ఈ రోజు కూడా అన్ని చోట్లా హౌస్ ఫుల్స్ పడుతున్నాయి – థాంక్యూ మీట్లో నటుడు, నిర్మాత, దర్శకుడు త్రినాథరావు నక్కిన
‘అనకాపల్లి’ లాంటి మంచి చిత్రానికి సరైన సంఖ్యలో థియేటర్లు ఇవ్వకపోవడం బాధగా ఉంది – థాంక్యూ మీట్లో నటి ఇంద్రజ
భవ్య శ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్ బ్యానర్ల మీద కాండ్రేగుల నాయుడు, త్రినాథరావు నక్కిన నటిస్తూ, నిర్మించిన రా అండ్ రస్టిక్ చిత్రం ‘అనకాపల్లి’. ఈ మూవీలో విక్రమ్ సహిదేవ్, సంధ్యా వశిష్ట, తారక్ పొన్నప్ప ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకి ఖగేష్ తమ్మినేని దర్శకత్వం వహించారు. కాండ్రేగుల కుమార్ రాజా కో ప్రొడ్యూసర్‌గా చేసిన ఈ మూవీకి త్రినాథరావు నక్కిన కథ, స్క్రీన్ ప్లేని అందించారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 2న విడుదల చేయగా అద్భుతమైన స్పందనతో దూసుకుపోతోంది. ఈ క్రమంలో మంగళవారం నాడు థాంక్యూ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో..
త్రినాథరావు నక్కిన మాట్లాడుతూ .. ‘‘అనకాపల్లి’ సినిమాకి నేను డబ్బులేమీ పెట్టలేదు. నా పేరు పెడితే ఎవరైనా చూసేందుకు వస్తారని అలా పెట్టారు. సోమవారం వరకు రిజల్ట్ కోసం వెయిట్ చేశాను. సోమవారమే కాదు.. ఈ రోజు (మంగళవారం) కూడా మంచి ఫ్లోటింగ్ ఉంది. అన్ని చోట్లా హౌస్ ఫుల్స్ పడుతున్నాయి. సినిమాకు అన్ని వైపుల నుంచి రెస్పాన్స్ వస్తోంది. పర్ఫామెన్స్ పరంగా ఆర్టిస్టులందరికీ మంచి పేరు వస్తోంది. ఈ సినిమాని ఇలానే మరింత ముందుకు తీసుకు వెళ్లాలని మీడియా, ఆడియెన్స్‌ని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ .. ‘‘అనకాపల్లి’ సక్సెస్‌లో పాల్గొనడం ఆనందంగా ఉంది. విక్రమ్ నా కొడుకు అవ్వడం, అతని మీద ఒక సినిమా తీయడానికి త్రినాథ్ రావు గారు, నాయుడు గారు ముందుకు రావడం గొప్ప విషయం. ఇలాంటి చిన్న చిత్రాలకు మీడియానే ముందుండి సపోర్ట్ చేస్తుంది. ‘ఎవడిగోలవాడిదే’ సినిమాని ఫస్ట్ వీక్‌కే తీసేస్తామని అన్నారు. కానీ అదే థియేటర్లో చివరకు సిల్వర్ జూబ్లీ జరిగింది. అలానే ‘అనకాపల్లి’ కూడా గొప్ప విజయాన్ని సాధిస్తుంది. దసరా ధమాకాగా ‘అనకాపల్లి’ నిలుస్తుంది. మండే నైట్ షోలు కూడా ఫుల్స్ అయ్యాయి. నూకాలమ్మ తల్లి ఆశీస్సులతో ‘అనకాపల్లి’ చిత్రం మరింత విజయాన్ని సాధిస్తుందని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
కాండ్రేగుల నాయుడు మాట్లాడుతూ .. ‘త్రినాథరావు నక్కిన గారి మీదున్న నమ్మకంతోనే ‘అనకాపల్లి’ చేశాను. రెండు వందల థియేటర్లలో మా మూవీని రిలీజ్ చేశాం. మేం ఎంతో కష్టపడి ఈ సినిమాని చేశాం. ఇంత మంచి ఆదరణ లభిస్తున్న ఈ సినిమాకి కాకుండా ఇతర భాషల చిత్రాలకు థియేటర్లను ఇస్తున్నారు. మంచి చిత్రాలతో మా లాంటి చిన్న నిర్మాతలు వచ్చినప్పుడు సపోర్ట్ ఇవ్వాలని అందరినీ కోరుకుంటున్నాను. ఈ రోజు కూడా మా సినిమాకి చాలా చోట్ల హౌస్ ఫుల్స్ పడుతున్నాయి. మేం మంచి మూవీని తీశాం. మా చిత్రానికి ఇంకా థియేటర్లు ఇవ్వాలని డిస్ట్రిబ్యూటర్లను కోరుతున్నాను’ అని అన్నారు.
