అంధ విద్యార్థుల మధ్య మురళీమోహన్ 61వ వివాహ వార్షికోత్సవం

Muralimohan's 61st Wedding Anniversary Celebrated Among Visually Impaired Students

ప్రముఖ నటులు , నిర్మాత మురళీమోహన్ తన 61 వ వివాహ వార్షికోత్సవాన్ని హైదరాబాద్ బేగంపేటలోని “దేవనార్ బ్లైండ్ స్కూల్ “లో అంద విద్యార్థుల మధ్య జరుపుకున్నారు. తన మరియు తన కుటుంబ సభ్యుల జన్మదిన వేడుకలను లేదా వివాహ వార్షికోత్సవాలను దేవనార్ బ్లైండ్ స్కూల్లో అంధ విద్యార్థుల మధ్య జరుపుకునే ఆనవాయితీని ప్రతి సంవత్సరము పాటిస్తుంటారు మురళీమోహన్. ఈ ఆనవాయితీని కొనసాగిస్తూ ఈ రోజు దేవనార్ బ్లైండ్ స్కూల్లోని అంధ విద్యార్థుల సమక్షంలో తన 61వ వివాహ దిన మహోత్సవాన్ని జరుపుకున్నారు మురళీమోహన్. ఈ సందర్భంగా స్కూలులో జరిగిన సభా కార్యక్రమంలో మురళీమోహన్ తో పాటు ప్రముఖ గాయకుడు – సంగీత దర్శకుడు – భగవద్గీత ఫౌండేషన్ చైర్మన్ గంగాధర శాస్త్రి, దేవనార్ బ్లైండ్ స్కూల్ చైర్మన్ సాయిబాబా గౌడ్, ఆయన సతీమణి జ్యోతి గౌడ్,…

జూలై లో విడుదలకు సిద్ధమైన ‘వెంకట్రామయ్య గారి తాలూకా’

'Venkatramayya Gari Taluka' set for release in July.

దినేష్ కుమార్ హీరోగా, దివిజ ప్రభాకర్ (ఈటీవీ ప్రభాకర్ కుమార్తె) హీరోయిన్‌గా మురళీధర్ గౌడ్, సుధ టైటిల్ పాత్రలలో సతీష్ ఆవాల దర్శకత్వం లో కోమలి క్రియేషన్స్ బ్యానర్‌పై కోమలి మహేందర్ తొట్టె, సోమేష్ సారిపల్లి నిర్మించిన చిత్రం “వెంకట్రామయ్య గారి తాలూకా”. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని జూలై లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్బంగా చిత్ర నిర్మాత కోమలి మాట్లాడుతూ…నేను కోమలి.. ఫోక్ సింగర్ గా నా కంటూ ఒక గుర్తింపు తెచ్చుకుని సినిమా రంగం మీద ఇష్టంతో నేను సినిమా తీయాలన్న ధ్యేయయ్మతో చాలా ఒడుదుడుకులని ఎదుర్కొని “వెంకట్రామయ్య గారి తాలూకా” చిత్రాన్ని పూర్తి చేసాము. ఈ సినిమా మొదలయినప్పటి నుండి ఇప్పటివరకు నేను పడిన కష్టం.. పడిన మాటలు కంటినిండా నిద్ర కూడా పట్టేది కాదు.…

రియల్ లైఫ్‌లో నేను కంప్లీట్ డిఫరెంట్‌ : ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ హీరోయిన్ రాశీసింగ్ ఇంటర్వ్యూ…

"I am completely different in real life": Interview with 'Transfer Trimurtulu' heroine Raashi Singh...

వడ్డే జిష్ణు సమర్ఫణలో వడ్డే క్రియేషన్స్ బ్యానర్ మీద వడ్డే నవీన్ హీరోగా, నిర్మాతగా చేసిన చిత్రం ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’. ఈ సినిమాతో కమల్ తేజ నార్ల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ సినిమాలో వడ్డే నవీన్‌కి జోడిగా రాశీ సింగ్ నటించారు. ఈ చిత్రం ఈనెల 19న రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో గురువారం హీరోయిన్ రాశీ సింగ్ మీడియాతో ముచ్చటించారు. ఆమె చెప్పిన విశేషాలివే.. ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ చిత్రంలో మీ పాత్ర ఎలా ఉండబోతోంది? -పక్కింటి అమ్మాయిలా నా పాత్ర ఉంటుంది. ఎంతో సహజంగా అనిపిస్తుంది. విత్ అవుట్ మేకప్ నటించాను. చాలా వరకు నేచురల్‌గానే కనిపిస్తాను. ఇందులో కంప్లీట్ మదర్ పాత్రలా ఉండదు. ఫ్యామిలీ చుట్టూ తిరిగే కథ ఇది. వడ్డే నవీన్ గారితో సినిమా అని తెలిశాక చాలా వరకు ఆయన గురించి…

‘గాసిప్’ నుంచి తొలి గీతం..

