స్టార్ హీరో కార్తి నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘అన్నగారు వస్తారు’ ఈ నెల 12న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ చిత్రాన్ని ప్రెస్టీజియస్ ప్రొడక్షన్ హౌస్ స్టూడియో గ్రీన్ బ్యానర్ లో కె.ఇ. జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. యాక్షన్ కామెడీ కథతో దర్శకుడు నలన్ కుమారస్వామి రూపొందిస్తున్నారు. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సందర్బంగా ‘అన్నగారు వస్తారు’ గురించి హీరో కార్తి ఇంటర్వ్యూలో చెప్పిన విశేషాలు ఆయన మాటల్లోనే… – నేను ఈ సినిమాలో నటించేందుకు కారణం డైరెక్టర్ నలన్ కుమారస్వామి. ఆయన సూదు కవ్వమ్ సినిమాకు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా వచ్చిన డైరెక్టర్స్ అంతా ఆ మూవీ గురించి చెప్పారు. అలాంటి డైరెక్టర్…
Category: FILM NEWS
‘నడికట్టు’ ట్రైలర్ విడుదల
ధనుష్ దేవర పొలి, భానుచందర్, శ్వేత, సత్యప్రియ తదితరులు ప్రధాన పాత్రధారులుగా సహస్ర శ్రీ క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్.వి.దిలీప్ కుమార్ దర్శకత్వంలో నిర్మాత మంచూరి సోమశేఖర్ రావు నిర్మిస్తున్న చిత్రం ‘నడికట్టు’ ట్రైలర్ విడుదల యింది. నటుడు రాజారవీంద్ర ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ప్రేక్షకులను ఓ మంచి సినిమాను అందిస్తున్న యూనిట్ కు శుభాకాంక్షలు. సినిమా మంచి విజయాన్ని అందుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రంలో పాల్గొన్న టీఎఫ్ సీసీ ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ ‘నడికట్టు’ ట్రైలర్ బాగుందని ప్రశంసించారు. నిర్మాత మంచూరి సోమశేఖర్ రావు మాట్లాడుతూ.. వేదికను అలంకరించిన పెద్దలకు, విచ్చేసిన అతిథులకు నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు మంచూరి సోమశేఖర్ రావు. సినీరంగంపై ఉన్న ఆసక్తి, అభిమానం నన్ను ‘సహస్ర శ్రీ క్రియేషన్స్’ అనే…
‘అఖండ-2’కు లైన్ క్లియర్ : 12న రిలీజ్.. 11న గ్రాండ్ ప్రీమియర్స్
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీనుల మోస్ట్ ఎవైటెడ్ మాస్, డివైన్ ఎంటర్టైనర్ అఖండ 2: ది తాండవం అన్ని సమస్యలను పరిష్కరించుకుంది. ‘అఖండ 2’ విడుదలకు మద్రాస్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ చిత్రం ఇప్పుడు డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. డిసెంబర్ 11 న గ్రాండ్ ప్రీమియర్స్ .14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించారు. ఎం తేజస్విని నందమూరి సమర్పణలో వస్తున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులకు గొప్ప థియేటర్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబో సింహా, లెజెండ్, అఖండతో హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్లను అందించింది. వారి నాల్గవ కొలాబరేషన్ వస్తున్న సినిమా కావడం, ముఖ్యంగా బాలకృష్ణ వరుసగా నాలుగు హిట్లను…
‘నరసింహ’కు సీక్వెల్ గా ‘నీలాంబరి’
