వాలెంటైన్స్ డేకు ‘కపుల్ ఫ్రెండ్లీ’ వస్తున్నారు

'Couple Friendly' is coming for Valentine's Day

సంతోష్ శోభన్ హీరోగా నటిస్తున్న సినిమా “కపుల్ ఫ్రెండ్లీ”. ఈ చిత్రంలో మానస వారణాసి హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ గా నిర్మిస్తోంది. అజయ్ కుమార్ రాజు.పి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. మ్యూజికల్ రొమాంటిక్ లవ్ స్టోరీ మూవీ గా ‘కపుల్ ఫ్రెండ్లీ’ సినిమా తెరకెక్కుతోంది.  ‘కపుల్ ఫ్రెండ్లీ’ సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేశారు. వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. హీరో హీరోయిన్స్ సంతోష్ శోభన్, మానస వారణాసి తమ సినిమా డేట్ అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన వీడియో ఆకట్టుకుంటోంది. తెలుగు, తమిళంలో ‘కపుల్…

‘పాంచాలి పంచ భర్తృక’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్

'Panchali Pancha Bhartrika' title, first look poster

రాయల్ త్రోన్ ప్రొడక్షన్స్, ఓం సాయి రామ్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘పాంచాలి పంచ భర్తృక’. ఈ చిత్రంలో వెంకట్ దుగ్గిరెడ్డి, రాజ్ పవన్, జెమినీ సురేష్, ర్యాప్ సింగర్ రోల్ రిడా హీరోలుగా నటిస్తున్నారు. నట కిరీటి రాజేంద్రప్రసాద్, పృథ్వీరాజ్, శ్రీకాంత్ అయ్యంగార్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘పాంచాలి పంచ భర్తృక’ చిత్రాన్ని వెంకట్ దుగ్గిరెడ్డి (యూఎస్ఏ) నిర్మిస్తున్నారు. శ్రీకాంత్ శెట్టివారి, సాయినాథ్ మన్యం సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. లెస్ లాజిక్, మోర్ మ్యాజిక్ అనే క్యాప్షన్ తో ట్రెండీ కామెడీ మూవీగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు డైరెక్టర్ గంగ సప్తశిఖర. నటకిరీటి రాజేంద్రప్రసాద్ చేతుల మీదుగా ‘పాంచాలి పంచ భర్తృక’ సినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్…

పెళ్ళి వార్తలన్నీ రూమర్సే : మీనాక్షి చౌదరి

All the wedding news is just rumors: Meenakshi Chowdhury

ఈమధ్య కాలంలో హీరోయిన్ల పెళ్లి వార్తలు ఎక్కువైపోయాయి. ఈ క్రమంలోనే టాలీవుడ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి.. యంగ్ హీరోను పెళ్లి చేసుకోబోతోందంటూ సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఇక ఈ వార్తలపై ఎట్టకేలకు తన మనసులో మాట బయటపెట్టింది స్టార్ హీరోయిన్. టాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకుపోతోంది హీరోయిన్ మీనాక్షి చౌదరి. సంక్రాంతికి వస్తున్నాం.. లక్కీ భాస్కర్, గుంటూరు కారం వంటి హిట్ సినిమాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. వరుసగా సినిమాలు చేస్తూ టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైన మీనాక్షీ.. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం మీనాక్షీ చౌదరి నవీన్ పొలిశెట్టితో కలిసి నటించిన చిత్రం ‘అనగనగా ఒక రాజు’. జనవరి 14న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో మీనాక్షి ప్రమోషన్స్ కి వెళ్తుంటే.. అక్కడ పెళ్లికి సబంధించిన…

