ఆ పార్టీలకు వెళితేనే బాలీవుడ్‌లో ఛాన్సులు వస్తాయ్‌ : రెజీనా

Chances in Bollywood will come only if you go to those parties: Regina
Spread the love

సినిమాల్లోకి వచ్చి దాదాపు 20 ఏళ్లు కావొస్తుండగా బాలీవుడ్‌ ఎంట్రీ ఎందుకు ఆలస్యమైందని ఎదురైన ఓ ప్రశ్నకు రెజీనా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్‌ డియాలోబాగా వైరల్‌ అవుతున్నాయి. 2019లో ‘ఏక్‌ లడ్కీ కో దేఖాతో ఐసా లగా’ సినిమాతో హిందీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది రెజీనా. ఆ సమయంలో తనకు ఎదురైన ఘటనల గురించి ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించింది. నార్త్‌ సినిమా పరిశ్రమకు, సౌత్‌ ఇండస్ట్రీకి మధ్య తేడాలను చెప్పుకొచ్చింది. సౌత్‌ నుంచి నార్త్‌కు వెళ్లి లాంగ్వేజ్‌ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ కారణంగా చాలామంది సినిమా అవకాశాలు కోల్పోయారు. కానీ, బాలీవుడ్‌ నుంచి ఇక్కడకు వచ్చిన వాళ్లు ఎప్పుడూ ఆ ఇబ్బంది పడరు, ఇబ్బంది పెట్టరని పేర్కొంది. హిందీ సినిమాల్లో నటించాలని మనం నిర్ణయించుకున్నప్పుడు ముంబయిలోనే ఉండాలని, మీటింగ్స్‌ హాజరు కావాలని చెప్పారని.. ఈ విషయం తనకు నచ్చకపోయినా బాలీవుడ్‌లో అదే ముఖ్యమని అర్థమైందని తెలిపింది. ఈ నేపథ్యంలో ఆ మీటింగ్స్‌ ఏంటి, అవెలాంటి మీటింగ్స్‌, ఎవరెవరు వస్తారు, ఇంతకు ముందు ఎంతమంది వీటిల్లో పాల్గొన్నారనే చర్చ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో నడుస్తున్నది. ప్రస్తుతం రెజీనా వ్యాఖ్యలు నెట్టింట బాగా వైరల్‌గా మారాయి. ఇదిలా ఉండగా ప్రస్తుతం రెజీనా హిందీ, తెలుగులో రూపొందుతున్న ‘జాట్‌’ సినిమాతో పాటు తమిళంలో అజిత్‌ ‘విదాముయార్చి’తో పాటు ‘ఫ్లాష్‌బ్యాక్‌’ అనే సినిమాల్లో నటిస్తుండగా ‘సెక్షన్‌ 108’ అనే ఓ హిందీ చిత్రం కూడా చేస్తోంది.

Related posts

Leave a Comment