రజనీకాంత్ హీరోగా 1999లో విడుదలైన ‘నరసింహ’ చిత్రం ఓ మైల్ స్టోన్ అని చెప్పొచ్చు. ఆయన అందుకున్న బ్లాక్‌బస్టర్ చిత్రాల్లో ఒకటి. కె.ఎస్ రవికుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రజనీకాంత్ టైటిల్ పాత్ర పోషించగా ఆయనకు భార్యగా వసుంధర పాత్రలో సౌందర్య నటించారు. నీలాంబరిగా రమ్యకృష్ణ నటించి సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సినిమా విడుదలై 26 ఏళ్లు అవుతున్నా ఈ పాత్ర ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ రానుంది. డిసెంబర్ 12న సూపర్‌స్టార్ రజనీకాంత్ 75 ఏళ్లు పూర్తి చేసుకోనున్నారు. ఈ సందర్భంగా ‘నరసింహ’ను రీరిలీజ్ చేయనున్నారు. ఈ రీరిలీజ్ ప్రచారంలో భాగంగా రజనీ ప్రత్యేక వీడియో షేర్ చేశారు. అందులో రజనీకాంత్ సీక్వెల్‌ను అధికారికంగా ప్రకటించారు. ‘ఆడవాళ్లందరూ గేట్లు బద్దలు కొట్టి థియేటర్లలోకి వచ్చిన…
‘అఖండ-2’కు లైన్ క్లియర్
బాలకృష్ణ హీరోగా నటించిన ‘అఖండ 2’ విడుదలకు మద్రాస్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఈ నెల 12న సినిమాను రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. దీనిపై ఏ క్షణమైనా ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ప్రీమియర్స్, టికెట్ రేట్ల పెంపు కోసం నిర్మాణ సంస్థ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను సంప్రదించినట్లు తెలుస్తోంది. కాగా ఈ నెల 5న రిలీజ్ కావాల్సిన అఖండ-2 వాయిదా పడిన విషయం తెలిసిందే. ‘అఖండ 2 తాండవం’ విడుదల వాయిదా పడ్డాక కొత్త డేట్ కోసం అభిమానుల నుంచి ఒత్తిడి ఎక్కువయింది. నందమూరి ఫ్యాన్స్ థియేటర్ల దగ్గర డిసెంబర్ 5 చేసిన అలంకరణ, బ్యానర్లు, లైటింగ్ అంతా అలాగే ఉంచేశారు. వేరే సినిమాలు ఆడుతున్నా సరే డెకరేషన్ తీసేయొద్దని ఓనర్లను రిక్వెస్ట్ చేసుకున్నారు. తక్కువ గ్యాప్ లో వస్తుందనే…
రికవరీ అవుతున్న హీరో రాజశేఖర్
యాంగ్రీ స్టార్ రాజశేఖర్ కొంత విరామం తర్వాత వరుస సినిమాలకు సంతకాలు చేశారు. ఓ వైపు కథానాయకుడిగా నటిస్తూ, మరో వైపు ప్రధాన పాత్రలు చేస్తున్నారు. నవంబర్ 25న కొత్త సినిమా చిత్రీకరణలో ఆయనకు గాయాలు అయ్యాయి. మేడ్చల్ సమీపంలో యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ చేస్తుండగా రాజశేఖర్ కుడి కాలికి బలమైన గాయాలు అయ్యాయి. మడమ దగ్గర పెద్ద ఇంజ్యూరీ అయినట్టు తెలిసింది. గాయమైన వెంటనే హుటాహుటిన యూనిట్ సభ్యులు ఆస్పత్రికి తీసుకు వెళ్లారు. వైద్యులు వెంటనే సర్జరీ చేశారు. సుమారు మూడు గంటల పాటు సర్జరీ జరిగింది. బలమైన గాయం కావడంతో బోన్ బయటకు వచ్చిందని, అందువల్ల సర్జరీకి మూడు గంటలు పట్టిందని సమాచారం. సర్జరీలో భాగంగా రాజశేఖర్ కాలిలో ప్లేట్స్ వైర్ అమర్చారు. దీని వల్ల త్వరగా రికవరీ అవుతారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. నొప్పి భరిస్తూ రాజశేఖర్ సర్జరీ…
‘త్రీ రోజెస్’ సీజన్ 2కు వర్క్ చేయడాన్ని ఎంతగానో ఎంజాయ్ చేశాం : ఈషా రెబ్బా, హర్ష చెముడు
