సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ కు మిజోరాం గవర్నర్ డా.కంభంపాటి హరిబాబు సత్కారం

General News

విశాఖపట్నం: జర్నలిజంలో అడుగుపెట్టి 25 ఏళ్ళు పూర్తి చేసుకున్న సీనియర్ జర్నలిస్ట్ నేమాల హేమసుందరరావును మిజోరాం గవర్నర్ డా.కంభంపాటి హరిబాబు అభినందించి సత్కరించారు.నెహ్రూ యువ కేంద్ర , శ్రీ గాయత్రి వెల్ఫేర్ కల్చరల్ యూత్ అకాడమీ ,రూపాకుల విశాలాక్షి చారిటబుల్ ట్రస్ట్,ప్రకృతి చికిత్సాలయం సంయుక్త ఆధ్వర్యంలో బీచ్ రోడ్డులోని ప్రకృతి చికిత్సాలయం ఆవరణలో నిర్వహించిన స్వామి వివేకానంద 159వ జయంతి,ఆజాదీ క అమృత్ మహోత్సవ్ సేవా కార్యక్రమాలకు గవర్నర్ హరిబాబు ముఖ్యఅతిథిగా విచ్చేసి స్వామి వివేకానంద చిత్రపటం ముందు జ్యోతి వెలిగించి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు. అనంతరం రాజీవగాంధీ మానవ సేవా జాతీయ అవార్డు గ్రహీత రూపాకుల రవికుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కోవిడ్ కష్టకాలంలో వైరస్ సోకిన బాధితులకు తమ ప్రాణాలు సైతం లెక్క చేయక సకాలంలో వైద్య సేవలందించిన వైద్యులకు, పోలీస్ శాఖ ,…

ఓ ఉద్విగ్న వాతావరణం..ఆత్మీయుల నులివెచ్చని స్పర్శ!

Mounasri mallik

● స్వగ్రామం వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో మౌనశ్రీ మల్లిక్ కు పౌర సన్మానం ● నేను రూ.250 ● వర్ధన్నపేట ● హైదరాబాద్ నిన్న మా స్వగ్రామం వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో జరిగిన పౌర సన్మాన కార్యక్రమంలో ఉద్విగ్న వాతావరణం నెలకొంది. మనసు నిండా చల్లని పొగమంచు ముసురుకుంది. ఆత్మీయుల నులివెచ్చని స్పర్శతో.. ఒక్కసారిగా 25ఏళ్ల ఒంటరి ప్రయాణం కళ్ళముందు కదలాడి సినిమా రీల్ లా గిర్రున తిరిగింది. ఒక నిరుపేద కుటుంబంలో పుట్టిన నేను 250 రూపాయలు పట్టుకుని 1997 డిసెంబర్ 24వ తేదీన హైదరాబాదులో దిగాను. సముద్రంలో నీటి బిందువు పడినట్టుగా ఈ మహానగర జనారణ్యంలో అడుగు పెట్టాను. జీవితంలో ఎంత దుఃఖాన్ని భరించానో, అంత ఆనందాన్ని అనుభవించాను. దుఃఖంలో కుదేలు పడింది లేదు. ఆనందంలో కాలర్ ఎగరేసింది లేదు. ఆనంద విషాదాలను సమదృష్టితో…

సామ్రాట్ : ఒక పచ్చని జ్ఞాపకం!

Ghattamaneni Rameshbabu special story

మా హీరో కొడుకు ఎంట్రీ అంటే మాకెంత జోష్ ఉండాలి? అభిమానమంటే అభిమానమే. నాకు సూపర్ స్టార్ కృష్ణ అంటే పిచ్చి అభిమానం. ఎందుకో మరి… చిన్నప్పటి నుంచి ఉన్న ఆ అభిమానాన్ని మాటల్లో చెప్పలేను. ఇప్పటికీ అలాగే కొనసాగుతున్నదనుకోండి. కృష్ణ వ్యక్తిత్వం కూడా ఈ అభిమానానికి కారణం కావొచ్చు. ఇక అభిమానమంటే ఒక్క ఆ హీరోకే పరిమితం కాదు. ఆ హీరో కుటుంబం నుంచి ఇంకొకరు సినీ ఎంట్రీ ఇస్తే వాళ్ళ మీదా పొంగుకొచ్చే గొప్ప అభిమానమన్నమాట. ఇది నా బాల్యంలో రమేష్ బాబుకూ, ఇప్పుడు మహేష్ కూ వర్తిస్తున్న అభిమానమే. నిన్న రమేష్ బాబు చనిపోయాడనే వార్త చెవిన పడగానే అతడితో అల్లుకున్న ఓ జ్ఞాపకం మళ్ళీ తాజా తాజాగా కదలాడసాగింది. ఈ జ్ఞాపకం జీవితాంతం వదలని జ్ఞాపకాల్లో ఒకటి. రమేష్ బాబు అనగానే…

Superstar Mahesh Babu, Dulquer Salmaan Released Adivi Sesh Major’s First Single Hrudayama

Superstar Mahesh Babu, Dulquer Salmaan Released Adivi Sesh Major’s First Single Hrudayama

Actor Adivi Sesh’s first Pan India film Major is getting ready for its release. Currently, the film is in last leg of post-production. Directed by Sashi Kiran Tikka, the film was shot simultaneously in Telugu, Hindi and it will also be released in Malayalam. The film’s musical promotions begin with first single Hrudayame is out now. Superstar Mahesh Babu launched the song in Telugu, while Dulquer Salmaan released it in Malayalam. Hrudayame, as the title suggests, is a romantic song on the lead pair- Adivi Sesh and Saiee Manjrekar. Sricharan…

అనసూయ హంగామా అంతా ఇంతా కాదు!!

