తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఎలక్షన్స్ జరిగి రెండు సంవత్సరాలు పూర్తయ్యాయి. రెండేళ్ల పదవీకాలం పూర్తయిన సందర్భంగా సెప్టెంబర్ 8వ తేదీన నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడానికి ఎన్నికలు నిర్వహించాలని ఛాంబర్ సభ్యులు నిర్ణయించారు. ఈ సందర్భంగా ఛాంబట్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణగౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ఫిలింఛాంబర్ స్థాపించి 14 సంవత్సరాలు అయ్యింది. ఎలక్షన్స్ కోసం అడ్వైజర్లుగా సుదర్శన్ థియేటర్ అధినేత భాస్కరరావు, నిర్మాత గురురాజ్, జె వి ఆర్ గార్లు వ్యవరిస్తున్నారు. ఎలక్షన్ ఆఫీసర్ గా అడ్వకేట్ కె వి ఎల్ నరసింహారావు గారు వ్యవహరిస్తారు. సెప్టెంబర్ 1వ తేదీన నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమౌతుంది. 8వ తేదీన ఎన్నికలు నిర్వహిస్తారు. ఛాంబర్ లో 1000 మంది ప్రొడ్యూసర్స్, 16000 మంది 24 క్రాఫ్ట్స్ మెంబెర్స్ వున్నారు. సభ్యులకు ఇన్సూరెన్స్, సభ్యుల పిల్లలకు స్కాలర్షిప్ అందిస్తున్నాము. సభ్యుల సంక్షేమమే ధ్యేయంగా…
Category: Entertainment
AP CM Chandrababu Naidu invited to Nandamuri Balakrishna Golden Jubilee celebrations
On the occasion of Nandamuri Balakrishna’s 50 years of entering the film industry, a grand celebration has been planned by the Telugu film industry at Hyderabad Hitex Novotel Hotel on September 1. The Telugu Film Producers Council Honorable Secretary T. PrasannaKumar, Telugu Film Chamber of Commerce Honorable President Bharat Bhushan, Producer K.L. Narayana, producer Gemini Kiran, producer and distributor Kommineni Venkateswara Rao, Alankar Prasad, Raja Yadav invited Andhra Pradesh Chief Minister Shri Nara Chandrababu Naidu on behalf of the film industry to this event. Nara Chandrababu Naidu responded positively to…
నందమూరి బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు ఆహ్వానం
నందమూరి బాలకృష్ణ సినీ రంగ ప్రవేశం చేసి 50 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సెప్టెంబర్ 1న హైదరాబాద్ హైటెక్స్ నోవోటెల్ హోటల్లో తెలుగు సినీ పరిశ్రమ ఆధ్వర్యంలో గ్రాండ్ గా సెలబ్రేషన్స్ ని ప్లాన్ చేశారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడుని కలిసి నందమూరి బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకలకు సినీ ఇండస్ట్రీ తరఫున ఆహ్వానించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుని కలిసినవారిలో తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ హానరబుల్ ప్రెసిడెంట్ భరత్ భూషణ్, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ హానరబుల్ సెక్రటరీ టి. ప్రసన్నకుమార్, కె. ఎల్. నారాయణ , అలంకార్ ప్రసాద్, నిర్మాత జెమినీ కిరణ్, నిర్మాత మరియు డిస్ట్రిబ్యూటర్ కొమ్మినేని వెంకటేశ్వరరావు, రాజా యాదవ్, అలంకార్ ప్రసాద్ ఉన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఈ…
వెబ్ సీరిస్‌లపై సమంత దృష్టి!
ఒకప్పుడు వరుస సినిమాలతో బాక్సాఫీస్ వద్ద అలరించిన సమంత ఇప్పుడు ఓటీటీ వేదికగానూ సత్తా చాటుతున్నారు. ఇప్పటికే ‘ఫ్యామిలీమెన్ 2’లో ఆమె నటనకు అందరూ ఫిదా అయ్యారు. ఇప్పుడు మరో సరికొత్త సిరీస్‌లోనూ సమంత నటించడానికి సిద్ధమయ్యారు. రాజ్ అండ్ డీకే సారథ్యంలో రూపొందబోయే పీరియాడిక్ ఫాంటసీ సిరీస్‌లో సమంత నటించబోతున్నారట. ఆదిత్య రాయ్‌కపూర్, వామికా గబ్బీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘తుంబాద్’ వంటి మిస్టీరియస్ థ్రిల్లర్ తీసిన రాహి అనిల్ బార్వి దీనికి దర్శకత్వం వహించనున్నారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన వివరాలను ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ప్లిక్స్ వెల్లడించనుంది. ఇప్పటివరకూ భారతీయ సినిమా తెరపై రాని సరికొత్త కథాంశంతో ఈ సిరీస్‌ను తీయబోతున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. సిరీస్ చూస్తున్న ప్రేక్షకుడిని మరో సరికొత్త ఊహా ప్రపంచంలోకి తీసుకెళ్తుందట. మోసం, నమ్మకద్రోహం, ప్రేమ, త్యాగం…
నేషనల్ క్రష్..అభిమానులు ఇచ్చిన ట్యాగ్..!
