సికింద్రాబాద్ జై స్వరాజ్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా ఆర్.ఎస్.జె థామస్

Secunderabad Jai Swaraj Party MP candidate RSJ Thomas

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలోని సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గ జై స్వరాజ్ పార్టీ అభ్యర్థిగా ఆర్ ఎస్ జె థామస్ ను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు కాసాని శ్రీనివాసరావుగౌడ్ ఖరారు చేశారు. హ్యుమన్ రైట్స్ కౌన్సిల్ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన థామస్ సీనియర్ జర్నలిస్ట్, అలాగే అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సమాజం పట్ల ఆయనకు ఉన్న సేవా దృక్పథాన్ని పరిగణనలోకి తీసుకుని థామస్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్లు కాసాని తెలిపారు. సికింద్రాబాద్ లో ఉన్న జై స్వరాజ్ పార్టీ కార్యాలయంలో గురువారం జరిగిన పార్టీ సమావేశాల్లో థామస్ ను కండువా కప్పి పార్టీలోకి కాసాని ఆహ్వానించారు. అనాధలు, అభాగ్యులు, పేదలకు తన ఎన్జీఓ సంస్థ ద్వారా సేవలు అందించే థామస్ జై స్వరాజ్ పార్టీ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులయ్యారు. సామాన్య ప్రజల…

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన ఎస్.వి కృష్ణారెడ్డి-అచ్చిరెడ్డి

SV Krishna Reddy-Acchi Reddy met Chief Minister Revanth Reddy

చిత్ర పరిశ్రమలో ఆదర్శ మిత్రులు ,అగ్రశ్రేణి దర్శక నిర్మాతలుగా పేరు పొందిన ఎస్వీ కృష్ణారెడ్డి- అచ్చిరెడ్డి ద్వయానికి రాజకీయాల పట్ల ఎలాంటి ఆసక్తి లేకపోయినప్పటికీ పలువురు రాజకీయ ప్రముఖులతో సత్సంబంధాలు ఉన్నాయి. పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులందరితో అనుబంధం ఉన్నప్పటికీ వారు ఎప్పుడూ రాజకీయ వేదికలపై కనిపించలేదు. అయితే ఇటీవల వారిద్దరూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాము రేవంత్ రెడ్డిని కలిసిన సందర్భాన్ని గురించి అడగగా “అది కేవలం మర్యాదపూర్వకమైన భేటీ మాత్రమే. రేవంత్ రెడ్డి గారు మాకు చిరకాల పరిచయస్తులు. అలాగే వారి అల్లుడు గారి తరఫున దూరపు బంధుత్వం కూడా ఉంది. ఆయన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తరువాత శుభాకాంక్షలు తెలపడం కోసం టైం తీసుకుని గత ఆదివారం రోజున ఆయన్ను కలిశాం.…

‘కలియుగం పట్టణంలో’ సినిమా పెద్ద విజయాన్ని సాధించాలి.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో సుమన్

The movie 'Kaliyugam Ubanlo' should be a big success.. Hero Suman at the pre-release event

నాని మూవీ వర్క్స్, రామా క్రియేషన్స్ ఆధ్వర్యంలో విశ్వ కార్తికేయ, ఆయూషి పటేల్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘కలియుగం పట్టణంలో’. కొత్త కాన్సెప్ట్‌తో రాబోతోన్న ఈ మూవీకి కథ, డైలాగ్స్ ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం రమాకాంత్ రెడ్డి వహించారు. డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి.మహేశ్వరరెడ్డి, కాటం రమేష్‌‌లు నిర్మించిన ఈ చిత్రం మార్చి 29న రాబోతోంది. ఈ క్రమంలో మంగళవారం నాడు ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు హీరో సుమన్, నిర్మాత ఏ.ఎం.రత్నం వంటి వారు ముఖ్య అతిథులుగా వచ్చారు. ఈ ఈవెంట్‌లో.. నిర్మాత డా.కందుల చంద్ర ఓబుల్ రెడ్డి మాట్లాడుతూ.. ‘నేను విద్యా వేత్తగా ఇంజనీరింగ్ కాలేజీలను నిర్వహిస్తున్నాను. పిల్లల్లో ఉన్న ప్యాషన్‌కు ఓ ఫ్లాట్ ఫాం కల్పించాలనే ఉద్దేశంతోనే నాని మూవీ వర్క్స్‌ను స్థాపించాను. నేను ఉన్న, పెరిగిన ఊరుని…

