* ఉత్తమ చిత్రం : మిరాయ్
* ఉత్తమ దర్శకుడు : అనిల్ రావిపూడి (సంక్రాంతికి వస్తున్నాం)
* తొలి ఐఎన్సీఏ అవార్డ్స్ విజేతల ప్రకటన
ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ తొలి ఐఎన్సీఏ అవార్డ్స్ విజేతలని ప్రకటించింది. పన్నెండు భాషలు, పన్నెండు సినిమా ఇండస్ట్రీలను ప్రాతినిధ్యం వహిస్తున్న ఐఎన్సీఏ ఈ ఏడాది మొత్తం 25 కేటగిరీలలో విజేతల అనౌన్స్ చేశారు. ఉత్తమ తెలుగు చిత్రంగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ – మిరాయ్ సూపర్ యోధ విజేతగా ఎంపికైయింది. ఉత్తమ తెలుగు నటుడిగా నాగ చైతన్య (తండేల్) విజేతగా నిలిచారు. అనిల్ రావిపూడి (సంక్రాంతికి వస్తున్నాం) ఉత్తమ దర్శకుడిగా అవార్డ్ గెలుపొందారు.
భాషల వారీగా ఐఎన్సీఏ అవార్డ్స్ విజేతలు:
తెలుగు: ఉత్తమ నటుడు: నాగ చైతన్య (తండేల్), ఉత్తమ నటి: రష్మిక మందన్న (ది గర్ల్‌ఫ్రెండ్), ఉత్తమ దర్శకుడు: అనిల్ రావిపూడి (సంక్రాంతికి వస్తున్నాం), ఉత్తమ చిత్రం: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ – మిరాయి సూపర్ యోధా.
అస్సామీ: ఉత్తమ నటుడు: రవి శర్మ (రుద్ర), ఉత్తమ నటి: నందిని కశ్యప్ (రుద్ర), ఉత్తమ దర్శకుడు: రక్తిమ్ కమల్ బరువా (గులై సూర్), ఉత్తమ చిత్రం: జెంగ్ ఎంటర్టైన్‌మెంట్, ఏ.ఎస్.ఎఫ్.ఎఫ్.డి.సి– గులై సూర్
బెంగాళీ : ఉత్తమ నటుడు: ప్రోసెన్జిత్ చటర్జీ (దేవి చౌధురాణి), ఉత్తమ నటి: కౌశాని ముఖర్జీ (కిల్‌బిల్ సొసైటీ), ఉత్తమ దర్శకుడు: అన్నపూర్ణ బసు (శార్థోపర్), ఉత్తమ చిత్రం: హోయిచోయ్ స్టూడియోస్, ఎస్.వి.ఎఫ్.ఎంటర్టైన్‌మెంట్ – ది ఏకెన్: బెనారస్ ఎ బిభిషికా
భోజ్‌పురి: ఉత్తమ నటుడు: దినేష్ లాల్ యాదవ్ (మేరే హస్బండ్ కి షాది హై), ఉత్తమ నటి: అమ్రపాలి దూబే (మేరే హస్బండ్ కి షాది హై), ఉత్తమ దర్శకుడు: విశాల్ వర్మ (హమార్ నామ్ బా కన్హయ్యా), ఉత్తమ చిత్రం: గిరిరాజ్ ప్రొడక్షన్ – హమార్ నామ్ బా కన్హయ్యా