Anasuya-Bharadwaj

`జబర్దస్త్` యాంకర్‌ అనసూయ అందంపై సోషల మీడియాలో ఎప్పుడూ చర్చ జరుగుతుంటుంది. ఆమె దిగే ఫొటో షూట్లు వివాదాలుగా మారుతుంటాయి. ఆమె వేసుకునే డ్రెస్‌ ట్రోల్‌కి గురవుతుంటుంది. మొత్తంగా అనసూయ ఏం చేసినా లోపాలను ఎత్తేందుకు లక్షల కళ్లు తీక్షణంగా చూస్తుంటాయి. అనసూయ `జబర్దస్త్` షోతో యాంకర్‌ గా ఎంతో గుర్తింపుని తెచ్చుకుంది. ముఖ్యంగా తన అందాలతో ఆడియెన్స్ ని కనువిందు చేస్తుంది. పొట్టి దుస్తుల్లో ఆమె చేసే హంగామా అంతా ఇంతా కాదు. ఈ బ్యూటీ కోసమే `జబర్దస్త్` షో చూసే వాళ్లు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అంతగా బుల్లితెరపై అందాల విందు వడ్డిస్తున్న అనసూయ మేకప్‌పై తాజాగా మరోసారి సోషల మీడియాలో చర్చ మొదలైంది. మేకప్‌లో ఎవరైనా అందంగా కనిపిస్తారు. ముఖ్యంగా చాలా మంది హీరోయిన్లని మేకప్‌ లేకుండా చూడలేం అనేట్టుగా ఉంటారు. అలానే…

డా. మహ్మద్ రఫీకి ‘ఇండియన్ ఐకాన్’ జాతీయ పురస్కారం

mohammed rafeeki indian icon award

మరొక ప్రతిష్టాత్మక జాతీయ పురస్కారం డా. మహ్మద్ రఫీ అవార్డుల ర్యాక్ లో చేరింది! జాతీయ మానవ హక్కుల సంస్థ, అరుణాచల్ ప్రదేశ్ ప్రతియేటా నిర్వహించే ఇండియన్ ఐకాన్ పురస్కారం లభించింది. ఈ నెల 27న ఢిల్లీ లీనా యాంబియెన్స్ హోటల్ కన్వెన్షన్ లో జరిగిన పురస్కారాల ప్రదానోత్సవం లో పర్యావరణం, క్రీడలు, అటవీ శాఖ మంత్రి శ్రీ మామా నతుంగ్ (అరుణాచల్ ప్రదేశ్) చేతుల మీదుగా ఇండియన్ ఐకాన్ పురస్కారం స్వీకరించారు. ఈ వేడుక లో వివిధ రాష్ట్రాల నుంచి లబ్ద ప్రతిష్టులను ఎంపిక చేసి ఇండియన్ ఐకాన్ పురస్కారాలతో ఘనంగా సత్కరించారు.మహ్మద్ రఫీతో పాటు ప్రముఖ సైకాలాజిస్ట్ శ్రీ బి.వి.సత్య నగేష్, జాతీయ టెన్నిస్ క్రీడాకారిణి డాక్టర్ రేఖా గౌడ్ తెలంగాణ నుంచి ఎంపికై పురస్కారాలు స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి గుంటూరు కార్పొరేషన్ ఐఇఎస్…

జాతీయస్థాయి కరాటేలో రాణిస్తున్న మేకల దీక్షిత్

Karate News

హైదరాబాద్‌కు చెందిన మేకల దీక్షిత్ జాతీయస్ధాయి కరాటేలో రాణిస్తున్నాడు. మన్సూరాబాద్‌ నాగార్జున స్కూల్‌లో 4వ తరగతి చదువుతున్న దీక్షిత్‌, డిసెంబర్ 25,26 తేదీల్లో మీరట్‌లో జరిగిన జాతీయ కరాటే ఛాంపియన్‌షిప్‌లో బ్లూ బెల్ట్‌ కేటగిరిలో ద్వితీయస్ధానం సాధించాడు. త్వరలో కెనడాలో జరిగే కెంజూట్‌ ఇంటర్నేషనల్ సెల్ఫ్ డిఫెన్స్ ట్రయినింగ్ క్యాంపులో పాల్గొనేందుకు అర్హత సాధించాడు. మాస్టర్ B. రాము వద్ద సంవత్సరం నుంచి శిక్షణ తీసుకుంటున్నట్లు దీక్షిత్ తండ్రి మేకల దుర్గయ్య తెలిపారు. కెనడాలో జరిగే పోటీల్లో పాల్గొనేందుకు దీక్షిత్‌కు అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు. కరాటే ఆత్మరక్షణ క్రీడ మాత్రమే కాదని, అది ఆత్మస్థైర్యాన్ని కూడా కల్పిస్తుందని తెలిపారు.

