# 64 దేశాల్లో గల18 కోట్ల బంజారాలు గుండెల్లో పెట్టుకుంటారు!! # తెలుగు-బంజారా-హిందీ భాషల్లో 18న ప్రేక్షకుల ముందుకు!! శ్రీశ్రీ హథీరామ్ బాలాజీ క్రియేషన్స్ పతాకంపై యువ ప్రతిభాశాలి కె.పి.ఎన్.చౌహాన్ దర్శకత్వంలో.. ఇస్లావత్ వినోద్ రైనా-సీతారామ్ నాయక్ సంయుక్తంగా నిర్మించిన ప్రతిష్టాత్మక బహుభాషా చిత్రం “సేవాదాస్”. సీనియర్ హీరోలు సుమన్, భానుచందర్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రంలో కె.పి.ఎన్. చౌహాన్, ప్రీతి అస్రాని హీరో హీరోయిన్లు. కె.పి.ఎన్.చౌహాన్ దర్శకత్వంలో బంజారా-తెలుగు- ఇంగ్లీష్-హిందీ భాషల్లో రూపొందిన ఈ చిత్రం ప్రి-రిలీజ్ వేడుక హైద్రాబాద్ లోని ఎ ఎమ్ బి మాల్ లో ఘనంగా జరిగింది. ఈ చిత్రంలో సేవాలాల్ గా నటించిన సీనియర్ హీరో సుమన్, కీలక పాత్రలు పోషించిన భానుచందర్, విజయ్ రంగరాజు, గీతాసింగ్, హీరో కె.పి.ఎన్. చౌహాన్, హీరోయిన్ ప్రీతి అస్రాని ఈ వేడుకలో…
Category: FILM NEWS
The Biggest Surprise of 2022 IS FINALLY HERE
• Bigg Boss launches its logo today on Disney+ Hotstar Telugu Hyderabad, Friday 9th February 2022 – Bigg Boss Non Stop promising 24/7 entertainment, direct from the Bigg Boss house, only on Disney+ Hotstar. This entertainment marvel will be reaching your hands very soon. With an interesting mix of housemates and your NonStop eye on them, Telugu audience would witness entertainment at next level. Bigg Boss launches its logo today on Disney+ Hotstar Telugu social media handle and it’s a vibrant masterpiece. Blue and Red signify the primary colors of…
‘జీ 5’ ఓటీటీలో ఫిబ్రవరి18న సంక్రాంతి బ్లాక్ బస్టర్ ‘బంగార్రాజు’ విడుదల
‘జీ 5’ ఓటీటీ లక్ష్యం ఒక్కటే… వీక్షకులకు వినోదం అందించడమే. కామెడీ కావచ్చు, డ్రామా కావచ్చు, యాక్షన్ కావచ్చు. జానర్ ఏదైనా… ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేయడమే ‘జీ 5’ ముఖ్య ఉద్దేశం. ఎప్పటికప్పుడు విలక్షణ కథలు, కథాంశాలతో రూపొందించిన వైవిధ్యమైన ఒరిజినల్ సిరీస్‌లు, డైరెక్ట్-టు-డిజిటల్ రిలీజ్‌లు, కొత్త సినిమాలను వీక్షకులకు అందిస్తోంది ‘జీ 5’. తాజాగా సంక్రాంతి బ్లాక్ బస్టర్ మూవీ ‘బంగార్రాజు’ను విడుదల చేయడానికి సిద్ధమైంది. కింగ్ అక్కినేని నాగార్జున, యువసామ్రాట్ నాగచైతన్య హీరోలుగా నటించిన సినిమా ‘బంగార్రాజు’. ‘సోగ్గాడు మళ్ళీ వచ్చాడు’… అనేది ఉపశీర్షిక. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వహించారు. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. నాగార్జున నిర్మాత. సంక్రాంతికి థియేటర్లలో విడుదలైంది. బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. వెండితెరపై ప్రేక్షకుల్ని అలరించింది. ఇప్పుడీ సినిమాను వీక్షకుల…
‘Bangarraju’ to be streamed on ZEE5
