నితిన్, యేలేటి చిత్ర టైటిల్ ‘చెక్’

Youth Star Nithiin and Chandra Sekhar Yeleti Film Check under Bhavya Creations

నితిన్ హీరోగా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ పతాకంపై వి.ఆనంద ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రానికి ‘చెక్’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఇందులో రకుల్ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ కథానాయికలుగా నటిస్తున్నారు. ‘చెక్’ టైటిల్, ప్రీ లుక్ పోస్టర్‌ని ప్రముఖ దర్శకుడు కొరటాల శివ ఆవిష్కరించారు. ఈసినిమా ఘన విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ చిత్రం గురించి దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి మాట్లాడుతూ.. ‘‘చదరంగం నేపథ్యంలో సాగే ఓ ఉరిశిక్ష పడ్డ ఖైదీ కథ ఇది. ఇందులో నితిన్ అద్భుతంగా చేస్తున్నాడు. ఈసినిమా చిత్రీకరణ చివరి దశలో ఉంది’’ అని చెప్పారు. నిర్మాత వి.ఆనంద ప్రసాద్ మాట్లాడుతూ… ‘‘నితిన్- చంద్రశేఖర్ యేలేటి కాంబినేషన్ లోసినిమా చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాలో ఎవరు ఎవరికి ఎలా చెక్పెడతారనేది చివరి వరకూ తెలియదు.…

అల్లు వారి ‘అల్లు స్టూడియోస్’ ప్రారంభం

Allu Ramalingaiah birth anniversary special Allu Studio Launched

తెలుగు ప్రేక్ష‌కులకు… తెలుగు సినిమా బతికున్నంతకాలం… గుర్తుండిపోయే పేరు పద్మశ్రీ డాక్ట‌ర్‌ అల్లు రామ‌లింగ‌య్య. హాస్యం ఆయ‌న కేరాఫ్ ఆడ్రస్‌, హాస్యానికే ప్రాణం పోసిన బ్ర‌హ్మ ఆయ‌న‌.. అన్ని ర‌సాల్లో హస్యానికి పెద్దపీట వేశారు కాని ఏ పాత్ర‌నైనా అల‌ఓక‌గా చేసి చూపించిన గొప్ప న‌టుడు అల్లు రామ‌లింగ‌య్య. 1000 కి పైగా చిత్రాల్లో నటించి… తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌కి మార్గదర్శకుడయ్యాడు. ఆయ‌న తెర‌పై క‌నిపిస్తే పాత్ర క‌నిపిస్తుందికాని ఆయ‌న క‌నిపించ‌రు. న‌ట‌న‌కి నిలువెత్తు రూపం అల్లు రామ‌లింగ‌య్య అంటే అతిశ‌యోక్తికాదు. తెలుగు సినిమా చరిత్రలో గ‌ర్వించ‌ద‌గ్గ‌ గొప్ప క్లాసిక్స్ లో అల్లు రామ‌లింగ‌య్య పాత్రలు వుండ‌టం విశేషం. హోమియోపతి డాక్ట‌ర్ గా ప‌లు సేవాకార్య‌క్ర‌మాలు అందించారు, త‌రువాత తెలుగు సినీ ప‌రిశ్ర‌మలో న‌టుడుగా ఎంత బిజీగా వున్నా కూడా త‌న వృత్తి హోమియోప‌తిని మాత్రం వ‌ద‌ల్లేదు.…

‘చిత్రపటం’ టాకీ పార్ట్ పూర్తయింది

Chitrapatam Movie Takie Part Completed

కవి ఫిల్మ్ సిటీ సమర్పణలో, శ్రీ క్రియేషన్స్ పతాకంపై పార్వతీశం(నూకరాజు), శ్రీవల్లి హీరోహీరోయిన్లుగా ప్రముఖ దర్శకుడు బండారు దానయ్య కవి దర్శకత్వంలో, పుప్పాల శ్రీధర్ రావు నిర్మిస్తున్న యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘చిత్రపటం’. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ప్రస్తుతం టాకీ పార్టు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు బండారు దానయ్య కవి మాట్లాడుతూ.. ‘‘విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో జరిగే యూత్ & ఫ్యామిలీ సబ్జెక్ట్ ఇది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని అందమైన లోకేషన్లలో చిత్రీకరణ జరిపాం. కోట శ్రీనివాసరావు కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే పోసాని, శరణ్యగారు, నారెన్, బాహుబలి ప్రభాకర్ వంటి సీనియర్ ఆర్టిస్టులందరూ ఈ సినిమాలో నటిస్తున్నారు. ఆద్యంతం ప్రేక్షకులను కట్టిపడేసే అంశాలతో, యూత్‌ని ఆకట్టుకునే సంగీతంతో ఈ చిత్రం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాను. అలాగే…

యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌గా ‘అన్ లిమిటెడ్’

