అన్నీ అడ్డంకులు దాటుకుని ఎట్టకేలకు బాలకృష్ణ ‘అఖండ 2 తాండవం’ రిలీజ్ కాబోతుంది. శుక్రవారం (డిసెంబర్ 12)న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇవాళ్టి రాత్రి (డిసెంబర్ 11) నుంచే ‘అఖండ 2 తాండవం’ మూవీ ప్రీమియర్స్ పడనున్నాయి. దీంతో బాలయ్య మూవీ ఫస్ట్ షో చూడాలని అభిమానులు వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. రేటుతో సంబంధం లేకుండా ఇప్పటికే చాలా మంది ప్రీమియర్స్ టికెట్స్ బుక్ చేసుకుని థియేటర్లకు పరుగులు తీస్తున్నారు. అయితే బాలయ్య సినిమా రిలీజ్ పై రూమర్లు మాత్రం ఆగడం లేదు. డిసెంబర్ 5నే రిలీజ్ అవ్వాల్సిన ఈ మూవీ అనూహ్యంగా వాయిదా పడిపోయింది. చిత్ర నిర్మాతలకు ఫైనాన్సియల్ ఇష్యూస్ ఉండడంతో ఈ మూవీ పోస్ట్ పోన్ అయ్యింది. అయితే ఇప్పుడీ సమస్యలన్నీ తీరిపోయాయని చిత్ర నిర్మాతలు ప్రకటించారు. శుక్రవారం అఖండ తాండవం ఎంజాయ్ చేసేందుకు రెడీ అవ్వాలని అభిమానులకు పిలుపు నిచ్చారు. అయితే ఇంతలోనే అఖండ 2 సినిమా రిలీజ్ పై సోషల్ మీడియాలో రకరకాల రూమర్లు వినిపిస్తున్నాయి. అఖండ 2 సినిమాకి సంబంధించి టిక్కెట్ రేట్లకు హైక్ దొరకలేదని, దీంతో నేటి ప్రీమియర్ షోలు క్యాన్సిల్ అవ్వబోతున్నాయని వార్తలు వస్తున్నాయి. దీంతో టికెట్లు బుక్ చేసుకున్న వాళ్లు తెగ ఆందోళన చెందుతున్నారు.
అఖండ 2 మూవీ ప్రీమియర్స్ గురించి వస్తోన్న రూమర్లకు చెక్ పెట్టేందుకు నిర్మాతలు స్వయంగా రంగంలోకి దిగారు. ‘బాలయ్య అఖండ 2 సినిమా గురించి వస్తున్న రూమర్లు ఏవి నమ్మవద్దు అని. థియేటర్లో తాండవం ఎంజాయ్ చేయండి’ అని స్వయంగా నిర్మాత రామ్ అచంట ట్విట్టర్ వేదికగా క్లారిటీ ఇచ్చాడు. దీంతో నందమూరి అభిమానులు ఫుల్ జోష్ లో మునిగిపోయారు.
