అక్కినేని నాగ చైతన్య తన కొత్త ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. ఈ చిత్రానికి NC22 అని వర్కింగ్ టైటిల్ పెట్టారు. NC22 చైతన్య తొలి తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం. క్రియేటివ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో నాగ చైతన్యకు జోడీగా కృతి శెట్టి నటిస్తోంది. దర్శకుడు వెంకట్ ప్రభుకి ఇది తొలి తెలుగు చిత్రం. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దిగ్గజ సంగీత దర్శకులైన తండ్రీ కొడుకులు ఇసైజ్ఞాని ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతం అందించడం మరో విశేషం. వారిద్దరూ కలసి చేస్తున్న మొదటి సినిమా కావడంతో ఈ కాంబినేషన్‌లో చార్ట్‌బస్టర్ ఆల్బమ్ ఖాయమని చెప్పాలి. నాగచైనత్య కెరీర్‌లో అత్యంత భారీ చిత్రాల్లో NC22 ఒకటి. ఈ సినిమా…
Category: FILM NEWS
ప్రారంభమైన ధనుష్, సందీప్ కిషన్ ‘కెప్టెన్ మిల్లర్`
జాతీయ అవార్డ్ విన్నింగ్ సూపర్ స్టార్ ధనుష్ హీరోగా అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హై బడ్జెట్ పీరియడ్ ఫిల్మ్ ‘కెప్టెన్ మిల్లర్’ పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా గురువారంనాడు చెన్నైలో ప్రారంభమయింది. ముఖ్యమైన పాత్రలో నటిస్తున్న వెర్సటైల్ నటుడు సందీప్ కిషన్, ధనుష్ సరసన నటించనున్న బ్యూటీఫుల్ నాయిక ప్రియాంక మోహన్ కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. ఇప్పటికే కెప్టెన్ మిల్లర్ తన అద్భుతమైన ఫస్ట్-లుక్ మోషన్ పోస్టర్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రారంభానికి ముందు నుంచి వస్తున్న అప్‌డేట్‌తో టీమ్ భారీ అంచనాలను నెలకొల్పింది. ఈ చిత్రంలో పలువురు ప్రముఖ నటీనటులు కూడా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ అద్భుతమైన స్టార్ కాస్ట్ కాంబినేషన్‌తో, ‘కెప్టెన్ మిల్లర్’ తెలుగు ప్రేక్షకుల అంచనాలకు దగ్గరయ్యేలా ఉంటుంది. ధనుష్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రం…
‘మరో మహా భారతం’లో శియాగౌతమ్!
కెఎల్ఎన్ క్రియేషన్స్ క్రియేటివ్ క్యారెక్టర్స్ సమర్పణలో ప్రొడక్షన్ నెంబర్ 1 గా తెరకెక్కుతున్న సినిమాలో ‘నేనింతే’ సినిమా హీరోయిన్ శియా గౌతమ్ హీరోయిన్ గా నటించబోతోంది. ఈ సినిమాకు ‘మరో మహా భారతం’ టైటిల్ ను ఖరారు చేశారు. లేడీ ఓరియంటెడ్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం దసరా రోజున పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది. జగదీష్ దూగాన దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ చిత్రానికి లక్ష్మీ నారాయణ కిల్లి, రామకృష్ణ నిర్మిస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నవంబర్ మొదటివారం నుండి ప్రారంభం కానుంది. అక్టోబర్ 5న ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల కానుంది.
