అదితితో సిద్దార్థ్‌ రహస్య వివాహం!

Siddharth's secret marriage with Aditi!
Siddharth's secret marriage with Aditi!
Spread the love

కోలీవుడ్‌ హీరో సిద్దార్థ్‌ మళ్లీ పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తుంది. తెలుగు నటి అదితి రావు హైదరీని సిద్దార్థ్‌ వివాహం చేసుకున్నట్లు సమాచారం. వనపర్తి జిల్లాలోని శ్రీరంగపురం ఆలయంలో ఈ పెళ్లి జరుగగా.. ఇరు కుటుంబాలు సహా అత్యంత సన్నిహితులు ఈ వివాహానికి హాజరయినట్లు తెలుస్తుంది. అయితే వనపర్తి సంస్థానాధీశుల వారసుల్లో నటి అదితి రావు హైదరి కూడా ఒకరు అన్న విషయం తెలిసిందే. దీంతో పురోహితులు దగ్గరుండి ఈ పెళ్లి జరిపించినట్లు సమాచారం. అయితే ఈ పెళ్లిపై అటు సిద్దార్థ్‌ కానీ.. ఇటు అదితి రావు హైదరీ కానీ ఎటువంటి ప్రకటన చేయలేదు.