసక్తికరంగా మలిచే అవకాశం ఉన్నపటికీ ఆయన మాత్రం తన శైలిలోనే సినిమాని ముగించారు. ఓవరాల్ గా ఈ కూలీ సినిమాలో బలమైన ఎమోషన్, కాన్ ఫ్లిక్ట్ ఉన్నప్పటికీ, ఆ ఎమోషన్ లో కాన్ ఫ్లిక్ట్ లో ప్రేక్షకుడు ఇన్ వాల్వ్ అయ్యేంతగా.. అవి సరిగ్గా ఎస్టాబ్లిష్మెంట్ అవ్వలేదు. లోకేష్ కనకరాజ్ సినిమా అనగానే.. మాఫియా, డ్రగ్స్, అక్రమ వ్యాపారాల చుట్టే కథ తిరుగుతుందనే విషయం కొత్తగా చెప్పనక్కర్లేదు. అందరిలో ఉన్న అభిప్రాయానికి తగినట్టే లోకేష్ తాను నమ్ముకొన్న పాయింట్‌కు ఎమోషన్స్ జోడించి పాత కథనే తిరగేసి చెప్పడంతో ఈ సినిమాలో రజనీ చరిష్మా తప్ప కొత్తగా విషయం ఏమీ లేదనే విషయం సినిమా ఆరంభంలోనే తెలిసిపోతుంది. ఇమేజ్‌కు భిన్నంగా నాగార్జున చేసిన సైమన్ క్యారెక్టర్‌ను ఎఫెక్టివ్‌గా చూపించలేకపోయాడు. నాగార్జున ఇలాంటి పాత్రతో విలనిజాన్ని చేయాల్సిన అవసరం ఉందా? అనే ప్రశ్న ఆడియెన్స్‌లో కలగడం అత్యంత సహజంగా అనిపిస్తుంది. విలన్‌గా స్టైలిష్‌గా అక్కడక్కడ నాగార్జున కనిపించాడే కానీ.. పెర్ఫార్మెన్స్ విషయంలో తడబాటుకు గురయ్యాడని పలు సన్నివేశాలు స్పష్టంగా చెప్పాయి. రజనీ పాత్ర చుట్టూ ఉండే బిల్డప్, స్టైలిష్ మేకింగ్ ఈ సినిమాకు బలంగా కనిపించింది. చివర్లో ఉపేంద్ర, అమీర్ ఖాన్ పాత్రలు ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఇక ఈ సినిమాకు అత్యంత బలం దయాల్ పాత్రలో కనిపించిన సౌబీన్. ఈ సినిమాకు హీరో అతనే అనడంలో ఏ మాత్రం అనుమానం, సందేహాలు అక్కర్లేదు. సౌబీన్ ఈ సినిమా భారాన్నంతా తన భుజాలపై మోయడమే కాకుండా తన పెర్ఫార్మెన్స్తో అందరి హీరోల అభిమానులను ఆకట్టుకొన్నాడు. ఈ సినిమాకు పవర్‌హౌస్ సౌబీన్ అని చెప్పాలి. దేవాగా సూపర్ స్టార్ రజినీకాంత్ తన అభిమానులను మాత్రం ఉర్రూతలూగించారు. పవర్ ఫుల్ యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు ఎమోషన్స్ తోనూ సూపర్ స్టార్ మెప్పించారు. ముఖ్యంగా తన పాత్ర పరిస్థితులకు తగ్గట్టు వేరియేషన్స్ చూపిస్తూ.. రజినీ నటించిన విధానం ఆకట్టుకుంది. పైగా తన బాడీ లాంగ్వేజ్ తో అలాగే, కొన్ని యాక్షన్ అండ్ ప్లాష్ బ్యాక్ సీక్వెన్స్ స్ లో మరియు తన స్టైలిష్ లుక్స్ తో రజినీకాంత్ చాలా బాగా నటించాడు. విలన్ గా నటించిన నాగార్జున తన పాత్రలో ఆకట్టుకున్నారు. నాగ్ లుక్ కూడా బాగుంది. ఇక అతిధి పాత్రల్లో నటించిన ఉపేంద్ర, అమీర్ ఖాన్ లు కూడా సినిమాకి బాగా ప్లస్ అయ్యారు. మరో కీలక పాత్రలో నటించిన సౌబిన్ షాహిర్ కూడా చాలా బాగా నటించాడు. కూతురి పాత్రలో శ్రుతి హాసన్ ఒదిగిపోయింది. పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ బాగుంది. జూనియర్ ఎంజీఆర్, మోనిషా బ్లెస్సీ, రచితా రామ్ లతో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు. దర్శకుడు లోకేష్ కనగరాజ్ రాసుకున్న యాక్షన్ సీన్స్ బాగున్నాయి. అలాగే ఆయన క్యారెక్టర్స్ కూడా బాగున్నాయి. దేవా పాత్రను, ఆ పాత్ర తాలూకు గ్రాఫ్ ను బాగా డిజైన్ చేసుకున్న దర్శకుడు లోకేష్ కనగరాజ్ అంతే స్థాయిలో ట్రీట్మెంట్ ను రాసుకోలేదు. ముఖ్యంగా ఆసక్తికరంగా కూలీ కథనాన్ని మాత్రం రాసుకోలేదు. ఈ కూలీ లో కొన్ని సన్నివేశాలు బాగా స్లోగా సాగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. పైగా కొన్ని సన్నివేశాలు మినహా ఎక్కడా ఫ్రెష్ నెస్ కనిపించదు. ఫస్ట్ హాఫ్ ను వేగంగా నడిపిన లోకేష్ సెకెండాఫ్ ని మాత్రం మరీ సాగతీశారు. లోకేష్ కనగరాజ్ దర్శకుడిగా ఈ సినిమాకి న్యాయం చేసినా.. రచయితగా మాత్రం పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేదు. నిజానికి ఆసక్తికరమైన పాత్రలతో చిత్రాన్ని అందంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేసినప్పటికీ.. ఆయన కథనం మీద ఇంకా శ్రద్ధ పెట్టి ఉండాల్సింది.
టెక్నికల్ విషయానికి వస్తే.. సంగీత దర్శకుడు అనిరుద్ రవిచంద్రన్ అందించిన సంగీతం బాగుంది. ముఖ్యంగా కొన్ని సన్నివేశాల్లో నేపధ్య సంగీతం చాలా బాగుంది.చాలా పేలవమైన సీన్లను తన మ్యూజిక్‌తో హైప్ ఇచ్చాడు. ముఖ్యంగా రజనీకాంత్ సీన్లకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఫ్యాన్స్‌తో కేక పెట్టించేలా ఉంది. ఈ సినిమాకు సినిమాటోగ్రఫి, యాక్షన్ కోరియోగ్రఫి స్పెషల్ ఎట్రాక్షన్. గిరీష్ గంగాధరన్ చిత్రీకరించిన విధానం బాగుంది. సినిమాలోని కళానిధి మారన్ నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. కథ, కథనాలు చాలా బలహీనంగా ఉంటాయి. సినిమా మొత్తం నత్త నడకన సాగడం ఓ దశలో ప్రేక్షకుల సహనానికి పరీక్షగా మారుతుంది. కథ, కథనాలపై ఇంకాస్త దృష్టిపెట్టాల్సింది. భారీ అంచనాలు పెట్టుకొన్న ఫ్యాన్స్‌ను లోకేష్ నిరాశపరిచాడనే చెప్పాలి. ఎలాంటి అంచనాలు లేకున్నా.. అసంతృప్తికి గురి కాకుండా ఉండలేరు. రజనీ, సౌబీన్, శృతి ఫెర్ఫార్మెన్స్ కోసం, అనిరుధ్ మ్యూజిక్ ఓ సారి చూడొచ్చు. రజనీ ఎప్పటిలానే తన యాక్టింగ్‌తో అక్కడక్కడ మాయాజాలం చేయడం సినిమా రక్షణగా నిలిచింది. ఓవరాల్ గా సూపర్ స్టార్ అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులను కూడా ఈ చిత్రం ఆకట్టుకుంటుంది.