ఈషా రెబ్బా, సత్య, హర్ష చెముడు, ప్రిన్స్ సిసిల్, హేమ, సత్యం రాజేశ్, కుషిత కల్లపు ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ ‘త్రీ రోజెస్’. ఆహా ఓటీటీలో సూపర్ హిట్టయిన ఈ సిరీస్ సీజన్ 2 ఈ నెల 12వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది. రాశీ సింగ్ మరో కీ రోల్ చేసింది. ఈ సిరీస్ ను మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎస్ కేఎన్ నిర్మిస్తున్నారు. డైరెక్టర్ మారుతి షో రన్నర్ గా వ్యవహరిస్తున్నారు. రవి నంబూరి, సందీప్ బొల్ల రచన చేయగా..కిరణ్ కె కరవల్ల దర్శకత్వం వహించారు. మంగళవారం జరిగిన ఇంటర్వ్యూలో ‘త్రీ రోజెస్’ సీజన్ 2 హైలైట్స్ తెలిపారు హీరోయిన్ ఈషా రెబ్బా, యాక్టర్ హర్ష చెముడు. హీరోయిన్ ఈషా రెబ్బా మాట్లాడుతూ… “త్రీ రోజెస్”…
స్మార్ట్‌ఫోన్ ప్రేక్షకుల కోసం ‘చాయ్ షాట్స్’ ప్రారంభం
తెలుగు డిజిటల్ ఎంటర్ టైన్ మెంట్ కు పదేళ్లుగా కొత్త దారులు చూపిస్తున్న చాయ్ బిస్కెట్, దేశంలోని తొలి రీజినల్ షార్ట్ సిరీస్ ఓటీటీ ప్లాట్‌ఫారం ‘చాయ్ షాట్స్’ ను గ్రాండ్ గా లాంచ్ చేసింది. స్మార్ట్‌ఫోన్ ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ‘థర్డ్ స్క్రీన్ ప్లాట్‌ఫార్మ్’ లో 2 నిమిషాలకు లోపు ఉండే ప్రీమియం, వెర్టికల్, స్క్రిప్టెడ్ ఎపిసోడ్లు ఉంటాయి. ‘చాయ్ షాట్స్’ యాప్ లాంచ్ ఈవెంట్ లో హీరో, ప్రొడ్యూసర్ రానా దగ్గుపాటి మాట్లాడుతూ.. ఓటిటిలు లేనప్పుడు, అమితాబచ్చన్ గారు తప్పితే మిగతా స్టార్స్ ఎవరూ కూడా టీవీలోకి రానప్పుడు, తెలుగు వాళ్లకి థియేటర్ తర్వాత జెమినీ టీవీ ఒక్కటే ఉన్నప్పుడు.. ఆ సమయంలో శరత్ అనురాగ్ ని నేను కలిశాను. వీళ్లకున్న కల్చర్, ఆటిట్యూడ్, క్రియేటివ్ పర్స్పెక్టివ్ అద్భుతం. మేము కలిసి టీవీ…
గుర్రం పాపిరెడ్డి: డార్క్ కామెడీ థ్రిల్లర్
నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న చిత్రం’గుర్రం పాపిరెడ్డి’. ఈ చిత్రాన్ని డా. సంధ్య గోలీ సమర్పణలో ప్రొడ్యూసర్స్ వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్ (బాబీ) నిర్మిస్తున్నారు. డార్క్ కామెడీ కథతో ఇప్పటి వరకు మనం తెరపై చూడని కాన్సెప్ట్‌తో దర్శకుడు మురళీ మనోహర్ తెరకెక్కించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 19న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ సందర్బంగా ‘గుర్రం పాపిరెడ్డి’ సినిమా నుంచి ‘పైసా డుమ్ డుమ్’ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో నటుడు జీవన్ కుమార్ మాట్లాడుతూ..నా కెరీర్ లో డిఫరెంట్ రోల్స్ చేస్తూ వస్తున్నాను. ఈ సినిమాలో కీ రోల్ చేశాను. డైరెక్టర్ గారు ‘గుర్రం పాపిరెడ్డి’ కథ చెప్పినప్పుడు ఇది నా కెరీర్…
Minister Duddilla Sridhar Babu clap With ‘My Love’ begins
Sanjosh Thagaram and Harshita are the hero and heroines of the new film ‘My Love’ being made under the banner of Josh International Film Production. IT & Industries Minister Duddilla Sridhar Babu clapped for the film, while Jubilee Hills MLA Naveen Yadav switched on the camera and directed the first short. On this occasion, hero & director Sanjosh Thagaram spoke .. This is a film with good universal content Movie . Movie This content will be completely new. It has taken a point that no one has touched so far…