‘యానిమల్’తో ఒక్కసారిగా ఫేమ్ సొంతం చేసుకున్నారు బాలీవుడ్ నటి త్రిప్తి దిమ్రి . ఈ సినిమా తర్వాత యూత్‌లో ఆమెకు ఫాలోయింగ్ విపరీతంగా పెరిగింది. దీంతో ఆమె నేషనల్ క్రష్‌గా గుర్తింపు సొంతం చేసుకున్నారు. అభిమానులు తనని ‘నేషనల్ క్రష్’ అని పిలవడంపై తాజాగా త్రిప్తి స్పందించారు. ఆ ట్యాగ్ విషయంలో తాను ఆనందంగా ఉన్నట్లు చెప్పారు. బాలీవుడ్‌లో కెరీర్ మొదలుపెట్టి దాదాపు ఏడేళ్లు అయ్యింది. అందుకు సంతోషంగా ఉన్నా. గొప్ప నటీనటులు, దర్శకులతో వర్క్ చేస్తానని కెరీర్ ఆరంభంలో ఎప్పుడూ అనుకోలేదు. ఎందుకంటే, యాక్టింగ్‌ను నేను సీరియస్‌గా తీసుకోలేదు. మొదటి సినిమా పూర్తయిన తర్వాత కెరీర్‌ను విధికే వదిలేశా. ‘ఒక సినిమా పూర్తి చేశా. అదృష్టం ఉంటే రెండో సినిమా రావొచ్చు’ అనుకున్నా. అలాంటి సమయంలో ‘లైలా మజ్ను’ కోసం ఆడిషన్‌లో పాల్గొన్నా. ఆనాటి నుంచి…
ది కింగ్ అఫ్ ఎంటర్ టైన్మెంట్ నవీన్ పోలిశెట్టి ఈజ్ బ్యాక్ .. తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3లో అదరగొట్టిన హీరో
ది కింగ్ అఫ్ ఎంటర్ టైన్మెంట్ హీరో నవీన్ పోలిశెట్టి ఈజ్ బ్యాక్. గాయం నుంచి కోలుకున్న తర్వాత నవీన్ పోలిశెట్టి ఆహాలో అలరించారు. ఈ వారం తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3, 21, 22వ ఎపిసోడ్‌లలో మరోసారి తన ఎనర్జీటిక్ ప్రజెన్స్ అదరగొట్టారు. షో లో నాన్‌స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్ ని క్రియేట్ చేశారు. ట్యాలెంట్ పవర్ హౌస్ అయిన నవీన్ పోలిశెట్టి క్రేజీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎపిసోడ్ ఈ వారం రాబోతోంది. తన ఎనర్జీ, డ్యాన్స్, కామెడీ టైమింగ్ తో కంటెస్టెంట్స్, జడ్జ్ లని మెస్మరైజ్ చేశారు. నవీన్ పడిన రెండు పాటలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ ఎపిసోడ్స్ లో చాలా హైలెట్స్ వున్నాయి. నవీన్ గాయం నుంచి కోలుకున్న తన జర్నీని చెప్పిన తీరు చాలా స్ఫూర్తిని ఇచ్చింది. ఆ కష్టమైన క్షణాలని…
ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్‌లో హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ టీమ్‌ను సొంతం చేసుకున్న యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య
టాలీవుడ్ యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య.. కొత్త ప్రయాణానికి శ్రీకారం చుట్టారు. చైతుకి ఆటో మైబైల్స్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి కారు రేసింగ్స్ అన్నా, ఫార్ములా వన్ అంటే చాలా చాలా ఇష్టం. ఈ విషయాన్ని ఆయన పలు సందర్భాల్లో తెలియజేశారు. అలాగే ఆయన ఇప్పుడు తనకు ఎంతో ఇష్టమైన రేసింగ్ కార్లను, మోటార్ సైకిల్స్‌ను కూడా సేకరిస్తుంటారు. అలాంటి ఇష్టమైన రంగంలోకి చైతన్య అడుగు పెట్టారు . ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్ (ఐఆర్ఎఫ్)లో పోటీ పడే హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ ఫ్రాంచైజీని నాగ చైతన్య సొంతం చేసుకున్నారు. దీని వల్ల ఆయన ఐఆర్ఎఫ్ నిర్వహించే ఫార్ములా 4లో భాగమయ్యారు. దీనికి సంబంధించిన రేసులు ఆగస్ట్ 24 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సందర్బంగా అక్కినేని నాగచైతన్య మాట్లాడుతూ ‘‘నాకు చిన్నప్పటి నుంచి మోటార్…