దేవులపల్లి అమర్ కు అమెరికా తెలుగు సంఘం ‘ఆటా’ ఎక్సలెన్స్ అవార్డ్

Amar Sir

జర్నలిజం రంగంలో విశేష కృషి చేసినందుకు అమెరికా తెలుగు సంఘం దేవులపల్లి అమర్‌ను ఎక్సలెన్స్ అవార్డుతో సత్కరించింది. ప్రముఖ జర్నలిస్టు దేవులపల్లి అమర్, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జాతీయ మీడియా & అంతర్రాష్ట్ర వ్యవహారాల (NMISA) సలహాదారుగా పనిచేస్తున్నారు, అమెరికా తెలుగు సంఘం (ఆటా) వారి వేడుకలు – సేవా డేస్ గ్రాండ్ ఫినాలే ముగింపు కార్యక్రమం డిసెంబర్ 26న హైదరాబాద్ రవీంద్ర భారతిలో నిర్వహించింది. అమెరికా తెలుగు సంఘం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లో 1990 సంవత్సరంలో స్థాపించబడిన లాభాపేక్ష లేని జాతీయ స్థాయి సంస్థ. తెలుగు భాష, సంస్కృతిని ప్రోత్సహిస్తూ, ప్రవాస భారతీయుల ప్రయోజనం కోసం ఈ వేదిక ద్వారా అనేక సేవలందిస్తున్నారు. ఈ సందర్భంగా ‘ ఆటా ‘ నిర్వాహకులకు శ్రీ అమర్ కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర సాంస్కతిక, పర్యాటకశాఖ మంత్రి…

మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది : అనసూయరెడ్డి

Anasuyareddy helath

చిన్నపిల్లల దగ్గరనుంచి పెద్దవాళ్ళ వరకు ఇప్పుడున్న సమస్యల్లో బరువు పెరగడం అనేది అతి పెద్ద సమస్యగా మారింది చాలా పెద్ద సమస్యగా మారింది. కానీ ఈ బరువు తగ్గే విధానంలో మనం ఏం కోల్పోతున్నాం అనేది ఆలోచించాలి. ఎందుకంటే బరువు తగ్గితే ఈ సమస్య తగ్గిపోతుంది అని అందరం అనుకుంటాం కానీ.. ఈ విధానంలో మనం బరువు ఒకటే కాకుండా మన పోషణ కూడా కోల్పోతున్నాం అని మన అందరం గుర్తించాలి. ఎలా అంటే పోషణ అనేది మన శరీరంలో చాలా ముఖ్యమైన భాగం అందుకే చాలామంది బరువు తగ్గే ఈ క్రమంలో పోషణ కూడా కోల్పోతారు. చాలా కష్టపడి 3 నుండి నాలుగు కేజీల వరకు బరువు తగ్గుతారు కానీ మళ్లీ మామూలుగా తినడం వల్ల బరువు పెరుగుతారు అయితే దీనికి శాశ్వత పరిష్కారం ఏదైనా…

‘ఎపిక్టైజ్’ మీడియా హౌస్ ప్రారంభం

AP news

భారతీయతకు బలమైన పునాది… మన సంస్కృతి, సంప్రదాయాలు… వాటిని కాపాడుకుంటూ నవ్యతను జోడించుకుంటూ… మన సంస్కృతిని ముందు తరాలకు అందించాలనే ఆకాంక్షతో మీడియా హౌస్ మొదలు పెట్టారు. అదే ‘ఎపిక్టైజ్’….మీడియా హౌస్ తో పాటు వెబ్ సైట్ కూడా ప్రారంభం అయింది. హరి దామెర, నాగరాజు తాళ్లూరి ఇద్దరు కలిసి మొదలు పెట్టిన అద్భుత కార్యక్రమం ‘ఎపిక్టైజ్’ మీడియా. ఈ మీడియా లాంచ్ కార్యక్రమం హైదరాబాద్ లో శుక్రవారం జరిగింది. ఈ వేడుకలో ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్, దర్శకుడు మారుతి, దర్శకుడు వి ఎన్ ఆదిత్య, రాజ్ మాదిరాజు తదితరులు పాల్గొన్నారు. ‘ఎపిక్టైజ్ మీడియా సంస్థ’ తన తొలి కార్యక్రమంగా ‘రాగరస… రీగరీసా’ అనే కార్యక్రమాన్ని నిర్విహిస్తోంది. శ్రీమతి మణి నాగరాజు దీనిని రూపకల్పన చేశారు. తొలి తెలుగు వాగ్గేయకారుడు తాళ్లపాక అన్నమాచార్య, త్యాగరాజు, పురందర…