శ్రీకల ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై బ్లాక్ స్టూడియోస్ సమర్పణలో యాదగిరి రాజు నిర్మిస్తున్న చిత్రం లింగొచ్చా. ఈ సినిమాతో ఆనంద్ బడా దర్శకునిగా చిత్ర సీమకు పరిచయం అవుతున్నారు. కెరాఫ్ కంచెర పాలెం ఫేమ్ కార్తీక్ రాజు ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. కార్తీక్‌కి జోడిగా సుప్యార్దే సింగ్ నటిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అటు ఇండస్ట్రీ వర్గాల్లో ఇటు ఆడియెన్స్‌లో లింగొచ్చా అనే టైటిల్‌కి అనూహ్య స్పందన రావడం చాలా ఆనందంగా ఉందని, ఈ నేపథ్యంలోనే చిత్ర టీజర్‌ను దసరా కానుకగా అక్టోబర్ 23న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత యాదగిరి రాజు, దర్శకుడు ఆనంద్ బడా తెలిపారు. ఈ సినిమాకు సంగీతాన్ని బికాజ్ రాజ్ అందిస్తున్నారు. నటీనటలు:కార్తీక్ రత్నమ్, సుప్యార్దే సింగ్, బెబీ ఫిదా మొగల్, మాస్టర్ ప్రేమ్ సుమన్,…
Author: M.D ABDUL
‘ఖిలాడి’గా మాస్ మహరాజా
మాస్ మహారాజా రవితేజ హీరోగా, డైరెక్టర్ రమేష్ వర్మ రూపొందించే యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఖిలాడి’ నిర్మాణ సంస్థ కార్యాలయంలో లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి హీరో హవీష్ క్లాప్ కొట్టగా, ఐ. శ్రీనివాసరాజు కెమెరా స్విచ్చాన్ చేశారు. ఆదివారం ఉదయమే విడుదల చేసిన ‘ఖిలాడి’ ఫస్ట్ లుక్ పోస్టర్‌కు అన్నివైపుల నుంచీ అనూహ్యమైన రెస్పాన్స్ లభించింది. టోటల్ బ్లాక్ డ్రస్‌లో తనదైన స్టైల్ డాన్స్ మూవ్‌తో ఈ పోస్టర్‌లో రవితేజ ఆకట్టుకుంటున్నారు. ‘ప్లే స్మార్ట్’ అనేది ఈ సినిమా ట్యాగ్‌లైన్. రవితేజ డబుల్ రోల్ చేస్తున్న ఈ సినిమాని సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్నారు. ఏ స్టూడియోస్‌తో కలిసి బాలీవుడ్ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ ఈ సినిమాను నిర్మిస్తోంది. హవీష్ ప్రొడక్షన్‌లో రూపుదిద్దుకుంటున్న ‘ఖిలాడి’ మూవీకి డాక్టర్ జయంతీలాల్ గడ (పెన్) సమర్పకునిగా వ్యవహరిస్తున్నారు. రవితేజ సరసన…
రంగ్‌దే.. కీర్తిసురేష్ లుక్ చూశారా..
‘ప్రేమ’తో కూడిన కుటుంబ కధా చిత్రం ‘రంగ్ దే’. ఈరోజు చిత్ర కధానాయిక ‘కీర్తిసురేష్’ పుట్టినరోజు సంధర్భంగా ‘రంగ్ దే’ లోని ఓ చిత్రాన్ని విడుదల చేసింది చిత్రం యూనిట్. చిరునవ్వు లొలికిస్తూ ముగ్ధ మోహన రూపంతో కూడిన నాయిక చిత్రం ఆకట్టుకుంటుంది.ఇటీవలే కొద్ది విరామం అనంతరం చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభమై నితిన్‌తో పాటు ఇతర ప్రధాన తారాగణం పాల్గొనగా సన్నివేశాల చిత్రీకరణ పూర్తిచేసుకుంది. షూటింగ్‌కు సంబంధించి సేఫ్టీ మెజర్స్ పాటిస్తూ పూర్తి జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ నెల చివరి వారంలో చిత్రానికి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలు, ‘ఇటలీ’లో పాటల చిత్రీకరణతో కొద్దిరోజులలోనే చిత్రం షూటింగ్ పూర్తవుతుంది. 2021 సంక్రాంతి కానుకగా చిత్రం విడుదల అవుతుంది. యువ కథానాయకుడు ‘నితిన్’, మహానటి ‘కీర్తి సురేష్’ల తొలి కాంబినేషన్‌లో ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ…
ప్రభాస్ ఫ్యాన్స్ కోసం బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్
“రెబల్ స్టార్” ప్రభాస్ హీరోగా గోపికృష్ణ మూవీస్, యూవి క్రియేషన్స్, డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘రాధేశ్యామ్’. బాహుబలి1, బాహుబలి2, సాహో వంటి పాన్ ఇండియా చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్‌ని సొంతం చేసుకున్న “రెబల్‌స్టార్” ప్రభాస్ తన 20 వ చిత్రాన్ని జిల్ చిత్ర దర్శకుడు రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. “రెబల్‌స్టార్” ప్రభాస్ సరసన బుట్టబొమ్మ పూజాహెగ్డే నటిస్తుంది. ఈ చిత్రాన్ని “రెబల్‌స్టార్” కృష్ణంరాజు గారు సమర్పించగా, వంశీ, ప్రమోద్, ప్రశీదలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఎన్నో సూపర్‌హిట్స్ అందించిన ప్రముఖ నిర్మాణ సంస్థలు గోపికృష్ణ మూవీస్, యూవి క్రియెషన్స్ బ్యానర్స్ పై నిర్మిస్తున్నారు. ఇటీవలే విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌కి విశేష స్పందన లభించింది. ఈ నేపథ్యంలో నవరాత్రులు అలానే అక్టోబర్ 23న రెబల్ స్టార్…
రవితేజ 67వ చిత్ర ప్రీ లుక్ వచ్చేస్తోంది