First song from 'Gossip'..

మోస్ట్ టాలెంటెడ్, ఎనర్జిటిక్ రాశి సింగ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నా వైభవ్ సినీ స్కల్ప్ట్ స్టూడియోస్ బ్యానర్‌పై యతి నిర్మాతగా ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం ‘గాసిప్’. నేటి తరానికి కనెక్ట్ అయ్యే ఎమోషన్స్, అందమైన ప్రేమ కథతో మేళవిస్తూ సోషల్ సెటైర్ గా డైరెక్టర్ వైభవ్ కౌండిన్య ద్వారా ఈ చిత్రం తెరకెక్కుతోంది.  ఇప్పటికే విడుదలైన సిప్పు సిప్పు సాంగ్ ప్రోమోకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు మేకర్స్ మ్యూజికల్ జర్నీ స్టార్ట్ చేస్తూ ఈ సినిమా నుంచి సిప్పు సిప్పు ఫుల్ లిరికల్ సాంగ్ ని ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదల చేశారు. శక్తి కాంత్ కార్తీక్ స్వరపరిచిన ఈ ఎనర్జెటిక్ పబ్ డాన్స్ ట్రాక్‌కు కాసర్ల శ్యామ్ అందమైన సాహిత్యాన్ని అందించగా సింగర్ మాళవిక వోకల్స్ తో పాటను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు.…

వెంకటేష్- కళ్యాణ్ రామ్ కాంబోలో అనిల్ రావిపూడి క్రేజీ కాంబినేషన్ ప్రారంభం

విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్, ‘హిట్ మెషీన్’ అనిల్ రావిపూడి కలిసి ఒక పూర్తి స్థాయి పండుగ వినోదాత్మక చిత్రం అందించడానికి సిద్ధమవుతున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్ చిత్రం 2027 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, శ్రీమతి అర్చన, జీ స్టూడియోస్ సమర్పిస్తున్నాయి. కీర్తి సురేష్, కృతి శెట్టి ఇందులో కథానాయికలుగా నటిస్తున్నారు. చిత్ర బృందం,  పలువురు ప్రముఖ అతిథుల సమక్షంలో ఘనంగా జరిగిన ముహూర్తం, పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం అధికారికంగా ప్రారంభమైంది. దిల్ రాజు, శిరీష్ స్క్రిప్ట్‌ను దర్శకుడు అనిల్ రావిపూడి,  నిర్మాత సాహు గారపాటికి అధికారికంగా అందజేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ ముహూర్తం సందర్భంగా, విక్టరీ వెంకటేష్, కళ్యాణ్ రామ్, కీర్తి సురేష్, కృతి శెట్టిలపై చిత్రీకరించిన…

‘ఆజ్ కీ రాత్’ కోసం మిల్కీ బ్యూటీ..

'Milky Beauty' for 'Aaj Ki Raat'..

సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన బ్లాక్‌బస్టర్ ‘జైలర్’ చిత్రంలో ‘కావాలయ్యా..’ సాంగ్ ప్రపంచవ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఈ పాటపై స్టెప్పులేసిన మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఇంటర్నెట్‌ను షేక్ చేసింది. సోషల్ మీడియాలో సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు ప్రతి ఒక్కరూ ఈ హుక్ స్టెప్‌పై రీల్స్ చేస్తూ ఇంటర్నెట్‌ను పరుగెత్తించారు. అయితే, తాజాగా ఈ చార్ట్‌బస్టర్ సాంగ్‌పై తమన్నా చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ‘‘కావాలయ్యా’ సాంగ్ షూటింగ్ పూర్తయ్యాక నేను కొంత అసంతృప్తికి లోనయ్యాను. ఎందుకంటే ఆ పాటలో నేను ఇంకాస్త బెటర్‌గా డ్యాన్స్ చేసి ఉండాల్సింది అని నా మనసుకు అనిపించింది” అంటూ ఆ పాటలో తన పెర్ఫామెన్స్ పట్ల తను పూర్తిగా సంతృప్తి చెందలేదని తమన్నా ఓపెన్ అయింది. ప్రముఖ బాలీవుడ్…

‘పెద్ది’ సరికొత్త రికార్డ్ !