Nagarjuna-Naga Chaitanya’s blockbuster to be premiered from February 18 Hyderabad, 9th February 2022: ZEE5 has had the sole aim of dishing out the best entertainment, be it in the form of comedy, drama, or action. ZEE5 has been continuously engaging its patrons for years by choosing a variety of stories and myriad subjects. From web series, direct-to-digital releases, and new films, it has been offering them all. ‘Bangarraju’, the Sankranthi blockbuster, is the latest film set to be premiered on ZEE5 from February 18 onwards. ‘Bangarraju’, starring ‘King’ Akkineni Nagarjuna…
విశ్వక్ సేన్ ‘ఓరి దేవుడా..’ నుంచి లిరికల్ సాంగ్ ‘పాఠశాలలో..’ విడుదల
వైవిధ్యమైన పాత్రలు, చిత్రాలతో తనదైన గుర్తింపు సంపాదించుకున్న యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ విశ్వక్ సేన్ కథానాయకుడిగా, మిథిలా పాల్కర్, ఆశా భట్ హీరోయిన్స్‌గా నటిస్తోన్న న్యూ ఏజ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘ఓరి దేవుడా’. ఒకవైపు కంటెంట్ బావుంటే మినిమం బడ్జెట్ చిత్రాలనైనా, బలుపు వంటి భారీ కమర్షియల్ చిత్రాలనైనా, ఊపిరి వంటి ఎమోషనల్ ఎంటర్‌టైనర్స్ అయినా, మహర్షి వంటి మెసేజ్ ఓరియెంటెడ్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ చిత్రాలనైనా నిర్మిస్తూ టాలీవుడ్‌లో బడా నిర్మాణ సంస్థగా ఇమేజ్ సంపాదించుకున్న పి.వి.పి సినిమా బ్యానర్ నిర్మాణంలో అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో ‘ఓరిదేవుడా’ చిత్రం తెరకెక్కుతోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. సోమవారం ‘ఓరి దేవుడా’ చిత్రం నుంచి ‘పాఠశాలలో పాత బడదురా…’ అనే లిరికల్ సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. చిన్ననాటి…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ‘గని’ పాటకు అనూహ్య స్పందన
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తున్న సినిమా ‘గని’. అల్లు బాబీ కంపెనీ, Renaissance పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పకుడిగా ఉన్నారు. ఈ సినిమాలోని పాటలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. తాజాగా ఈ సినిమాలోని మూడో పాట విడుదలైంది. దీనికి అనూహ్య స్పందన వస్తోంది. విజయవాడ KL యూనివర్సిటీలో ఈ పాటను విడుదల చేశారు దర్శక నిర్మాతలు. ఈ కార్యక్రమానికి దర్శకుడు కిరణ్ కొర్రపాటి, నిర్మాత అల్లు బాబీ, సంగీత దర్శకుడు తమన్ మిగిలిన చిత్ర యూనిట్ హాజరయ్యారు. అక్కడ కాలేజీ అమ్మాయిల చేతుల మీదుగా విడుదలైన ఈ పాటకు అద్భుతమైన స్పందన వస్తుంది. లెజెండరీ దర్శకుడు శంకర్ కూతురు అతిథి శంకర్ ఈ పాట పాడారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్…
రక్షిత్ అట్లూరి, కోమలీ ప్రసాద్ జంటగా అహితేజ బెల్లంకొండ నిర్మిస్తున్న ‘శశివదనే’ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి
రక్షిత్ అట్లూరి, కోమలీ ప్రసాద్ జంటగా గౌరీ నాయుడు సమర్పణలో ఎస్వీఎస్ కన్‌స్ట్రక్షన్స్ ప్రై.లి. భాగస్వామ్యంతో ఏజీ ఫిల్మ్ కంపెనీ పతాకంపై అహితేజ బెల్లంకొండ నిర్మిస్తున్న చిత్రం ‘శశివదనే’. సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వం వహించారు. సంగీత దర్శకుడు – నటుడు రఘు కుంచె, తమిళ నటుడు శ్రీమాన్, కన్నడ నటుడు దీపక్ ప్రిన్స్, ‘రంగస్థలం’ మహేష్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా తొలి షెడ్యూల్ పూర్తయింది. త్వరలో రెండో షెడ్యూల్ స్టార్ట్ కానుంది. నిర్మాత అహితేజ బెల్లంకొండ మాట్లాడుతూ “ఇప్పటివరకూ 30 శాతం చిత్రీకరణ పూర్తయింది. అందులో రెండు మాంటేజ్ సాంగ్స్ కూడా ఉన్నాయి. ఈ షెడ్యూల్‌లో హీరో హీరోయిన్ల మీద ప్రేమ, వినోదాత్మక సన్నివేశాలు తీశాం. త్వరలో ప్రారంభం కానున్న రెండో షెడ్యూల్‌లో రఘు కుంచె గారు, శ్రీమాన్ గారు, ‘రంగస్థలం’…