Naga Chaitanya to power Hyderabad Black Birds at Indian Racing League 2024
Renowned actor and motorsport enthusiast Akkineni Naga Chaitanya is set to ignite the Indian Racing Festival (IRF) as he takes the helm of the Hyderabad Blackbirds as team owner for the 2024 season of the Indian Racing League (IRL). A passionate follower of Formula 1 and a dedicated collector of supercars and motorcycles, Chaitanya brings a unique blend of motorsport fervor and star power to the league. His deep-rooted love for racing, coupled with his influence as a youth icon and his stature in the entertainment industry, is expected to…
ఆపద్బాంధవుడు అన్నయ్య .. పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్
నా దృష్టిలో ఆపద్బాంధవుడు అన్నయ్య చిరంజీవి గారు. అన్నయ్య పుట్టిన రోజు సందర్భంగా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. ఆపత్కాలంలో ఉన్న ఎందరికో ఆయన సహాయం చేయడం నాకు తెలుసు. అనారోగ్యం బారినపడినవారికి ప్రాణదానం చేసిన సందర్భాలు అనేకం. కొందరికి చేసిన సాయం మీడియా ద్వారా బాహ్య ప్రపంచానికి తెలిస్తే మరెన్నో సహాయాలు గుప్తంగా మిగిలిపోయాయి. కావలసిన వారి కోసం ఆయన ఎంతవరకైనా తగ్గుతారు. అభ్యర్ధిస్తారు. ఆ గుణమే చిరంజీవి గారిని సుగుణ సంపన్నునిగా చేసిందేమో! గత అసెంబ్లీ ఎన్నికలు కీలక దశకు చేరుకున్న తరుణంలో అయిదు కోట్ల రూపాయల విరాళాన్ని జనసేనకు అందచేసి, విజయాన్ని అందుకోవాలని మా ఇలవేలుపు ఆంజనేయుని సాక్షిగా శ్రీ చిరంజీవిగారు ఆశీర్వదించారు. ఆయన ఆ రోజున ఇచ్చిన నైతిక బలం, నైతిక మద్దతు జనసేనకు అఖండ విజయాన్ని చేకూర్చాయి. అటువంటి గొప్ప దాతను అన్నగా…
రావు రమేష్ గారు వండర్‌ఫుల్ ఆర్టిస్ట్… ‘మారుతి నగర్ సుబ్రమణ్యం’ సక్సెస్ అయ్యి ఇటువంటి కథలు ఎక్కువ రావాలని కోరుకుంటున్నా – ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్
క్రియేటివ్ జీనియస్ సుకుమార్ భార్య తబిత సమర్పణలో ఆగస్టు 23న ప్రేక్షకుల ముందుకు వస్తున్న సినిమా ‘మారుతీ నగర్ సుబ్రమణ్యం’. ఇందులో రావు రమేష్ కథానాయకుడు. లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించారు. పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్ సంస్థలపై బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య నిర్మించారు. రావు రమేష్ సరసన ఇంద్రజ… అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి మరో జంటగా, హర్షవర్ధన్ కీలక పాత్రలో నటించారు. బుధవారం రాత్రి హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా, సుకుమార్ విశిష్ఠ అతిథిగా విచ్చేశారు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఫస్ట్ టికెట్ అల్లు అర్జున్ గారికి ప్రజెంట్ చేశారు. ‘టికెట్ ఎంత పెట్టి కొంటున్నారు?’ అని సుమ అడగ్గా… ”సుకుమార్ గారి సినిమా. కోటి రూపాయలు అయినా పెడతా” అని చెప్పారు అల్లు…