వరలక్ష్మి శరత్ కుమార్ ‘సరస్వతి’ షూటింగ్ పూర్తి

Varalakshmi Sarath Kumar's 'Saraswathy' shooting completes

వెర్సటైల్ పాత్రలతో అలరిస్తున్న వరలక్ష్మి శరత్ కుమార్  స్వీయ దర్శకత్వంలో, తన సోదరి పూజా శరత్ కుమార్ తో కలిసి దోస డైరీస్‌ బ్యానర్ పై నిర్మిస్తున్న చిత్రం’సరస్వతి’. హై-కాన్సెప్ట్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ పోస్టర్ ప్రేక్షకులలో క్యురియాసిటీ పెంచింది. తాజాగా ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకుంది. ఈ చిత్రంతో తొలిసారిగా దర్శకురాలిగా మారిన వరలక్ష్మి శరత్ కుమార్, తానే ప్రధాన పాత్రలో నటిస్తూ పక్కా ప్లానింగ్, క్లియర్ విజన్‌తో అనుకున్న సమయానికి షూటింగ్‌ను పూర్తిచేశారు. ఫైనల్ అవుట్‌పుట్ అద్భుతంగా వచ్చింది. ‘సరస్వతి’ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండబోతోంది. ఈ సందర్భంగా వరలక్ష్మి శరత్ కుమార్ మాట్లాడుతూ..  సరస్వతి చిత్ర షూటింగ్‌ను విజయవంతంగా పూర్తి చేశాం. ఈ ప్రయాణంలో…

వినోదాత్మక చిత్రాల్నే నిర్మించాలనుకుంటున్నాం : నిర్మాత అనిల్ సుంకర

We want to produce entertaining films: Producer Anil Sunkara

శర్వానంద్ హీరోగా త్వరలో రాబోతోన్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రం ‘నారీ నారీ నడుమ మురారి’. ఈ మూవీలో సంయుక్త, సాక్షి వైద్య లు హీరోయిన్లుగా నటించారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు. దర్శకుడు రామ్ అబ్బరాజు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సంక్రాంతి కానుకగా ఈ నెల 14న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. ఈ క్రమంలో నిర్మాత అనిల్ సుంకర మీడియాతో మాట్లాడుతూ చిత్ర విశేషాల్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన చెప్పిన సంగతులివే.. సంక్రాంతికి గట్టి పోటీ ఉంది కదా? ముందు నుంచే సంక్రాంతి సినిమాగానే రూపొందించారా? -సంక్రాంతికి సరిపడే మూవీగానే ‘నారీ నారీ నడుమ మురారి’ని రూపొందించాం. ఇదొక పండుగ మూవీ. సినిమాలకు సంక్రాంతి సీజన్ అనేది వర్కౌట్ అవుతుంది. మేం అనుకున్నట్టుగానే సినిమా వచ్చింది. సంక్రాంతి సీజన్‌లో…

అమ్మవారి మహిమలతో’దక్షిణ కాళీ’

'Dakshina Kali' with the glories of the Goddess

సుబ్బు, ప్రియాంక హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘దక్షిణ కాళీ’. హీరోయిన్ అర్చన అమ్మవారి పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రానికి కథను అందించి శ్రీనిధి క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు సత్యవాణి మీసాల. డివోషనల్ కథతో తెరకెక్కిస్తున్నారు దర్శకుడు తోట కృష్ణ. ఈ సినిమా త్వరలో తెలుగు, తమిళ, కన్నడలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా మూవీ టీమ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో.. దర్శకుడు తోట కృష్ణ మాట్లాడుతూ – అమ్మవారి మహిమలు తెలిపేలా దక్షిణ కాళీ చిత్రాన్ని రూపొందించాం. మా సినిమా బాగుందని మేము చెప్పడం కాదు డిస్ట్రిబ్యూటర్స్ చెప్పాలి. అందుకే డిస్ట్రిబ్యూటర్స్ కు మా మూవీ షోస్ వేస్తున్నాం. వారి నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రానికి మంచి కథను అందించి ఎక్కడా కాంప్రమైజ్…