గుజరాతీ: ఉత్తమ నటుడు: శ్రుహాద్ గోస్వామి (లాలో – శ్రీ కృష్ణ సదా సహాయతే), ఉత్తమ నటి: జాన్కి బోడియాలా (వష్ లెవల్ 2), ఉత్తమ దర్శకుడు: అంకిత్ భూపత్‌భాయ్ సఖియా (లాలో – శ్రీ కృష్ణ సదా సహాయతే), ఉత్తమ చిత్రం: మానిఫెస్ట్ ఫిలిమ్స్, జయ వ్యాస్ ప్రొడక్షన్, సౌల్ సుల్త్రా, నీమ్ ట్రీ ఎంటర్టైన్‌మెంట్, ఆర్.డి బ్రదర్స్ – లాలో
హిందీ: ఉత్తమ నటుడు: రణవీర్ సింగ్ (ధురంధర్), ఉత్తమ నటి: యామి గౌతమ్ ధర్ (హక్), ఉత్తమ దర్శకుడు: ఆదిత్య ధర్ (ధురంధర్), ఉత్తమ చిత్రం: దినేష్ విజన్ & మాడ్‌డాక్ ఫిలిమ్స్ – ఛావా
కన్నడ: ఉత్తమ నటుడు: రిషబ్ శెట్టి (కాంతార: ఎ లెజెండ్ – చాప్టర్ 1), ఉత్తమ నటి: రుక్మిణి వసంత్ (కాంతార), ఉత్తమ దర్శకుడు: రిషబ్ శెట్టి (కాంతార), ఉత్తమ చిత్రం: హోంబలే ఫిలిమ్స్ – కాంతార
మలయాళం: ఉత్తమ నటుడు: నివిన్ పాలీ (సర్వం మాయ), ఉత్తమ నటి: కళ్యాణి ప్రియదర్శన్ (లోక చాప్టర్ వన్: చంద్ర), ఉత్తమ దర్శకుడు: డొమినిక్ అరుణ్ (లోక చాప్టర్ వన్: చంద్ర), ఉత్తమ చిత్రం: వే ఫారర్ ఫిలిమ్స్ – లోక చాప్టర్ వన్: చంద్ర
మరాఠీ: ఉత్తమ నటుడు: దిలీప్ ప్రభావాల్కర్ (దశావతార్), ఉత్తమ నటి: అమృత సుభాష్ (జరాన్), ఉత్తమ దర్శకుడు: సుబోధ్ ఖనోల్కర్ (దశావతార్), ఉత్తమ చిత్రం: ధున్ ప్రొడక్షన్స్ – స్థల్
ఒడియా: ఉత్తమ నటుడు: బబుషాన్ మహంతి (బౌ బుట్టు భూత), ఉత్తమ నటి: అర్చిత సాహూ (బౌ బుట్టు భూత), ఉత్తమ దర్శకుడు: సబ్యసాచి మహాపాత్ర & కుమార్ సి. దేవ్ మహాపాత్ర (అనంత), ఉత్తమ చిత్రం: బబుషాన్ ఫిలిమ్స్ – బౌ బుట్టు భూత
పంజాబీ: ఉత్తమ నటుడు: తరసెం జస్సర్ (గురు నానక్ జహాజ్), ఉత్తమ నటి: సర్గున్ మెహతా (సర్బాలా జీ), ఉత్తమ దర్శకుడు: షరన్ ఆర్ట్ (గురు నానక్ జహాజ్), ఉత్తమ చిత్రం: వెహ్లి జన్తా ఫిలిమ్స్, ట్రూ రూట్స్ ప్రొడక్షన్స్ – గురు నానక్ జహాజ్
తమిళం: ఉత్తమ నటుడు: దుల్కర్ సల్మాన్ (కాంతా), ఉత్తమ నటి: సిమ్రాన్ (టూరిస్ట్ ఫ్యామిలీ), ఉత్తమ దర్శకుడు: మారి సెల్వరాజ్ (బైసన్ కాలమాడన్), ఉత్తమ చిత్రం: మిలియన్ డాలర్ స్టూడియోస్, ఎం.ఆర్.పి ఎంటర్టైన్‌మెంట్ – టూరిస్ట్ ఫ్యామిలీ.
