మాస్ మహారాజా రవితేజ, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో రూపొందుతోన్న మూడో చిత్రం ‘క్రాక్’ షూటింగ్ ముగింపు దశలో ఉంది. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో చివరి షెడ్యూల్ జరుగుతోంది. ప్రత్యేకంగా వేసిన ఒక సెట్లో ప్రస్తుతం రవితేజ, అప్సరా రాణిలపై ఒక ఐటమ్ సాంగ్ చిత్రీకరిస్తున్నారు. ఎస్. తమన్ స్వరాలు కూర్చిన ఈ మాస్ సాంగ్‌ను రామజోగయ్య శాస్త్రి రాశారు. ఈ సాంగ్‌కు జాని మాస్టర్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో జరిగిన కొన్ని యథార్థ ఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. పేరుపొందిన తమిళ నటులు సముద్రకని, వరలక్ష్మీ శరత్‌కుమార్ పవర్‌ఫుల్ క్యారెక్టర్లు పోషిస్తున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొనే అంశాలతో, ఉద్వేగభరితమైన కథ, కథనాలతో సరస్వతి ఫిలిమ్స్ డివిజన్ బ్యానర్‌పై బి. మధు ‘క్రాక్’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.…
Author: M.D ABDUL
ఆనంద సాయికి పవన్ అభినందనలు
యాదాద్రి ఆలయ ముఖ్య ఆర్కిటెక్ట్, ప్రముఖ కళా దర్శకుడు ఆనంద సాయి ఇటీవలే ‘ధార్మికరత్న’ పురస్కారం అందుకున్నారు. ఈ పురస్కారం స్వీకరించిన క్రమంలో జనసేన అధ్యక్షుడు, సినీ హీరో పవన్ కల్యాణ్ శుక్రవారం సాయంత్రం ఆనంద సాయిని అభినందించారు. హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో ఆనంద సాయిని శాలువాతో సత్కరించి.. లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయ నిర్మాణంలో ఎంతో నిష్టతో పాలుపంచుకోవడం ప్రశంసనీయం అన్నారు. ఆలయ నిర్మాణం, సంబంధిత వాస్తు అంశాలపై ఎంతో పరిశోధన చేసిన ఆయనకు ధార్మికరత్న పురస్కారం దక్కడం సముచితం అని చెప్పారు. నటుడు నర్రా శ్రీను ఈ సత్కారంలో పాల్గొని అభినందనలు తెలియచేశారు. శ్రీ శాంతికృష్ణ సేవా సమితి ఇటీవల హైదరాబాద్‌లోని బిర్లా ఆడిటోరియమ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి చేతుల మీదుగా ఆనంద సాయి…
మంచు విష్ణుకి విక్టరీ వెంకటేష్ హెల్ప్
ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో విష్ణు మంచు నటిస్తోన్న హై ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్ ‘మోసగాళ్లు’ ఒకటి. ఇది తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో ఏక కాలంలో నిర్మాణమవుతున్న క్రాస్-ఓవర్ ఫిల్మ్. అలాగే తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లోనూ విడుదల కానున్నది. ‘మోసగాళ్లు’ చిత్రాన్ని నిర్మిస్తోన్న విష్ణు మంచు ఇదివరకెన్నడూ లేని విధంగా దాన్ని ప్రమోట్ చేస్తున్నారు. ఇటీవల అల్లు అర్జున్ రిలీజ్ చేసిన టీజర్‌కు అద్వితీయమైన రెస్పాన్స్ వచ్చింది. కాగా ఆసక్తికరమైన అప్‌డేట్ ఏమంటే.. ఇదివరకు ‘మోసగాళ్లు’ టైటిల్ కీ థీమ్ మ్యూజిక్‌ను రిలీజ్ చేసిన విక్టరీ వెంకటేష్, ఇప్పుడు తన వాయిస్ ఓవర్‌ను ఈ చిత్రానికి అందిస్తుండటం విశేషం. ఈ సినిమా స్టోరీని ప్రారంభం నుంచి ముగింపు దాకా ఆయన నెరేట్ చేయనున్నారు. టీజర్ రిలీజ్ అయినప్పట్నుంచీ ఇండస్ట్రీ వర్గాల్లో, ప్రేక్షకుల్లో మంచి…
నాగశౌర్య హీరోగా ఐరా క్రియేషన్స్ 4వ ఫిల్మ్
హ్యాండ్సమ్ హీరో నాగశౌర్య, టాలెంటెడ్ డైరెక్టర్ అనీష్ కృష్ణ కాంబినేషన్‌లో ప్రొడక్షన్ నంబర్ 4గా ఒక రొమాంటిక్ కామెడీ ఫిల్మ్‌ను నిర్మించేందుకు ఐరా క్రియేషన్స్ సన్నాహాలు ప్రారంభించింది. శుక్రవారం సోషల్ మీడియాలో కాన్సెప్ట్ పోస్టర్‌ను రిలీజ్ చేయడం ద్వారా అఫిషియల్‌గా ఆ మూవీని ప్రకటించారు. ఉష ముల్పూరి నిర్మిస్తున్న ఈ సినిమా ఆహ్లాదకరమైన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందనుంది. డైరెక్టర్ అనీష్ కృష్ణకు ఇది మూడో సినిమా. ఈ చిత్రానికి మహతి స్వరసాగర్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇదివరకు నాగశౌర్య సూపర్ హిట్ ఫిల్మ్ ‘ఛలో’కు ఆయన బ్లాక్‌బస్టర్ మ్యూజిక్ అందించారు. ఆ సినిమాలోని ‘చూసీ చూడంగానే..’ సాంగ్ ఎంత పాపులర్ అయ్యిందో మనకు తెలుసు. షూటింగ్‌కు సన్నాహాలు జరుగుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలు త్వరలోనే వెల్లడి చేయనున్నారు. సాంకేతిక బృందం:డైరెక్టర్: అనీష్ కృష్ణనిర్మాత: ఉష ముల్పూరిసమర్పణ:…
‘నిశ్శబ్దం’.. హిట్టు బొమ్మ!
