అనసూయ భరద్వాజ్ ఏమి చేసినా వైరల్ అవుతూ ఉంటుంది. ఏదైనా మాట్లాడినా లేక ఫోటో ఏదైనా పెట్టినా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూనే ఉంటాయి. ఇప్పుడు ఆమె తాజాగా తన ఫోటోలు అభిమానుల కోసం తన సామాజిక మాధ్యమంలో షేర్ చేశారు, అవి వైరల్ అవుతూ వున్నాయి. అనసూయ సామాజిక మాధ్యమాల్లో ఎటువంటి ఫోటో పెట్టినా వైరల్ అవుతూనే ఉంటుంది. అందులోకి కొంచెం అందంగా, గ్లామర్ గా వుండే ఫోటోలు పెడితే ఇంకా చెప్పనక్కరలేదు, అవి ఇంకా వైరల్ అవుతాయి. కొన్ని రోజుల క్రితం అనసూయ ఒక బ్యూటీ సలోన్ ప్రారంభోత్సవానికి వెళ్లారు. అక్కడ సలోన్ ఓపెన్ చేసినప్పుడు ఫోటోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆ తరువాత అనసూయ తన ఫోటోలు కూడా కొన్ని తన సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. అవి కూడా ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి. అలాగే ఈమధ్య ఒక యూట్యూబ్ ఛానెల్ కి ఇంటర్వ్యూ కూడా ఇచ్చిన అనసూయ తన సామాజిక మాధ్యమాల్లో ఎందుకు ఏడుస్తున్న వీడియోస్ పెట్టవలసి వచ్చిందో కూడా వివరణ ఇచ్చారు. అలాగే ఈమధ్యనే ఆమె నటించిన ‘రజాకార్’ సినిమా విడుదలై పాజిటివ్ రివ్యూస్ తెచ్చుకుంది. అందులో అనసూయ ఒక పాటలో కనిపించడమే కాకుండా, ఆ తరువాత వచ్చిన ఒక గొప్ప సన్నివేశంలో నటించి మెప్పించింది. ఈ సినిమాలో ఆమె పాత్ర నిడివి చాలా చిన్నదే అయినా అనసూయకి పేరు మాత్రం బాగా వచ్చింది. ఇప్పుడు ‘పుష్ప 2’ సినిమాలో కూడా అనసూయ కనిపించబోతోంది. ఇందులో ఒక నెగటివ్ పాత్రలో అనసూయ కనపడుతుంది. ‘పుష్ప’ మొదటి భాగంలో అనసూయ పాత్ర కన్నా, రెండో పార్టులో ఇంకా ఎక్కువ ఉంటుంది అని అంటున్నారు. సుకుమార్ ఈ సినిమాకి దర్శకుడు, అల్లు అర్జున్ కథానాయకుడు. రష్మిక మందన్న కథానాయిక. ఆగస్టు 15న ఈ సినిమా విడుదలవుతోంది. ఏప్రిల్ 8న కథానాయకుడు అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుండి ఒక టీజర్ వస్తుంది అని ఈ చిత్ర నిర్వాహకులు ప్రకటించారు, ఈ సినిమా కోసం అర్జున్ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ టీజర్ లో ఈ సినిమాలో వున్న మిగతా పాత్రలు అంటే అనసూయ, రావు రమేష్, ఫహద్ ఫాజిల్ లను కూడా చూపెడతారా, లేక ఒక్క అల్లు అర్జున్ నే చూపిస్తారా అనేది ఏప్రిల్ 8న తెలుస్తుంది.
Related posts
-
‘భైరవం’ టీజర్ విడుదల
Spread the love బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మనోజ్ మంచు, నారా రోహిత్ మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ భైరవం ఫస్ట్-లుక్... -
Trisha, Tovino Thomas, Vinay Roy starrer Identity Telugu trailer launched grandly – Film To Be Released in Telugu from 24th January
Spread the love Written & Directed by Akhil Paul, Anas Khan starring Tovino Thomas and Trisha... -
త్రిష, టోవినో థామస్, వినయ్ రాయ్ నటించిన ఐడెంటిటీ తెలుగు ట్రైలర్ లాంచ్ – ఈనెల 24న తెలుగు విడుదల
Spread the love అఖిల్ పాల్, అనాస్ ఖాన్ రచన దర్శకత్వంలో రాజు మల్లియాత్, రాయ్ సిజె నిర్మాతలుగా టోవినో థామస్,...