ఉత్తమ మ్యూజిక్ ఆల్బమ్ : మిథూన్, సచేత్-పరంపర, రిషభ్ కాంత్, విశాల్ మిశ్రా, తనిష్క్ బాగ్చీ, ఫహీమ్ అబ్దుల్లా, అర్స్లాన్ నిజామి, సినిమా: సయ్యారా భాష: హిందీ, ఉత్తమ సినిమాటోగ్రఫీ: షాజీ కుమార్, సినిమా: తుడరం, భాష: మలయాళం, ఉత్తమ సహాయ నటుడు: శరత్ కుమార్, సినిమా: 3బి.హెచ్.కె, భాష: తమిళం, ఉత్తమ సహాయ నటి: సిమ్రాన్ మంగేశ్కర్, సినిమా: సితారే జమీన్ పర్, భాష: హిందీ, ఉత్తమ పరిచయ నిర్మాత : మానిఫెస్ట్ ఫిలిమ్స్, జయ వ్యాస్ ప్రొడక్షన్, సౌల్ సుల్త్రా, నీమ్ ట్రీ ఎంటర్టైన్‌మెంట్, ఆర్‌డీ బ్రదర్స్, సినిమా: లాలో – శ్రీ కృష్ణ సదా సహాయతే, భాష: గుజరాతీ, ఉత్తమ ఎడిటర్: శివకుమార్ పనిక్కర్, సినిమా: ధురంధర్, భాష: హిందీ, ఉత్తమ కథ – స్క్రీన్‌ప్లే : బషరత్ పీర్, నీరజ్ ఘయ్వాన్, సుమిత్ రాయ్, సినిమా: హోంబౌండ్, భాష: హిందీ, ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్ (మేల్) : విశాల్ మిశ్రా – “తుమ్ హో తో”, సినిమా: సయ్యారా, భాష: హిందీ, ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్ (ఫీమేల్) : శ్రేయా ఘోషల్ – (సాంగ్: సయ్యారా రిప్రైజ్), సినిమా: సయ్యారా, భాష: హిందీ, ఉత్తమ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్: శశ్వత్ సచ్దేవ్, సినిమా: ధురంధర్, భాష: హిందీ, బెస్ట్ వీఎఫెక్స్ : పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వీఎఫెక్స్, డెక్కన్ డ్రీమ్స్, సినిమా: మిరాయ్ సూపర్ యోధా, భాష: తెలుగు, ఉత్తమ పరిచయ నటుడు: అహాన్ పాండే, సినిమా: సయ్యారా, భాష: హిందీ, ఉత్తమ పరిచయ నటి: రియా శిబు, సినిమా: సర్వం మాయ, భాష: మలయాళం, ఉత్తమ పరిచయ దర్శకుడు: కీర్తిశ్వరన్ – సినిమా: డ్యూడ్ (తమిళం), రామ్ జగదీష్ – సినిమా: కోర్ట్ (తెలుగు), ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: వినేష్ బంగ్లాన్, సినిమా: కాంతార: ఎ లెజెండ్ – చాప్టర్ 1, భాష: కన్నడ, ఉత్తమ హాస్య నటుడు: రేవంత్ (బుల్లి రాజు), సినిమా: సంక్రాంతికి వస్తున్నాం, భాష: తెలుగు, బెస్ట్ కాస్టింగ్: ముఖేష్ ఛబ్రా, సినిమా: ధురంధర్, భాష: హిందీ, ఉత్తమ విలన్: గుల్షన్ దేవయ్య, సినిమా: కాంతార: ఎ లెజెండ్ – చాప్టర్ 1, భాష: కన్నడ, ఉత్తమ డాన్స్ కొరియోగ్రఫీ: సాండీ మాస్టర్, సినిమా: కూలీ, భాష: తమిళం, ఉత్తమ ఫైట్ కొరియోగ్రఫీ: టోడర్ లాజారోవ్, సినిమా: కాంతార: ఎ లెజెండ్ – చాప్టర్ 1, భాష: కన్నడ, ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్: షీతల్ ఇక్బాల్ శర్మ, సినిమా: ఛావా, భాష: హిందీ.
పన్నెండు భాషలు, పన్నెండు సినిమా ఇండస్ట్రీలను ప్రాతినిధ్యం వహిస్తూ ఐఎన్సీఏను అత్యంత విస్తృతమైన అకాడమీ వేదికగా రూపొందించారు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన అనుభవజ్ఞులైన సభ్యులతో కూడిన జ్యూరీ ప్యానెల్ విజేతలని ఎంపిక చేసింది. ఐఎన్సీఏ అవార్డ్స్ వేడుక ఈ నెల 16న ముంబైలో జరగనుంది. దేశవ్యాప్తంగా ప్రముఖ దర్శకులు, నటులు, టెక్నీషియన్లు, నిర్మాతలు పాల్గొనే ఈ వేడుక భారతీయ సినిమా రంగానికి ఒక ముఖ్యమైన ఈవెంట్‌గా నిలవనుంది.
ఉత్తమ నటుడు నాగ చైతన్య