ఫిబ్రవరి 11న ప్రపంచవ్యాప్తంగా నాలుగు భాషల్లో విడుదల కానున్న `మూన్ ఫాల్`
హాలీ బెర్రీ, పాట్రిక్ విల్సన్, జాన్ బ్రాడ్లీ, మైఖేల్ పెనా ప్రముఖ తారాగణంతో రూపొందిన `మూన్ ఫాల్` సినిమా ఫిబ్రవరి 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలకాబోతుంది. దర్శకుడు రోలాండ్ ఎమ్మెరిచ్ సైన్స్ ఫిక్షన్ సినిమాలను తెరకెక్కిచడంలో దిట్ట. ‘2012’ , ది డే ఆఫ్టర్ టుమారో, ది పేట్రియాట్, మిడ్‌వే వంటి భిన్నమైన చారిత్రక ఇతిహాసాలు చిత్రాలను రూపొందించారు. అతని స్క్రిప్ట్‌లు శక్తివంతమైన భావోద్వేగాలతో కూడిన అద్భుతమైన థీమ్‌లను కలిగి ఉంటాయి. తాజాగా రూపొందిన మూన్ ఫాల్ ప్రేక్షకులను కనువిందు చేయనుంది. $146 మిలియన్ల అంచనా బడ్జెట్‌తో మాంట్రియల్‌లో చిత్రీకరించబడింది. ఫిబ్రవరి 11, 2022న ఇంగ్లీష్, తమిళం, తెలుగు, హిందీ భాషల్లో విడుదకాబోతోంది. కథాపరంగా చెప్పాంటే, ఒక రహస్యమైన శక్తి చంద్రుడిని దాని కక్ష్య నుండి పడవేస్తుంది. దానిని భూమిపై ఒకదానిపైకి విసిరింది భూమితో పాటు మానవుల జీవితంతో…
ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే రోజు ‘రాధే శ్యామ్’ పార్టీ
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘రాధే శ్యామ్’ విడుదల తేదీ సమీపిస్తున్న కొద్దీ కొత్తగా ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పుడు తాజాగా వాలెంటైన్ వీక్ రావడంతో సినిమా ప్రమోషన్ మరింత ఆసక్తికరంగా చేయబోతున్నారట. సౌత్ ఇండస్ట్రీలోనే మొదటి సారిగా ఈ సినిమా కోసం థీమ్ పార్టీ చేయబోతున్నారని సమాచారం. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ క్యూట్ లవ్ స్టోరీపై అంచనాలు భారీగా ఉన్నాయి. వాటిని ఇంకా పెంచేస్తూ కొత్త పార్టీ ఏర్పాటు చేయబోతున్నారు‘రాధే శ్యామ్’ చిత్ర యూనిట్. ఫిబ్రవరి 14 రాత్రి 8 గంటల నుంచి హైదరాబాద్ కెమిస్ట్రీ క్లబ్బులో ఈ పార్టీ మొదలు కానుంది. దీనికోసం ప్రత్యేకంగా సెట్ కూడా వేస్తున్నారు. ఈ థీమ్ పార్టీకి యూనిట్ అంతా హాజరు కానున్నారు. విధికి, విధిరాతకు మధ్య జరిగే…
పూరీ ‘జన గణ మన’లో హీరో ఎవరో తెలుసా?!
టాలీవుడ్ లో ఎంత పెద్ద దర్శకుడు అయినా కూడా తన కెరీర్‌లో ఓ కలల ప్రాజెక్ట్ అయితే తప్పకుండా ఉండి ఉంటుంది. అలాగే సెన్సేషనల్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కు కూడా ఓ డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంది. అదే ‘జన గణ మన’. పూరీకి ఎప్పట్నుంచో కోరిక ఈ ప్రాజెక్ట్ చేయాలని. ఈ సినిమాతో దేశానికి ఏదో చెప్పాలని ఎన్నో సంత్సరాలుగా ప్రయత్నిస్తున్నాడు. మూడేళ్ల క్రితం ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు పూరీ జగన్నాథ్. ఈ సినిమాతో ఈయన కోసం మళ్లీ స్టార్ హీరోలు వేచి చూస్తారేమో అనుకున్నారు కానీ అలాంటిదేం జరగలేదు. రామ్ హీరోగా నటించిన ‘ఇస్మార్ట్ శంకర్’ గొప్ప కథేం కాదు.. మామూలు రెగ్యులర్ మాస్ మసాలా సినిమా అంతే. అది విడుదలైన టైమ్‌లో సినిమాలేం లేవు కాబట్టి బ్లాక్ బస్టర్…