స్వీటీ అనుష్క, మాధవన్, మైఖేల్, అంజలి, షాలిని పాండే, సుబ్బరాజ్ వంటి వారు నటించిన చిత్రం ‘నిశ్శబ్దం’. దర్శకుడు హేమంత్ మధుకర్ రూపొందించిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రం చిత్రీకరణ ఎప్పుడో జరుపుకున్నప్పటికీ.. థియేటర్స్‌లోకి వచ్చే టైమ్‌కి కరోనా రూపంలో థియేటర్లు మూతపడ్డాయి. ఆ తర్వాత థియేటర్స్ కోసం కొంతకాలం వెయిట్ చేసినా.. సరైన క్లారిటీ లేకపోవడంతో అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ద్వారా ఈ చిత్రం గాంధీ జయంతి రోజు విడుదలైంది. అయితే విడుదలైన తర్వాత కాస్త నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ.. ఓవరాల్‌గా ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వారికి లాభసాటి ప్రాజెక్ట్‌గా నిలిచిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ వారు విడుదల చేసే సమయానికి మార్కెట్‌లో సరైన సినిమా లేకపోవడంతో.. అందరూ ఈ…
జీవితకాలం మూవీస్ తీస్తూనే ఉంటా: క్రిష్
రియల్ ఎస్టేట్ రంగంలో ఎంతోమందికి ఉపాధి కల్పించి వ్యాపారవేత్తగా మంచి పేరు ప్రఖ్యాతలు సాధించి ఇప్పుడు సినీ రంగంలోకి రావణలంక చిత్రంతో హీరోగా నిర్మాతగా అడుగు పెడుతున్నారు. ఈ చిత్రాన్ని బి.ఎన్. ఎస్. రాజు దర్శకత్వం వహించారు. కె.సిరీస్ అని సొంత బ్యానర్‌లో ఈ చిత్రాన్ని నిర్మించారు. 16.10.20 ఆయన పుట్టినరోజు సందర్భంగా ఫిల్మ్‌ఛాంబర్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ… ముందుగా ఆయన పుట్టినరోజు సందర్భంగా క్రిష్‌గారికి శుభాకాంక్షలు అన్నారు. ఇలాంటి మంచి చిత్రాల్ని అందరూ తప్పకుండా ఎంకరేజ్ చేయాలి. ఒకప్పుడు తెలంగాణలో గొప్ప హీరోగా పేరు తెచ్చుకుని దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత ఆయన్ని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుని సినిమాలు చేయాలి అన్నారు. సినిమాపై ఎంతో ఆశక్తితో ఆయన స్వయంగా సినిమాని నిర్మించాలని ముందుకు రావడం చాలా గ్రేట్…
‘సోలో బ్రతుకే సో బెటర్’ సాంగ్ వదిలిన చిరు
సుప్రీమ్ హీరో సాయితేజ్ హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్.ఎల్.పి బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తోన్న చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్’. సుబ్బు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నభా నటేశ్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా నుండి ‘అమృత… ’ అనే సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. సాయితేజ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సాంగ్ విడుదలైంది. మెగాస్టార్ చిరంజీవి ఈ సాంగ్‌ను ట్విట్టర్‌లో విడుదల చేస్తూ సాయితేజ్‌కు పుట్టినరోజు అభినందనలు తెలిపారు. ‘ఇదే నా బెస్ట్ బర్త్‌డే గిఫ్ట్. ఈ బర్త్‌డేను స్పెషల్ బర్త్‌డే చేసిన మామయ్యకు థాంక్స్. మీ ఆశీర్వాదాలకంటే నాకింకేం అక్కర్లేదు. థాంక్యూ సోమచ్ మామయ్య’ అంటూ సాయితేజ్ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. మ్యూజిక్ సెన్సేషన్ ఎస్.ఎస్.తమన్ సంగీత…
‘బ్లాక్డ్’ మూవీ ఫస్ట్‌లుక్ విడుదల