‘హలో బేబీ’ ప్రమోషనల్ సాంగ్ ను లాంచ్ చేసిన హీరో నవీన్ చంద్ర

Hero Naveen Chandra launched the promotional song 'Hello Baby'

ఎస్ కె యల్ ఎమ్ పిక్చర్స్ పతాకంపై కాండ్రేగుల ఆదినారాయణ నిర్మాతగా, రాంగోపాల్ రత్నం దర్శకత్వంలో కావ్య కీర్తి నటించిన హలో బేబీ చిత్రం ప్రమోషనల్ సాంగ్ ను హీరో నవీన్ చంద్ర లాంచ్ చేశారు. హాల్లో బాయ్స్ లెట్స్ డు పార్టీ అని మొదలుపెట్టిన ఈ పాటను సింగర్ సాయి చరణ్ అద్భుతంగా పాడారు ఈ పాటను రాజేష్ లోక్నాథం రాశారు. హీరో నవీన్ చంద్ర మాట్లాడుతూ సోలో క్యారెక్టర్ లో భారతదేశంలోనే మొట్టమొదటి హాకింగ్ చిత్రం కి ఆల్ ద బెస్ట్. ఇలాంటి చిత్రాలు చేయడానికి నిజంగా సాహసం ఉండాలి. అలాంటి సాహసం చేసిన నిర్మాత కాండ్రేగుల ఆదినారాయణ కు దర్శకుడు రామ్ గోపాల్ రత్నం కు శుభాకాంక్షలు అని అన్నారు. నిర్మాత కాండ్రేగుల ఆదినారాయణ మాట్లాడుతూ సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఏప్రిల్ లో…

అదితితో సిద్దార్థ్‌ రహస్య వివాహం!

Siddharth's secret marriage with Aditi!

కోలీవుడ్‌ హీరో సిద్దార్థ్‌ మళ్లీ పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తుంది. తెలుగు నటి అదితి రావు హైదరీని సిద్దార్థ్‌ వివాహం చేసుకున్నట్లు సమాచారం. వనపర్తి జిల్లాలోని శ్రీరంగపురం ఆలయంలో ఈ పెళ్లి జరుగగా.. ఇరు కుటుంబాలు సహా అత్యంత సన్నిహితులు ఈ వివాహానికి హాజరయినట్లు తెలుస్తుంది. అయితే వనపర్తి సంస్థానాధీశుల వారసుల్లో నటి అదితి రావు హైదరి కూడా ఒకరు అన్న విషయం తెలిసిందే. దీంతో పురోహితులు దగ్గరుండి ఈ పెళ్లి జరిపించినట్లు సమాచారం. అయితే ఈ పెళ్లిపై అటు సిద్దార్థ్‌ కానీ.. ఇటు అదితి రావు హైదరీ కానీ ఎటువంటి ప్రకటన చేయలేదు.

శ్రీనువైట్ల-గోపీచంద్‌ సినిమాకు నిర్మాతల కష్టాలు!

Srinuvaitla-Gopichand movie's producers' difficulties!