సరికొత్త హంగులతో మళ్లీ ‘చెన్నకేశవరెడ్డి’ : రీరిలీజ్ రెవెన్యూలో 75 శాతం బసవతారకం ట్రస్ట్ కి ఇస్తాం : నిర్మాత బెల్లంకొండ సురేష్
గాడ్ ఆఫ్ మాసస్ నటసింహ నందమూరి బాలకృష్ణ ‘చెన్నకేశవ రెడ్డి’ థియేటర్స్ లో మాస్ జాతర సృష్టించింది. బ్లాక్ బస్టర్ దర్శకుడు వివి.వినాయక్ దర్శకత్వంలో సెప్టెంబర్ 25, 2002లో విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసింది. ‘చెన్నకేశవ రెడ్డి’ మాస్ జాతర ఖండాంతరాలు దాటి 20 ఏళ్ళు గడుస్తున్నప్పటికీ ఏ మాత్రం క్రేజ్ తగ్గని ఈ చిత్రాన్ని ఇప్పుడు సరికొత్త హంగులతో రీరిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు నిర్మాత బెల్లం కొండ సురేష్. ఈ నేపధ్యంలో దర్శకుడు వివి.వినాయక్ తో కలసి విలేఖరుల సమవేశం నిర్వహించి రీరిలీజ్ విశేషాలని పంచుకున్నారు. నిర్మాత బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ.. ‘చెన్నకేశవ రెడ్డి’ని భారీగా రీరిలీజ్ చేయడం చాలా ఆనందంగా వుంది. ఇరవైఏళ్ల కిందట ఎంత హైబడ్జెట్ తో, క్రేజీగా ఈ సినిమా నిర్మించామో, అంతే…
చిరంజీవి-సల్మాన్ ఖాన్ ‘గాడ్ ఫాదర్’ ఫస్ట్ సింగిల్ థార్ మార్ పాట విడుదల
ఇద్దరు మెగాస్టార్లు చిరంజీవి, సల్మాన్ ఖాన్ కలసి మెగా మాస్ జాతర సృష్టించిన గాడ్ ఫాదర్ ‘థార్ మార్’ సాంగ్ ప్రోమో మెగా డ్యాన్స్ నంబర్‌పై భారీ అంచనాలను నెలకొల్పింది. ఇద్దరు మెగాస్టార్‌లు తమదైన స్టైల్‌తో డ్యాన్స్ ఫ్లోర్‌ను షేక్ చేయడం అభిమానులకు కన్నుల పండగలా మారింది. అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న థార్ మార్ పూర్తి పాట తెలుగు, హిందీ భాషల్లో తాజాగా విడుదలైయింది. ఈ పాట నిజంగా చిరంజీవి, సల్మాన్ ఖాన్ స్టార్‌డమ్‌ను గ్లోరిఫై చేయడంతో పాటు చూడటానికి విజువల్ ట్రీట్‌గా వుంది. ఈ మెగా మాస్ ఫీస్ట్ లో చిరంజీవి, సల్మాన్ ఖాన్ మాస్ హుక్ స్టెప్ వేయడం ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తోంది. ఈ పాటకు తమన్ స్కోర్ చేసిన ఫంకీ బీట్ మళ్ళీమళ్ళీ వినాలనిపించే మెగా డ్యాన్స్ నెంబర్ గా ఆకట్టుకుంది.…
‘ఆర్ఆర్ఆర్’ని జ్యూరీకి పంపకపోవడం ఆశ్చర్యానికి గురి చేసింది : దర్శకులు ఎన్. శంకర్
”ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జ్యూరీ గుజరాతీ చిత్రం ‘ఛల్లో షో’ని ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో ఆస్కార్ కి నామినేట్ చేసిందని విన్న తర్వాత ‘ఛల్లో షో’ టీజర్ చూడటం జరిగింది. అలాంటి కంటెంట్ చిత్రాలు సౌత్ లో చాలా వచ్చాయి. నేను కూడా ఇండియన్ ఆస్కార్ నామినేట్ కమిటీకి జ్యూరీ సభ్యునిగా, నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ కమిటీకి వైస్ చైర్మన్ గా, గోవా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్ కమిటీకి జ్యూరీ మెంబర్ గా పని చేశాను. ఆరుసార్లు ఉమ్మడి రాష్ట్రంలో జ్యూరీ మెంబర్ గా, ఉమ్మడి రాష్ట్రంలో నంది అవార్డ్స్ కమిటీ చైర్మెన్ గా పని చేసిన అనుభవంతో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాని జ్యూరీకి పంపకపోవడం ఆశ్చర్యానికి గురి చేసింది. ‘ఆర్ఆర్ఆర్’లో దేశభక్తితో పాటు గొప్ప నిర్మాణ విలువలు, ఇండియన్ సినిమా ప్రతిష్టను కాపాడటానికి…
Hero Eeswar’s second film ‘Suryapet Junction’ completes shoot!