మాస్ మహారాజా రవితేజ, ‘రాక్షసుడు’ లాంటి బ్లాక్‌బస్టర్ అందించిన డైరెక్టర్ రమేష్ వర్మ కాంబినేషన్‌లో ఓ యాక్షన్ థ్రిల్లర్‌ను నిర్మించేందుకు ప్రముఖ నిర్మాత సత్యనారాయణ కోనేరు సిద్ధమవుతున్నారు. ఏ స్టూడియోస్‌తో కలిసి బాలీవుడ్ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ‘ఆర్‌టి67’ (రవితేజ 67వ చిత్రం) ప్రీ లుక్ పోస్టర్‌ను శనివారం విడుదల చేశారు. ఇందులో స్టైలిష్ డాన్స్ చేస్తున్నట్లున్న రవితేజ షాడో ఇమేజ్‌ను మనం చూడొచ్చు. ఈ హవీష్ ప్రొడక్షన్ మూవీ ముహూర్తం వేడుక ఆదివారం జరగనున్నది. అదేరోజు ఉదయం 11:55 గంటలకు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేయనున్నారు. రవితేజ సరసన మీనాక్షి చౌధరి నాయికగా నటించే ఈ చిత్రంలో డింపుల్ హయతి సెకండ్ హీరోయిన్‌గా ఎంపికయ్యారు. తారాగణం:రవితేజ, మీనాక్షి చౌధరి, డింపుల్ హయతి సాంకేతిక బృందం:దర్శకుడు: రమేష్ వర్మనిర్మాత: సత్యనారాయణ…
కీర్తి సురేష్‌కు మిస్ ఇండియా టీమ్ విశెష్
‘మహానటి’ సినిమాలో తన అద్భుతమైన నటనతో జాతీయ గుర్తింపును సంపాదించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు కీర్తి సురేష్. చక్కటి రూపం, హావభావాలు కీర్తి సొంతం. ఏ పాత్ర చేసినా ఆ పాత్రలో ఒదిగిపోతూ తన నటనతో పాత్రకు ప్రాణం పోసే కీర్తి సురేష్ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘మిస్ ఇండియా’. శనివారం(అక్టోబర్ 17) కీర్తిసురేష్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందిస్తోంది ‘మిస్ ఇండియా’ యూనిట్. మహానటి తర్వాత కీర్తిసురేష్ నటించిన తెలుగు చిత్రం ‘మిస్ ఇండియా’. నరేంద్రనాథ్ దర్శకత్వంలో ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్ పతాకంపై మహేష్ కోనేరు సినిమాను నిర్మిస్తున్నారు. తమన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. కీర్తిసురేష్ నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్ మూవీస్‌లో హై బడ్జెట్‌తో రూపొందించిన చిత్రమిది. ఇప్పటికే విడుదలైన పాట, టీజర్ సినిమాపై అంచనాలను పెంచింది. ఈ సినిమా…
హైదరాబాద్‌లో నితిన్ మూవీ షూటింగ్
యూత్ స్టార్ నితిన్, క్రియేటివ్ డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి కాంబినేషన్లో భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనందప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం ‘చెక్’. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ కథానాయికలు. ఈ చిత్రం తాజా షెడ్యూల్ ఈనెల 10 నుండి హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ సందర్భంగా నిర్మాత వి. ఆనందప్రసాద్ మాట్లాడుతూ… “చెక్ టైటిల్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. నటుడిగా నితిన్ స్థాయిని పెంచే చిత్రమిది. దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి చదరంగం నేపథ్యంలో చాలా విభిన్నంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. నితిన్, రకుల్ ప్రీత్ సింగ్, సాయి చంద్, సంపత్ రాజ్ తదితరులపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాం. నవంబర్ 5 వరకు ఈ షెడ్యూల్ కొనసాగుతుంది, దాంతో దాదాపుగా సినిమా చిత్రీకరణ పూర్తవుతుంది.” అని తెలిపారు. పోసాని కృష్ణ…
పూరి మ్యూజింగ్స్ టాపిక్: ఈ-మెయిల్స్
భోగన్ మూవీ సింధూర సాంగ్
‘బోగన్’ తొలి గీతం ‘సింధూర’ విడుదల
జయం రవి, అరవింద్ స్వామి కాంబినేషన్‌తో తెరకెక్కి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ‘బోగన్’ చిత్రాన్ని అదే పేరుతో ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్మెంట్స్ పతాకం పై ప్రముఖ నిర్మాత రామ్ తాళ్లూరి తెలుగు ప్రేక్షకులకి అందిస్తున్నారు. ఇటీవలే విడుదలైన బోగన్ తెలుగు వెర్షన్ ట్రైలర్ కు అనూహ్య స్పందన లభించిన నేపథ్యంలో ఈ చిత్రం ఆడియో నుంచి సింధూర అనే పాటను విడుదల చేశారు యూనిట్ సభ్యులు. తమిళ సెన్సేషన్ మ్యూజిక్ డైరెక్టర్ ఇమామ్ ట్యూన్ చేసిన ఈ పాటను తెలుగులో సమీర భరధ్వాజ్ ఆలపించారు. అలానే భువనచంద్ర ఈ పాటకు లిరిక్స్ అందించారు. ఈ సందర్భంగా నిర్మాత రామ్ తాళ్లూరి మాట్లాడుతూ మా బ్యానర్ నుంచి బోగన్ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నామని ప్రకటన వచ్చినప్పటి నుంచి అటు ప్రేక్షకుల నుంచి ఇటు ఇండస్ట్రీ వర్గాల…