చాలా కాలం తరువాత దర్శకుడు శ్రీను వైట్ల మళ్ళీ ఒక సినిమా మొదలెట్టారు. ఈసారి గోపీచంద్‌ తో ప్లాన్‌ చేశారు, వేణు దోనేపూడి అనే నిర్మాత చిత్రాలయం బ్యానర్‌ విూద ఈ సినిమాని గత సంవత్సరం సెప్టెంబర్‌ లో మొదలెట్టారు. షూటింగ్‌ కూడా కొంత అయింది. అయితే ఈ సినిమా షూటింగ్‌ మొదలెట్టిన కొన్ని రోజులకే నిర్మాత వేణు దోనేపూడి చేతులెత్తేసినట్టు పరిశ్రమలో ఒక టాక్‌ నడిచింది. అతనికి తెలిసిన ఇంకో నిర్మాత దగ్గర కొంత డబ్బులు తీసుకొని మరికొన్ని రోజులు షూటింగ్‌ చేసినట్టుగా సమాచారం. అయితే ఆమధ్య ‘భీమా’ ప్రచారాలకు వచ్చిన గోపీచంద్‌ ని తను చేస్తున్న శ్రీను వైట్ల సినిమా గురించి, ఆ సినిమా నిర్మాతలు మారుతున్నారా అన్న ప్రశ్న అడిగితే తనకు తెలియదని దాటవేసారు. ‘నేను శ్రీను వైట్లతో మాట్లాడి చాలా రోజులు…

లండన్‌లో ఇల్లు కొనేసిన ప్రభాస్‌!

Prabhas bought a house in London!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ లండన్ లో ఇల్లు కొన్నాడన్న వార్త ఇప్పుడు జోరుగా వినిపిస్తోంది. ‘కల్కి 2898 ఏడీ’ షూటింగ్‌తో బిజీగా ఉన్నారు ప్రభాస్‌. తాజాగా ఆయనకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. లండన్‌లో విలాసవంతమైన ఇంటిని ఆయన కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. సినిమా షూట్స్‌, వెకేషన్స్‌ కోసం అక్కడికి వెళ్లినప్పుడల్లా అదే ఇంట్లో ఉండేవారని.. రూ.కోటి వరకు అద్దె చెల్లించేవారని సమాచారం. ఆ ఇల్లు బాగా నచ్చడంతో భారీ మొత్తం చెల్లించి సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ‘సలార్‌’తో గతేడాది ప్రేక్షకులను అలరించారు ప్రభాస్‌. ఎపిక్‌ యాక్షన్‌ ఫిల్మ్‌గా ఇది రూపుదిద్దుకుంది. ప్రస్తుతం నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ‘కల్కి 2898 ఏడీ’ కోసం వర్క్‌ చేస్తున్నారు. భారీ బ్జడెట్‌తో సైన్స్‌ ఫిక్షన్‌ మూవీగా ఇది తెరకెక్కుతోంది.…

రామ్‌చరణ్‌ పుట్టిన రోజు.. అన్నదానం చేసిన తల్లి సురేఖ!

Ram Charan's birthday.. Surekha's mother donated!

తన తనయుడు రామ్‌చరణ్‌ పుట్టినరోజు సందర్భంగా సురేఖ భక్తులకు అన్నదానం చేశారు. ‘అత్తమ్మ కిచెన్‌’ సారథ్యంలో 500 మందికి సురేఖ అన్నదానం చేశారు. చినజీయర్‌ స్వామి ఆశీస్సులతో అపోలో ఆస్పత్రిలోని దేవాలయంలో నిర్వహించిన పుష్కరోత్సవంలో పాల్గొన్న భక్తుల కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం’ అని ఇన్‌స్టాలో వీడియో విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పనులను ఆమె దగ్గరుండి చూసుకున్నారు. ఉపాసన, కుటుంబసభ్యులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. మరోవైపు, రామ్‌చరణ్‌ పుట్టినరోజును పురస్కరించుకుని పలువురు విషెస్‌ చెప్పారు. ‘‘ఆస్కార్‌ పురస్కారం పొందిన చిత్రంలో నటించి, గ్లోబల్‌ స్టార్‌ స్థాయికి చేరుకున్న రామ్‌చరణ్‌కు నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. సంపూర్ణ ఆనందం, సుఖ సంతోషాలు అందించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా. దైవ భక్తి మెండుగా ఉన్న చరణ్‌ సానుకూల దృక్పథంతో ఆలోచిస్తాడు. పెద్దల పట్ల గౌరవ మర్యాదలతో ఉంటాడు.…

సూచిరిండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 4న శ్రీనగర్ కాలనీలోని శ్రీ సత్యసాయి నిగమాగమం లో సర్ సివి రామన్ యంగ్ జీనియస్ అవార్డుల ప్రధానం ….