Youthful Entertainer Unlimited Movie shooting details

నార్ల ప్రొడక్షన్ హౌస్ బ్యానర్‌లో ఏషాన్, ఆయిషా కపూర్‌ హీరోహీరోయిన్లుగా అమన్ కుమార్, శ్రద్ధ ద్వివేది, తనూజ్ దీక్షిత్, అనిల్ రాస్తోగి తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘అన్ లిమిటెడ్’. విక్రమ్ వాసుదేవ్ నార్ల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత, దర్శకుడు విక్రమ్ వాసుదేవ్ నార్ల మాట్లాడుతూ.. విమెన్ ఎంపవర్మెంట్‌ని తప్పుదారి పట్టిస్తున్న కొంతమంది వల్ల సమాజానికి జరుగుతున్న చేటుని చెబుతూనే సృష్టికి మూలాధారమైన ఓంకారంలో ఇమిడి ఉన్న అర్ధనారీశ్వర తత్వాన్ని ప్రధాన అంశంగా ‘అతి సర్వత్ర వర్జయేత్’ అన్న ట్యాగ్‌లైన్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాము. నార్ల ప్రొడక్షన్ హౌస్ బ్యానర్‌లో ఏషాన్, ఆయిషా కపూర్‌లని హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తున్నాము. తెలుగు, హిందీ భాషలలో మీడియా బ్యాక్ డ్రాప్‌లో యూత్ ఫుల్ లవ్ స్టోరీగా తెరకెక్కుతుంది ‘అన్…

సినిమా రివ్యూ: ‘వి’

nani and sudheer babu v movie review

నేచురల్ స్టార్ నాని, హీరో సుధీర్ బాబు కలయికలో టాలెంటెడ్ డైరెక్టర్ మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘వి’. అదితి రావ్ హైదరి, నివేదా థామస్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించారు. కాగా తాజాగా ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో తెలుసుకుందామా? ఇదే కథ:కథ గురించి క్లుప్తంగా చెప్పుకుంటే సూపర్ కాప్ డీసీపీ ఆదిత్య (సుధీర్ బాబు) గ్యారెంటీ మెడల్ తో డిపార్ట్మెంట్ లోనే వెరీ సక్సెస్ ఫుల్ ఆఫీసర్ గా పేరుప్రఖ్యాతులు తెచ్చుకుంటాడు. ఈ క్రమంలోనే అపూర్వ (నివేధా) అతని కథ రాయడానికి వచ్చి అతనితో ప్రేమలో పడుతుంది. అంతలో సడెన్ గా…

‘పరిగెత్తు పరిగెత్తు’ చిత్ర ఫస్ట్ లుక్ ఇదే!

parigettu parigettu first look out

ఎన్. ఎస్. సినీ ఫ్లిక్స్ బ్యానర్‌పై సూర్య శ్రీనివాస్‌, అమృత ఆచార్య హీరోహీరోయిన్లుగా రామకృష్ణ తోట దర్శకత్వంలో రూపొందుతున్న సస్పెన్స్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ “పరిగెత్తు పరిగెత్తు” యామినీ కృష్ణ అక్కరాజు నిర్మిస్తున్న ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పుర్తి చేసుకుంది. తాజాగా చిత్ర యూనిట్ ఫస్ట్ లుక్ విడుదల చేసింది. ఈ సందర్భంగా నిర్మాత, యామినీ కృష్ణ అక్కరాజు మాట్లాడుతూ… ‘‘సస్పెన్స్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో అద్భుతమైన కథ, కథనంతో ఈ చిత్రం రూపొందింది. తెలుగు ప్రేక్షకులు కంటెంట్‌ బేస్డ్‌ మూవీస్‌ని ఎప్పుడూ ఆదరిస్తుంటారు. “పరిగెత్తు పరిగెత్తు” చిత్రం కూడా ఆ కోవలోనే ఉంటుంది. సూర్య శ్రీనివాస్‌, అమృత ఆచార్య చాలా బాగా నటించారు. అలాగే మిగతా ఆర్టిస్ట్‌లు, టెక్నీషియన్స్‌ సినిమా బాగా రావడానికి ఎంతగానో సహకరించారు. అలాగే ఎన్నో సూపర్‌హిట్‌ చిత్రాలకు సంగీతాన్ని అందించిన సునీల్‌…

వే టు వాష్ డ్రైక్లీనింగ్ అండ్ వాష్ ప్రారంభం

ఈ బిజీ సమయంలో క్లాత్ వాషింగ్ అనేది అందరికి పెద్ద బర్డెన్‌గానే వుంటుంది. ఈ కరోనా సమయంలో బట్టలశుభ్రత మరింత అవసరం. అయితే మీకు అందుబాటు ధరలో మీ బట్టల శుభ్రత బరువును దించేయాలనుకుంటుది వే టు వాష్ డ్రైక్లీనింగ్ సంస్థ. ఇటీవల మాదాపూర్‌లోని అయ్యప్పసోసైటీలో, హాండ్రెడ్ ఫీట్స్ రోడ్డులో ఈ సంస్థ వే టు వాష్ డ్రైక్లీనింగ్ పేరుతో తొలి ఔట్‌లెట్‌ను ప్రారంభించింది. వేటు వాష్ యాప్ డౌన్ లోడ్ చేసుకుంటే ఉచిత పికప్ అండ్ డ్రాప్‌తో సర్వీసులు అందిస్తున్నామని, పూర్తి హైజీనిక్‌తో.. ఎంతో నాణ్యమైన సేవలను ఇస్తున్నామని సంస్థ నిర్వాహకులు గరగ సోమన్న, వెంకటసత్యనారాయణ గొల్ల తెలిపారు. త్వరలోనే జంటనగరాల్లో తమ ఔట్‌లెట్‌లు విస్తరిస్తున్నట్లుగా వారు తెలిపారు.