‘మన శంకరవరప్రసాద్ గారు’ థియేట్రికల్ ట్రైలర్ విడుదల

'Mana Shankaravaraprasad Garu' theatrical trailer released

మెగాస్టార్ చిరంజీవి,  హిట్ మెషిన్ అనిల్ రావిపూడి హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ‘మన శంకర వర ప్రసాద్ గారు’ తో పండుగ ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఉత్సాహాన్ని మరింత పెంచుతూ విక్టరీ వెంకటేష్ కీలక పాత్రతో నటిస్తున్నారు. ఇది అత్యంత క్రేజీ కాంబినేషన్‌లలో ఒకటిగా నిలిచింది. సినిమా ప్రమోషన్‌లు ఇప్పటికే అద్భుతంగా జరుగుతున్నాయి. ప్రతి గ్లింప్స్, పాటలు,  పోస్టర్ అంచనాలను పెంచాయి. మేకర్స్ తిరుపతిలో సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ఒకప్పుడు దేశ భద్రతా సంస్థల్లో కీలకంగా సేవలందించిన శంకర వర ప్రసాద్, శశిరేఖను ప్రేమించి పూర్తిగా ఫ్యామిలీ లైఫ్ కి మారుతాడు. ఫ్యామిలీ మ్యాన్ గా ప్రశాంతంగా కనిపించినా, అతనిలోని వింటేజ్ ఫైర్, నేచురల్ ఇన్‌స్టింక్ట్ మాత్రం ఎక్కడా తగ్గదు. ఆనందంగా సాగుతున్న అతని జీవితంలో అకస్మాత్తుగా సమస్యలు వచ్చినప్పుడు, వాటిని శంకర వర…

నయన్​ వదులుకున్న సూపర్‌‌హిట్ మూవీస్ ఇవే…

These are the superhit movies that Nayan gave up...

వాళ్ళ చిత్రాలలో ఆమె నటనకు, స్క్రీన్ ప్రెజెన్స్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఈ సీనియర్ హీరోలందరికీ ఆమె ఒక పర్ఫెక్ట్ మ్యాచ్‌గా నిలవడానికి ముఖ్య కారణం.. పాత్రలను ఎంచుకునే విధానం, ఆమె పర్సనాలిటీ. ఆ పాత్రలకు తగ్గట్టుగా తనను తాను మేకోవర్ చేసుకుంటుంది ఈ బ్యూటీ. అందుకే ఆమె దక్షిణాదిన కదిలించలేని కోట కట్టేసుకుంది. సీనియర్ హీరోల చిత్రాలతో పాటు.. నయనతారకు మరో అరుదైన ఘనత ఉంది. తెలుగు, మలయాళం, తమిళంతోపాటు హిందీలోనూ సత్తా చాటుతూ లేడీ సూపర్​స్టార్​గా పేరు తెచ్చుకున్న నటి నయనతార. తన 20 ఏళ్ల కెరీర్‌లో 75కి పైగా చిత్రాల్లో నటించి స్టార్​ హీరోయిన్​గా విజయవంతంగా రాణిస్తుంది. ఇటీవల నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ ‘నయనతారా: బియాండ్ ది ఫెయిరీ టేల్’తో మరోసారి హైలైట్స్ అయిన ఆమె, ధనుష్‌తో కాంట్రవర్సీలో కూడా స్ట్రాంగ్‌గా…

4న ‘మన శంకర వర ప్రసాద్ గారు’ థియేట్రికల్ ట్రైలర్

Megastar Chiranjeevi, Victory Venkatesh, Anil Ravipudi’s Mana Shankara Vara Prasad Garu Theatrical Trailer Launch On January 4th

మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి హైలీ యాంటిసిపేటెడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మన శంకర వర ప్రసాద్ గారు’, విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే అద్భుతమైన ప్రమోషనల్ కంటెంట్, ఆకట్టుకునే ప్రచార కార్యక్రమాలతో భారీ సంచలనం సృష్టిస్తోంది. భీమ్స్ సిసిరోలియో అందించిన సంగీతం చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. ‘మీసాల పిల్ల’ పాట 100 మిలియన్లకు పైగా వ్యూస్ దాటగా, ‘శశిరేఖ’ పాట దాదాపు 40 మిలియన్ల వ్యూస్ తో ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. చిరంజీవి, వెంకటేష్ నటించిన  పాట ‘సంక్రాంతి అదిరిపోద్ది’ ఒక ఫెస్టివల్ సాంగ్ లా మారింది. ‘మన శంకర వర ప్రసాద్ గారు’ చిత్ర బృందం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న థియేట్రికల్ ట్రైలర్ విడుదల తేదీని ప్రకటించారు. ఈ ట్రైలర్‌ను జనవరి 4న విడుదల చేయనున్నారు. ట్రైలర్ పోస్టర్‌లో చిరంజీవి…