మనోజి నందం, శ్వేత సాలూరు హీరోహీరోయిన్లుగా థ్యాంక్యూ ఇన్‌ఫ్రా టాకీస్ పతాకంపై రామ్ లొడగల దర్శకత్వంలో పద్మలెంక నిర్మిస్తున్న రొమాంటిక్ థ్రిల్లర్ ‘బ్లాక్డ్’. ప్రదీప్ చంద్ర సంగీతం అందిస్తున్న ఈ చిత్రం పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుని విడుదలకి సిద్దంగా ఉంది. ‘బ్లాక్డ్’ మూవీ ఫస్ట్‌లుక్ టైటిల్ లోగోని ఈ రోజు విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ సందర్భంగా… దర్శకుడు రామ్ లొడగల మాట్లాడుతూ – “బ్లాక్డ్ మూవీ ఫస్ట్‌లుక్ టైటిల్ లోగోని రిలీజ్ చేయడం హ్యాపీగా ఉంది. థ్రిల్లింగ్ అంశాలు ఉంటూనే హర్రర్, కామెడీ జోనర్‌లో అందరినీ ఆకట్టుకునే విధంగా ఈ మూవీ తెరకెక్కింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. విడుదలకి సిద్ధంగా ఉంది. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ సహకారంతో మూవీ ఔట్‌పుట్ చాలా బాగా వచ్చింది. అలాగే మా నిర్మాత పద్మలెంక గారు ఎక్కడా…
రేణు దేశాయ్ రీ ఎంట్రీ ఇస్తున్న చిత్రమిదే
రేణు దేశాయ్ ప్రధాన పాత్రలో పాన్ ఇండియా చిత్రం ఆద్య ఒక పవర్ ఫుల్ లేడి ఓరియంటెడ్ పాన్ ఇండియా చిత్రంతో తన సెకండ్ ఇన్నింగ్స్ కి శ్రీకారం చుడుతున్నారు రేణు దేశాయ్. డి.ఎస్.కె.స్క్రీన్-సాయికృష్ణ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై రావ్.డి.ఎస్- రజనీకాంత్.ఎస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక భారీ బడ్జెట్ చిత్రం తో యువ ప్రతిభాశాలి ఎం.ఆర్.కృష్ణ మామిడాల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ‘కబాలి’ ఫేమ్ సాయి ధన్సిక, నందిని రాయ్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రంలో బాలీవుడ్ హీరో ‘వైభవ్ తత్వవాడి’ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. ‘హుషారు’ ఫేమ్ తేజ కురపాటి- గీతిక రతన్ యువ జంటగా నటించే ‘ఆద్య’ విజయదశమి రోజు ఆరంభం కానుంది. రేణు దేశాయ్ రీ ఎంట్రీ ఇస్తున్న ఈ చిత్రం జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించేలా అన్ని జాగ్రత్తలు…
రివ్యూ: ‘నిశ్శబ్దం’
చిత్రం: ‘నిశ్శబ్దం’విడుదల: అమెజాన్ ప్రైమ్ (అక్టోబర్-02/2020)నటీనటులు: అనుష్క, మాధవన్, అంజలి, షాలినిపాండే, సుబ్బరాజ్, మైకేల్ మ్యాడ్‌సేన్, అవసరాల శ్రీనివాస్ తదితరులుడైరెక్టర్: హేమంత్ మధుకర్‌సంగీతం: గోపీ సుందర్‌నిర్మాత: టీజీ విశ్వప్రసాద్‌కో-ప్రోడ్యూసర్: వివేక్ కూచిబొట్లబ్యానర్స్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీస్క్రీన్‌ప్లే, డైలాగ్స్: కోన వెంకట్ఎడిటింగ్: ప‌్రవీణ్ పూడి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి లేడి ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అనే విషయం అందరికీ తెలిసిందే. ‘అరుంధతి’ ‘బాహుబలి’, ‘భాగమతి’ చిత్రాలతో తన రేంజ్ ఏంటో చాటి చెప్పుకుంది. అనుష్క ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘నిశ్శబ్దం’. ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మించారు. చాలా రోజుల తర్వాత మాధవన్ ఈ మూవీలో నటించగా.. అంజలి, మైఖేల్ మాడ్సన్, షాలిని పాండే, సుబ్బరాజు విభిన్న పాత్రల్లో నటించారు. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేస్తున్న తరుణంలో సినిమా…