విక్రమ్ సహిదేవ్ మాట్లాడుతూ .. ‘‘అనకాపల్లి’ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తోంది. రివ్యూలన్నీ చదివాను. మా ప్లస్, మైనస్ పాయింట్స్ చెప్పిన అందరికీ థాంక్స్. ఇంకా మా చిత్రానికి థియేటర్లు పెరుగుతున్నాయి. నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన త్రినాథరావు గారికి థాంక్స్. ఇంద్రజ గారి వల్లే ఫ్యామిలీ డ్రామా అంత గొప్పగా వచ్చింది. దేవ్‌జండ్ గారి మ్యూజిక్ అదిరిపోయింది. తారక్ పొన్నప్ప గారితో వర్క్ చేయడం ఆనందంగా ఉంది. సంధ్య వశిష్ట చక్కగా నటించింది. ఈ జర్నీలో మా నిర్మాతలు నాయుడు గారు, రాజా గారు ఫ్యామిలీ మెంబర్లుగా మారిపోయారు. వారితో మున్ముందు కలిసి ప్రయాణించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
నటి ఇంద్రజ మాట్లాడుతూ .. ‘‘అనకాపల్లి’ అసలు సిసలు విజయాన్ని సాధించింది. అందుకే ఈ రోజు ఈ థాంక్యూ మీట్‌కి వచ్చాను. ఇలాంటి మంచి చిత్రానికి సరైన సంఖ్యలో థియేటర్లు ఇవ్వకపోవడం బాధగా ఉంది. చూసిన ప్రతీ ఒక్కరూ సినిమా బాగుందని మెచ్చుకుంటున్నారు. సినిమాలో ఎవరున్నారు? ఎవరు తీశారు అన్నది పట్టించుకోవడం లేదు. బాగుందా? లేదా? నచ్చిందా? లేదా? అన్నది మాత్రమే ఆడియెన్స్ చూస్తున్నారు. మా సినిమాకి మరిన్ని మంచి థియేటర్లు లభిస్తాయని ఆశిస్తున్నాను. ఓటీటీలో కూడా మా మూవీని చూడండి. కానీ అప్పుడు థియేటర్లో చూడలేకపోయామనే ఫీల్ అవుతారు. మా చిత్రం అంత అద్భుతంగా ఉంటుంది’ అని అన్నారు.
సీనియర్ జర్నలిస్ట్ అబ్దుల్ మాట్లాడుతూ .. ‘‘అనకాపల్లి’ ఊహకు భిన్నంగా ఉంటుంది. ఇంటర్వెల్, క్లైమాక్స్ సర్ ప్రైజింగ్‌గా ఉన్నాయి. రొటీన్‌కి భిన్నంగా ఈ చిత్రం సాగుతుంది. విక్రమ్ గొప్పగా నటించాడు’ అని అన్నారు.
సీనియర్ జర్నలిస్ట్ శివ మాట్లాడుతూ .. ‘‘అనకాపల్లి’ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. విక్రమ్ గొప్పగా నటించాడు. శ్రీధర్ గారికి సినిమా పట్ల ఎంతో ప్యాషన్ ఉంది. దర్శకుడు ఈ చిత్రాన్ని గొప్పగా తెరకెక్కించారు. ఇలాంటి గొప్ప చిత్రాలు, మంచి నిర్మాతలు రావాలి’ అని అన్నారు.