Suchirindia Foundation 31st State Level Science talent search examination, Sir CV Raman Young Genius awards ceremony on April 4th at Sri Satya Sai Nigamagamam, Srinagar Colony.

హైదరాబాద్: ప్రముఖ సామాజిక సేవాసంస్థ సుచిరిండియా ఫౌండేషన్ 31వ సర్ సివి రామన్ టాలెంట్ సెర్చ్ పరీక్షను జాతీయ మరియు రాష్ట్ర స్థాయిలో వివిధ పాఠశాలల్లో నిర్వహించింది. 1500 పాఠశాలల నుండి 1,00,000 మంది విద్యార్థులు పాల్గొన్నారు. దేశ వ్యాప్తంగా మరియు తెలుగు రాష్ట్రాల పరిధిలో నిర్వహించిన 31వ జాతీయ స్థాయి సైన్స్ టాలెంట్ సెర్చ్ పరీక్షల్లో 16 మందికి గోల్డ్ మెడల్స్, 16 మంది ర్యాంకేర్స్ కి మరియు 396 డిస్ట్రిక్ ర్యాంకేర్స్ కి, 8 మంది కి ఛత్రలయా పురస్కార్ అవార్డ్స్, 8 మందికి గురు బ్రహ్మ అవార్డ్స్, రాష్ట్రా స్థాయి మెడల్స్ మరియు జిల్లా స్థాయి ర్యాంక్స్ వచ్చిన యువ టాలెంట్ విద్యార్థులకు శ్రీ సత్యసాయి నిగమాగమం లో అవార్డులు ప్రదానం చేయనున్నారు అని సూచిరిండియా ఫౌండేషన్ నిర్వహకులు లయన్ కిరణ్ తెలిపారు.…

ఆనందం, ఆధ్యాత్మికం కలగలిసిన వేడుక ‘హోలీ’ : శ్రీ సాయినగర్ సౌత్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోషియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా హోలీ వేడుకలు

'Holi', a joyous and spiritual celebration: Grand Holi celebrations under the auspices of Sri Sainagar South Resident Welfare Association

హైదరాబాద్, మార్చి 25 : భాగ్యనగరంలో హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. . హ్యాపీ హోలీ అంటూ యువత సోమవారం తెల్లవారుజాము నుంచే పండుగ సంబరాల్లో పాల్గొన్నారు. కలర్‌ఫుల్ పండుగ వేడుకల్లో హైదరాబాద్ సరికొత్త అందాలను సంతరించుకుంది. ముఖ్యంగా ఈ హోలీ వేడుకలు సోమవారం శ్రీ సాయినగర్ సౌత్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోషియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. శ్రీ సాయినగర్ సౌత్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోషియేషన్ అధ్యక్షుడు బద్దం భాస్కర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి చెరుకు ఉమేష్ గౌడ్, పి.ఎస్.రాము, సర్దా శివకృష్ణ, ఏలే సుధాకర్, రేవంత్ గౌడ్, కృష్ణారెడ్డి, భాస్కర్, రాము గౌడ్, వీరాచారి తదితరులు ఈ హోలీ వేడుకల్లో పాల్గొని కాలనీ వాసులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యంగా హోలీ వేడుకల్లో పాల్గొన్న యువత ఉత్సాహం అంతాఇంతా కాదు. చిన్నా, పెద్దా అందరూ కలిసి హోలీ…