Hero Eeswar was seen in the film ‘Kotthaga Maa Prayanam’, his debut movie, which attracted the young audience. His second film is titled ‘Suryapet Junction’ and has Naina Sarvar as the heroine. The mass youthful entertainer, directed by nadendla Rajesh, has completed its shoot. Yoga Lakshmi Art Creations’ Anil Kumar Katragadda, NS Rao and Vishnu Vardhan are jointly producing the movie. Roshan Saluri and Hari Gowra are setting the songs to tune. Suryapet Hyderabad and Narsapur are where the film was shot extensively. Currently, post-production works are on. Hero Eeswar…
హీరో ఈశ్వర్ రెండో చిత్రం ‘సూర్యాపేట్ జంక్షన్’ షూటింగ్ పూర్తి !!!
యూత్ ని విశేషంగా ఆకట్టుకున్న “కొత్తగా మా ప్రయాణం” ఫేమ్ ఈశ్వర్ హీరోగా, నైనా సర్వర్ హీరోయిన్, గా కథనం ఫేమ్ నాదెండ్ల రాజేష్ దర్శకత్వంలో రూపొందుతోన్న మాస్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ “సూర్యాపేట జంక్షన్”. ఈ చిత్రాన్ని యోగా లక్ష్మి ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై అనిల్ కుమార్ కాట్రగడ్డ , ఎన్.ఎస్ రావు, విష్ణువర్ధన్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మాస్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ “సూర్యాపేట జంక్షన్” మూవీకి రాజీవ్ సాలూరు, గౌర హరిలు మ్యూజిక్ అందిస్తున్నారు ఈ చిత్రం హైదరాబాద్ సూర్యపేట, నర్సాపూర్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్, జరుపుకుంటుంది. ఈ సందర్బంగా చిత్ర హీరో ఈశ్వర్ మాట్లాడుతూ.. నేను చేసిన “కొత్తగా మా ప్రయాణం” చిత్రం సక్సెస్ అవ్వడంతో టాలీవుడ్ లో నేను…
రజనీని గుర్తు చేసేలా లారెన్స్ పిక్స్ వైరల్!
కరోనా ఎఫెక్ట్ తో కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు హీరో రాఘవ లారెన్స్. దాదాపు మూడేళ్లుగా ఆయన సిల్వర్ స్క్రీన్ మీద కనిపించలేదు. ఇక ఆయన త్వరలో రుద్రుడు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తమిళంలో రుద్రన్ పేరుతో రూపొందుతున్న ఈ సినిమాను తెలుగులో రుద్రుడు పేరుతో రిలీజ్ చేస్తున్నాడు. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమాకు కతిరేసన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఫైవ్ స్టార్ క్రియేషన్స్ ఎల్‌ఎల్‌పి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా కతిరేశన్ సమర్పిస్తున్నారు. 2022 క్రిస్మస్ కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు గతంలో వెల్లడించిన నిర్మాతలు 23న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. శరత్ కుమార్, పూర్ణిమ భాగ్యరాజ్, నాజర్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ మూవీకి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమాలో లారెన్స్ సరసన…
సెప్టెంబర్ 23న రవితేజ ‘ధమాకా’ నుండి మాస్ రాజా లిరికల్ వీడియో విడుదల
మాస్ మహారాజా రవితేజ ‘ధమాకా’ మేకర్స్ చార్ట్‌బస్టర్ ‘జింతాక్’తో గ్రాండ్ మ్యూజిక్ ప్రమోషన్‌లను ప్రారంభించారు. ఇప్పుడు సెకండ్ సింగిల్ మాస్ రాజా విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ పాట సినిమా ఇంట్రడక్షన్ సాంగ్ అని టైటిల్ సూచిస్తోంది. మాస్ రాజా సాంగ్‌లో మాస్ మహారాజా మాస్ డ్యాన్స్‌లను చూడటానికి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాంగ్ అనౌన్స్ మెంట్ పోస్టర్‌లో రవితేజ ఊర మాస్‌గా కనిపిస్తున్నారు. తన గ్రేస్ ఫుల్ మూమెంట్స్ తో ఆదరగొట్టడానికి రెడీ అయ్యారు. త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. పూర్తిస్థాయి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని టిజి విశ్వ ప్రసాద్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో టాలీవుడ్ ఫేవరేట్ హీరోయిన్ శ్రీలీల, రవితేజకి జోడిగా సందడి చేయనుంది. ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల…
