‘ఇస్మార్ట్ శంకర్’ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని నటించిన ‘రెడ్’, ‘ది వారియర్’, ‘స్కంద’, ‘డబుల్ ఇస్మార్ట్’ వంటి చిత్రాలు వరుసగా డిజాస్టర్ అవుతూ వచ్చాయి. మాస్ సినిమాలు ఎందుకో రామ్ కి ఈ మధ్య అసలు కలిసి రావడం లేదు. ఆయన మార్కెట్ పూర్తిగా ప్రమాదంలో పడిపోయింది. గతంలో కూడా ఇంతే, వరుసగా డిజాస్టర్ ఫ్లాప్ సినిమాలు పడుతున్న సమయంలో ‘నేను శైలజ’ వంటి కూల్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నాడు. ఇప్పుడు కూడా రామ్ అదే ఫార్ములా ని అనుసరించాడు. ‘మిస్ శెట్టి..మిస్టర్ పోలిశెట్టి’ లాంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత ఆ చిత్ర దర్శకుడు మహేష్ బాబు రామ్ తో ‘ ఆంధ్రా కింగ్ తాలూకా’ చేసాడు. హీరో రామ్ హిట్టు కొట్టి దాదాపు ఆరేళ్లు కావస్తోంది. ‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత వరుసగా మాస్ యాక్షన్ సినిమాలు చేసి కెరీర్ లో వెనక్కి వెళ్లిన రామ్ ‘ఆంధ్రా కింగ్ తాలూకా’తో మళ్లీ తన జోనర్ క్లాస్ టచ్‌లోకి వచ్చాడు. ‘ ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే కథానాయిక. కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించాడు. అలాగే రావు రమేష్, మురళీ శర్మ, రాజీవ్ కనకాలు, తులసి, సింధు తులానీ, రాహుల్ రామకృష్ణ, సత్య, వీటీవీ గణేష్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం (నవంబర్ 27) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రామ్ పోతినేనితో పాటు వరుసగా మూడు పరాజయాలు చవిచూసిన హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే కూడా ‘ఆంధ్రా కింగ్ తాలూకా’పై భారీ ఆశలే పెట్టుకుంది. మరి ఈ ఇద్దరూ కోరుకునే సక్సెస్‌ని ఈ ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ ఇచ్చిందా? లేదా? ఈ సినిమాతో రామ్ పోతినేనికి కమ్‌బ్యాక్ హిట్ దక్కిందా? లేదా? సమీక్షలో తెలుసుకుందాం..
కథ: ‘ఆంధ్రా కింగ్’గా పిలుచుకునే హీరో సూర్యకుమార్ (ఉపేంద్ర) అనే స్టార్ హీరో చుట్టూ కథ తిరుగుతుంది. టెక్నాలజీ, సోషల్ మీడియా ఇంకా విస్తరించని 2002లో జరిగే కథ ఇది. ఒక రోజు సూర్యకు ఓ పెద్ద సమస్య ఎదురవుతుంది. తన స్థాయి హీరో అయినప్పటికీ, ఆ సమస్యను పరిష్కరించడానికి అతను ఎంత ప్రయత్నించినా విఫలమవుతాడు. సరిగ్గా అదే సమయంలో సూర్యకు వీరాభిమాని అయిన సాగర్ (రామ్ పోతినేని) రంగంలోకి దిగి ఆ సమస్యను పరిష్కరించడంలో సహాయపడతాడు. మరోవేపు సాగర్.. థియేటర్ ఓనర్ కూతురు మహా లక్ష్మీ (భాగ్యశ్రీ బోర్సే)ని ప్రేమిస్తాడు. అయితే మహాలక్ష్మీ తండ్రి (మురళీ శర్మ), సాగర్ని, అతన్ని పిచ్చి అభిమానాన్ని చాలా చులకనగా మాట్లాడతాడు. ఇదే సమయంలో సాగర్ జీవితంలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటాయి. తన అభిమాన హీరో సూర్యకుమార్‌ని కలుసుకోవాలని సాగర్ ఎందుకు అనుకున్నాడు? సాగర్‌కి వచ్చిన కష్టం ఏంటి? అతని ప్రేమ కథ, సక్సెస్ అయ్యిందా? సాగర్, సూర్యకుమార్‌ని కలుసుకోగలిగాడా? అసలు హీరోనే పరిష్కరించలేని ఆ సమస్య ఏమిటి? సాగర్ ఎందుకు సహాయం చేశాడు? వీరిద్దరి మధ్య ఉన్న బంధం ఎలాంటిది? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా.
