ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ నూతన చిత్రం కాన్సెప్ట్ పోస్టర్‌ విడుదల

Attitude Star Chandrahas' new film concept poster released
Spread the love

ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ మొదటి చిత్రంలోనే తన నటనతో అందరినీ ఆకట్టుకున్నారు. ఇక ఇప్పుడు ‘బరాబర్ ప్రేమిస్తా’ అంటూ ఆడియెన్స్‌ను మరోసారి మెప్పించేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే వదిలిన పోస్టర్లు, గ్లింప్స్, పాటలు ఆడియెన్స్‌లో మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి. ఇక ఇప్పుడు చంద్రహాస్ నూతన చిత్రానికి సంబంధించిన అప్డేట్ వచ్చింది. ఈ మేరకు సందీప్ కిషన్ ఈ కొత్త చిత్రానికి సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ కాన్సెప్ట్ పోస్టర్ చూస్తుంటే ఇదేదో రెగ్యులర్ కమర్షియల్ చిత్రంలా కనిపించడం లేదు. ఈ కథలో దేశ భక్తికి సంబంధించిన అంశాల్ని కూడా జోడించినట్టుగా అనిపిస్తోంది. ఐదు రూపాయల బిళ్ల, వాటి చుట్టూ ఉన్న బుల్లెట్లు, పోస్టర్‌ను డిజైన్ చేసిన తీరు చూస్తుంటే మంచి పవర్ ఫుల్ స్టోరీతోనే సినిమా రాబోతోందని అర్థం అవుతోంది. జైరామ్ చిటికెల ఈ మూవీకి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వ బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారు. ఈ చిత్రాన్ని పివికె ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. చంద్రహాస్ బర్త్ డే సందర్భంగా సెప్టెంబర్ 17న ఈ మూవీకి సంబంధించిన టైటిల్, గ్లింప్స్‌ను రిలీజ్ చేయబోతోన్నారు.

Related posts

Leave a Comment