గాన గంధర్వుడు బాలు కన్నుమూత

Gaana Gandharva SP Balasubrahmaniam no More

గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం(74) చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు గురువారం ప్రకటించిన ఎంజీఎం వైద్యులు.. ఆయన తుది శ్వాస విడిచినట్లు శుక్రవారం వెల్లడించారు. శుక్రవారం మధ్యాహ్నం 1.04 నిమిషాలకు ఎస్పీ బాలు తుది శ్వాస విడిచినట్లు వైద్యులు ప్రకటించారు. కరోనాతో ఆసుపత్రిలో చేరిన ఎస్పీబీ ఇటీవల కరోనా నుంచి కోలుకున్నారు. అయితే.. ఇతర అనారోగ్య కారణాలు తిరగబెట్టడంతో ఆరోగ్యం మరింత క్షీణించింది. ఆగస్ట్ 5న ఆయన చెన్నైలోని ఎంజీఎం హెల్త్‌‌కేర్‌లో చేరారు. ఎస్పీ బాలసుబ్రమణ్యం 1946 జూన్‌ 4న నెల్లూరులోని కోనేటమ్మపేటలో జన్మించారు. ఆయన పూర్తి పేరు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం. ఆయన తండ్రి పేరు శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తి. తల్లి పేరు శకుంతలమ్మ. బాలు జీవిత భాగస్వామి పేరు సావిత్రి. బాలు…

ఫస్ట్ షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న ‘బ్యూటీ గర్ల్’

beauty girl movie

లక్ష్మీ నారాయణ సినిమా పతాకంపై అల్తాఫ్, అర్చనా గౌతమ్ హీరోహీరోయిన్లుగా.. వేముగంటి దర్శకత్వంలో ప్రముఖ షోలాపూర్ డిస్ట్రిబ్యూటర్ దేవదాస్ నారాయణ నిర్మిస్తోన్న చిత్రం ‘బ్యూటీ గర్ల్’. ఈ చిత్రం ప్రభుత్వ నియమ నిబంధనలు పాటిస్తూ.. షూటింగ్ జరుపుకుని ఫస్ట్ షెడ్యూల్‌ని పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ మీడియాకు చిత్ర విశేషాలను తెలిపింది. ఈ కార్యక్రమంలో చిత్ర నిర్మాత దేవదాస్ నారాయణ మాట్లాడుతూ.. ‘‘షోలాపూర్‌లో నార్త్ ఇండియా డిస్ట్రిబ్యూటర్‌గా 400కి పైగా పెద్ద సినిమాలు రిలీజ్ చేశాను. ఆ అనుభవంతో ఈ ‘బ్యూటీ గర్ల్’ సినిమాను నిర్మిస్తున్నాను. మా డైరెక్టర్ వేముగారి దర్శకత్వంలో ఈ సినిమా అద్భుతంగా రాబోతుంది. అన్ని కమర్షియల్ అంశాలు ఈ చిత్రంలో ఉండబోతున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ.. షూటింగ్ చేస్తున్నాము. ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. త్వరలోనే రెండో…

‘మెరిసే మెరిసే’ చిత్ర టైటిల్ లుక్ వచ్చేసింది

tharun bhascker unveils merise merise title poster

కొత్తూరి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మాత వెంకటేష్ కొత్తూరి నిర్మిస్తోన్న ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రం ‘మెరిసే మెరిసే’. ఈ చిత్రంలో హుషారు ఫేమ్ దినేష్ తేజ్ హీరోగా నటిస్తుండగా శ్వేతా అవస్తీ హీరోయిన్‌గా నటిస్తోంది. కామెడీ, లవ్, ఎమోషన్స్‌తో కూడిన ఈ చిత్రం టైటిల్ ఫస్ట్ లుక్‌ను ప్రముఖ దర్శకుడు తరుణ్ భాస్కర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు పవన్ కుమార్.కె మాట్లాడుతూ… ప్రస్తుతం మెరిసే మెరిసే చిత్రం డిఐ వర్క్స్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరుగుతున్నాయి. ఇటీవల విడుదలైన మా సినిమా థీమ్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ లభించింది. మా మూవీ ఫస్ట్ లుక్‌ను దర్శకుడు తరుణ్ భాస్కర్ విడుదల చెయ్యడం సంతోషంగా ఉంది. హీరో దినేష్, హీరోయిన్ శ్వేతా అవస్తి బాగా నటించారు. రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన మా సినిమా ఫీల్ గుడ్ ఎంటర్టైనర్‌గా…