విశ్లేషణ : ఒక స్టార్ హీరో ని విపరీతంగా అభిమానించే ఒక అభిమాని, అభిమానులను దైవంగా భావించే హీరో కి మధ్య జరిగే కథ ఇది. తన అభిమాని గొప్పతనం తెలుసుకొని, అతని కోసం వెతుక్కుంటూ వచ్చే హీరో పాత్రలో కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర అద్భుతంగా నటించాడు. రామ్ పోతినేని సాగర్ అనే ఒక వీరాభిమానిగా నటించాడు. తను అభిమానించే హీరో కోసం ఎంతవరకైనా వెళ్లే ఒక ఫ్యాన్ బాయ్ సినిమా ఇది. హీరో రామ్ లో అయితే నేటి తరం యువత తమని తాము వెండితెర మీద చూసుకున్నట్టు అనిపించింది. ఫస్ట్ హాఫ్ మొత్తం యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా, ఒక క్యూట్ లవ్ స్టోరీ లాగా ఈ సినిమా సాగిపోతుంది. సెకండ్ హాఫ్ మాత్రం మంచి ఇంటెన్స్ గా, ఎమోషనల్ గా ఉంటుంది. క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ ని చూసి ఆడియన్స్ కి మైండ్ బ్లాక్ అయ్యేంత పని అవుతుంది. హీరోకు, అభిమానికి మధ్య జరిగే కథ కావడంతో జనాలకు కాస్త ఎంటర్టైన్ చేసేలా ఎంతో కొంత డ్రామా ఉండాలి. ఆ డ్రామను దర్శకుడు సరైన విధంగా తెరకెక్కించాడు. ఆంధ్రాకింగ్ ఊహించదగ్గ ఫ్యానిజమ్, లవ్‌స్టోరీ. నిడివి ఎక్కువగా ఉన్నప్పటికీ.. మంచి అనుభూతిని కలిగిస్తుంది. సినిమాలో రామ్ పర్ఫార్మెన్స్ ఆయన కెరీర్లోనే ది బెస్ట్ అని చెప్పొచ్చు. రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే మధ్య కెమిస్ట్రీ టెర్రిఫిక్‌గా ఉంది. దర్శకుడు మహేశ్ మరో మంచి హార్ట్‌ఫుల్ డ్రామాని తెరకెక్కించాడు. రామ్ నటన అదిరిపోయింది. సినిమాలో హీరో పాత్రకి ఉపేంద్రని ఎంపిక చేయడం సరైన నిర్ణయం. ఊహకందేలా ఉన్నప్పటికీ.. చాలా నిజాయితీగా కథను చెప్పారు. ప్రతి హీరో అభిమాని ఈ సినిమాకు కనెక్ట్ అవుతాడు. సెకండాఫ్ అద్భుతంగా ఉంటుంది. ఎమోషనల్ అండ్ ఎంగేజింగ్ తో సాగే సినిమా ఇది. రామ్ తన ఫెర్మార్మెన్స్‌తో అదరగొట్టాడు. డైలాగులు బాగున్నాయి. పాటలు, సెంకడాఫ్ బ్యూటిఫుల్‌గా ఉంది. ఫస్టాఫ్ కాస్త నెమ్మదిగా సాగడం కొంత మైనస్ అయినప్పటికీ ఓవరాల్‌గా సినిమా బాగుందనిపిస్తుంది. మరీ ముఖ్యంగా హీరో ఫాదర్ రోల్‌కు మనం చాలా కనెక్ట్ అయిపోతాం. ఇక ఉపేంద్ర రోల్ అయితే స్టాండౌట్ మూమెంట్. ఆయన స్క్రీన్‌పై కనిపించిన సేపు ఒక మంచి హై ఫీలింగ్ కలుగుతుంది. ఇక విలేజ్ సీన్లతో పాటు టెంపుల్ సీన్ కూడా ఎక్స్ట్రార్డినరీగా ఉంది. ఓ క్యూట్ లవ్ స్టోరీకి హీరోకి, అభిమానికీ మధ్య లింకు పెట్టి కథను రాసుకున్నాడు డైరెక్టర్ మహేష్ బాబు. కథకు అవసరం లేని సన్నివేశాలు, కామెడీ లేకుండా కథపైనే కథనాన్ని సాగించాడు. ఫస్టాఫ్ సోసోగా సాగుతుంది. ఇంటర్వెల్ తర్వాత ఏం జరగబోతుందో చాలా మంది ప్రేక్షకులు ముందుగానే ఊహించగలుగుతారు. అయితే సెకండాఫ్‌లో వచ్చే ఎమోషనల్ సీన్స్ బాగా వర్కవుట్ అయ్యాయి. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తర్వాత మహేష్, మరోసారి గుండెని హత్తుకునే సన్నివేశాలు రాయగలిగాడు. రామ్ పోతినేని, కెరీర్ బెస్ట్ పర్ఫామెన్స్తో దుమ్మురేపాడు. గత కొన్ని సినిమాలుగా ఆయనలో మిస్ అయిన చాక్లెట్ బాయ్ లుక్స్‌ని మళ్లీ పరిచయం చేశాడు ‘ఆంధ్రా కింగ్ తాలూకా’. హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే తన అందంతో మెప్పించింది. రామ్ – భాగ్యశ్రీ మధ్య కెమిస్ట్రీ బాగుంది. హీరో సూర్యకుమార్ క్యారెక్టర్లో ఉపేంద్ర బాగా సెట్ అయ్యారు. రావు రమేష్, మురళీ శర్మ, రాహుల్ రామకృష్ణ, హర్షవర్థన్, రాజీవ్ కనకాల తదితరులు తమ పాత్రల్లో చక్కగా ఒదిగిపోయారు. ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ మూవీకి మరో ప్లస్ పాయింట్ ప్రెష్ మ్యూజిక్. వివేక్ – మెర్విన్ సంగీతం ఇచ్చిన పాటలతో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగా వర్కవుట్ అయ్యింది. సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగా రిచ్‌గా ఉన్నాయి. కొంతమందికి లెంగ్త్ ఎక్కువైనట్టుగా అనిపించినా, ఎమోషనల్‌గా కనెక్ట్ చేయడంలో డైరెక్టర్ పూర్తిగా సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా హీరో కోసం కుటుంబాన్ని, తన సొంత జీవితాన్ని కూడా పట్టించుకోకుండా కొట్టుకునే వెర్రి అభిమానులకు ఈ ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ కచ్ఛితంగా కనెక్ట్ అవుతుంది. దర్శకుడు మహేష్ బాబు ఈ సినిమాను మొదటి సీన్ నుంచే ఆసక్తికరంగా మొదలుపెట్టే ప్రయత్నం చేశారు. సినిమా ప్రథమార్థం మొత్తం ఎంటర్టైనింగ్గా సాగింది. రామ్ పోతినేని తన సహజ సిద్ధమైన ఎనర్జీని మరోసారి తెరపై చూపించారు. మాస్ సినిమాల నుంచి కాస్త విరామం తీసుకొని, మళ్లీ చాలా రోజుల తర్వాత ఒక క్యూట్ చాక్లెట్ బాయ్ లుక్‌లో కనిపించడం ప్రేక్షకులకు నచ్చింది. ఒక హీరోకి అభిమానులు ఎలా ఏర్పడతారు, ఆ అభిమానుల్లో ఉండే తీవ్రమైన ఎమోషన్, హీరో భావాలు అభిమానుల్లో ఎలా ప్రతిబింబిస్తాయి అనే అంశాలను మహేష్ బాబు చక్కగా చూపించే ప్రయత్నం చేశారు. ప్రస్తుత రోజుల్లోని అభిమానులు