ఇద్దరూ ఇద్దరే ..
పాత్రికేయ దిగ్గజ శిఖరాలు..
పెద్ద పత్రికలను వదిలేస్తున్నారు!
ఇద్దరూ ఇద్దరే! ఇద్దరివీ అద్భుత ఆలోచనలు! ఇద్దరివీ మంచి కలాలు! గొప్ప రాతలు! సమాజానికి ఉపయోగపడే వ్యక్తిత్వాలు! ఎప్పటికప్పుడు కొత్తదనం ఆహ్వానించే పాత్రికేయ దిగ్గజాలు! కొత్త ట్రెండ్స్ ను పరిచయం చేసే దమ్మున్న పాత్రికేయ శిఖరాలు! నిరంతరం తాజాగా ఆలోచించే సంపాదకులు! టన్నులు కొద్దీ చురుకైన పాత్రికేయులను తయారు చేసే ఫ్యాక్టరీలు! తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన పత్రికా ఎడిటర్లు! వారెవరో కాదు…ఒకరు వి. మురళి, ఇంకొకరు కె. శ్రీనివాస్! ఒకరు సాక్షి ఎడిటర్! ఇంకొకరు ఆంధ్రజ్యోతి ఎడిటర్!
ఇద్దరూ మంచి మిత్రులు! జర్నలిజంలో ఎన్నో ప్రయోగాలు చేసిన అక్షర శాస్త్రవేత్తలు! ఇద్దరూ ఒకేసారి సంపాదకులుగా పదవీ విరమణ చేస్తున్నారు. ఈనెల 31వ తేదీ వరకు కె. శ్రీనివాస్ ఆంధ్రజ్యోతి సంపాదకులుగా వుంటారని సమాచారం. డిసెంబర్ 31 వరకు వి. మురళి సంపాదకులుగా ఉంటారని వార్త వినిపిస్తోంది. కె. శ్రీనివాస్ స్థానంలో ఆంధ్రజ్యోతి ఎడిటర్ గా కె. రాహుల్ కుమార్ రానున్నారు. వి. మురళి స్థానంలో ధనుంజయ రెడ్డి రానున్నట్లు సమాచారం. వి. మురళి సేవలను ఎడిటోరియల్ డైరెక్టర్ గా కొనసాగించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. కె. శ్రీనివాస్ డిజిటల్ మీడియాలోకి ప్రవేశించనున్నట్లు సమాచారం. రెండు పెద్ద పత్రికలను తెలంగాణలో కీలక పాత్రికేయులుగా హృదయమున్న ఉద్యమ జర్నలిస్టులుగా పేరొందిన దిగ్గజాలు అటు ఇటుగా కొద్ది రోజులు తేడాలో వదిలేయడం రాష్ట్రానికి పెద్ద లోటుగా చెప్పుకోవచ్చు!