‘Peddi’ sets a brand new record!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ ‘పెద్ది’ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద మరో భారీ మైలురాయిని అందుకుంది. 400 కోట్ల గ్రాస్ మార్క్‌ను అధిగమించి సరికొత్త రికార్డ్ సృష్టించింది. దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించిన ఈ రూరల్ స్పోర్ట్స్  యాక్షన్ డ్రామా వీకెండ్ మాత్రమే కాకుండా, వర్కింగ్ డేస్‌లో సైతం బలమైన కలెక్షన్లతో దూసుకుపోతోంది. రామ్ చరణ్ కెరీర్‌లో సోలో హీరోగా 400 కోట్ల క్లబ్‌లో చేరిన తొలి చిత్రం ‘పెద్ది’ కావడం. రెండో వారంలోనూ సినిమా అద్భుతమైన రన్ తో రామ్ చరణ్ బాక్సాఫీస్ స్టామినా ఎంత బలంగా ఉందో మరోసారి నిరూపించింది. అలాగే ప్రేక్షకులు ‘పెద్ది’ పాత్రతో ఎంత ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారో ఈ విజయం రుజువు చేసింది. వెంకట సతీష్ కిలారు భారీ నిర్మాణ విలువలతో నిర్మించిన…

పర్సంటేజ్ సబ్ కమిటీ నుంచి సురేష్ బాబు, దిల్ రాజు తప్పుకోవాలి

Suresh Babu and Dil Raju should step down from the percentage sub-committee.

-ప్రెస్ మీట్ లో నట్టికుమార్ షాకింగ్ కామెంట్స్ “థియేటర్స్ లో పర్సంటేజ్ విధానం అమలుకు నిర్మాతలు సుముఖంగానే ఉన్నారు. అయితే నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్స్ కు ఇబ్బందులు తలెత్తని రీతిలో అందరికీ ఆమోదయోగ్యమైన పర్సంటేజ్ ను నిర్ణయించాల్సిన అవసరం ఎంతైనా ఉంది” అని సీనియర్ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ నట్టి కుమార్ స్పష్టంచేశారు. మంగళవారం హైదరాబాద్ లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు. రెంటల్ విధానంలో ఒక థియేటర్ కు రూ. 7,30,000/- వస్తుందని అనుకుంటే..ఆ థియేటర్ ఓనర్ సుమారు రూ.10,00,000/- వరకు పర్సంటేజ్ విధానంలో వచ్చేవిధంగా నిర్ణయించమని అడగడంలో తప్పులేదు. అదే పాతిక లక్షలకు సమానంగా పర్సంటేజ్ ఇవ్వమని అడిగితే, అది ఎంతమాత్రం సహేతుకంగా ఉండదు. సినిమాలలో నష్టం వస్తే నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ ను ఆదుకునే వారు ఎవరూ లేరు.…

హృదయాన్ని కదిలించే కామెడీ : నెట్‌ఫ్లిక్స్‌లో ‘సూపర్ సుబ్బు’ స్ట్రీమింగ్  

Heartwarming Comedy: ‘Super Subbu’ Streaming on Netflix

సుబ్బు సార్ క్లాస్ అందరికీ స్వాగతం, ఒక అమాయకమైన ప్రశ్నతోనే మొత్తం మాకిపూర్  గ్రామంలో టాక్ అఫ్ ది టౌన్ గా మారిన ఉపాధ్యాయుడు సుబ్బు! మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన ‘సూపర్ సుబ్బు’ సిరీస్‌లో సందీప్ కిషన్, మిథిలా పాల్కర్, మురళీ శర్మ ప్రధాన పాత్రలు పోషించారు. నెట్‌ఫ్లిక్స్ తొలి తెలుగు ఒరిజినల్ సిరీస్‌గా తెరకెక్కిన ‘సూపర్ సుబ్బు’ జూలై 2 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ కథలో సుబ్రహ్మణ్యం చిల్లుకూరి రావు అలియాస్ సుబ్బు అనే యువకుడు, మాకిపూర్ అనే గ్రామంలో సెక్స్ ఎడ్యుకేషన్ ఆఫీసర్‌గా ఉద్యోగం పొందుతాడు. ఎలాంటి అనుభవం లేకపోయినా, గ్రామస్తులకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో అడుగుపెట్టిన సుబ్బు, అక్కడ అనుకోని సంఘటనలు, విచిత్రమైన ప్రశ్నలు, హాస్యభరిత పరిస్థితులు, జీవితాన్ని మార్చే అనుభవాల మధ్య చిక్కుకుంటాడు. ఈ ప్రయాణంలో ప్రేమ, కుటుంబం,…