ఎలా ఉన్నారు అనే పాయింట్‌ను కూడా స్పృశించారు. మొత్తానికి ఫస్టాఫ్ చాలా ఎంగేజింగ్‌గా సాగి, సినిమాపై అంచనాలను పెంచింది. సెకండాఫ్ అయితే, సెకండాఫ్ కి వచ్చేసరికి దర్శకుడు కొంతవరకు డీలా పడ్డారు అనే చెప్పాలి. ద్వితీయార్థంలో కథను నడిపించిన విధానం, హీరోకి-ఫ్యాన్‌కి మధ్య జరిగే సంభాషణలు ఆశించినంత క్యూరియాసిటీని రేకెత్తించలేకపోయాయి. కేవలం ట్రాజెడీని అడ్డం పెట్టుకుని సినిమాను సాగదీసినట్లు అనిపించింది. హీరో-అభిమాని మధ్య ఉండే సంఘర్షణ ప్రధాన కథాంశంగా మొదలైనప్పటికీ, హీరో చిన్నప్పటి కథ పేరుతో ఊరు నేపథ్యాన్ని కథలో ఇరికించినట్లుగా అనిపించింది. క్లైమాక్స్ బాగా డిజైన్ చేసుకున్నప్పటికీ, సెకండాఫ్ మొత్తం డల్‌గా సాగింది. ఫస్టాఫ్ బ్లాక్‌బస్టర్ అయ్యే అవకాశం కనిపించినా, సెకండాఫ్ డల్ కావడంతో సినిమా “ఓకే” అనే రేంజ్‌కే పరిమితమైంది. చాలా కాలం తర్వాత రామ్ మంచి కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రామ్ నటన సినిమాకే హైలైట్ గా చెప్పొచ్చు. మొత్తానికి ఈ సినిమాతో రామ్ పోతినేని మళ్లీ హిట్ ట్రాక్ లోకి వచ్చాడని చెప్పొచ్చు. హీరో రామ్ పోతినేని నటన సినిమాకు పెద్ద ప్లస్ అయింది. గతంలో మాస్ పాత్రల కోసం ప్రయత్నించినప్పుడు అంతగా కనెక్ట్ కాలేకపోయిన ఆయన, ఈ సినిమాలో తన పాత్రలో సహజంగా నటించి మెప్పించారు. ఉపేంద్ర తన పాత్రలో ఒక హీరో ఎమోషన్‌ను పర్ఫెక్ట్గా తెరపై ప్రదర్శించారు. స్క్రీన్ మీద ఆయన ప్రెజెన్స్ అద్భుతంగా ఉంది. తన పాత్రకు నటించే అవకాశం ఎక్కువగా దొరకడంతో.. ఆ పాత్రలో జీవించారు అనే చెప్పాలి. రావు రమేష్ వంటి నటుడు తన పరిధి మేరకు పాత్రలో ఒదిగిపోయి నటించారు. మిగతా నటీనటులు వారి పాత్రలకు న్యాయం చేశారు. ఇక వివేక్ మేర్విన్ అందించిన సంగీతం బాగుంది. పాటలు వినడానికి ఇంపుగా ఉన్నాయి. అలాగే కొన్ని సన్నివేశాల్లో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ హైలెట్ అయింది. విజువల్స్ చాలా బాగున్నాయి. సినిమాకు అవసరమైన షాట్స్‌ను మాత్రమే డిజైన్ చేసి ముందుకు సాగడం నిర్మాణ విలువలను చాటింది. ‘ఈ చిత్రం హీరోకి, అభిమానికి మధ్య ఉండే బంధం ఎలాంటిదో చూపించే ప్రయత్నం చేసింది. ఫస్టాఫ్‌లో ఆసక్తికరంగా సాగి, ఎమోషన్స్‌తో కనెక్ట్ చేసినప్పటికీ, సెకండాఫ్‌లో అనవసరమైన విలేజ్ నేపథ్యాన్ని జోడించడం వలన కథ కాస్త డైల్యూట్ అయింది. అయినప్పటికీ ఫ్యామిలీతో కలిసి ఈ చిత్రాన్ని హాయ్ గా చూసేయొచ్చు.
రేటింగ్ : 3.5/5
