స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా మహిళా కాంగ్రెస్ నేతలు కదం తొక్కాలి..
యాదాద్రి భువనగిరి జిల్లా లో మహిళా కాంగ్రెస్ నేతల సమావేశం
స్థానిక సంస్థల ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా కాంగ్రెస్ కదం తొక్కుతోంది ఈ మేరకు సోమవారం భువనగిరి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కార్యాలయంలోయాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ అధ్యక్షతన మహిళా కాంగ్రెస్ నేతల సమావేశం జరిగిన్చది. ఈ కార్యక్రమానికి జిల్లా ఇంచార్జ్ దివ్య హాజరయ్యారు. ఈ సందర్బంగా జరిగిన సమావేశంలో యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షురాలు నీలం పద్మ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావు గారి ఆదేశాల మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా స్థాయి మరియు మండల .. గ్రామ బ్లాక్.. బూత్ కమిటీలు వేయాలని. పూర్తిస్థాయిలో కార్యవర్గం ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి మహిళకు వివరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలోని ప్రభుత్వం కొత్తగా పది లక్షలకు పైగా రేషన్ కార్డులు అందజేయడంతో పాటు.. సన్నబియ్యంతో పేదల కడుపు నింపుతున్న విషయాన్ని గర్వంగా ప్రచారం చేయాలని మహిళా కాంగ్రెస్ నేతలకు సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించే దిశగా కష్టపడాలని కోరారు. అదేవిధంగా జనాభాలో సగభాగం ఉన్న మహిళలు రాజకీయంగా చాలా వెనుకబడి ఉన్నారని.. స్థానిక సంస్థలలో 50% మహిళా ప్రతినిధులు ఉన్నట్లుగా శాసనసభలో మరియు పార్లమెంటులో 30% శాతం మహిళా సభ్యులు ఉండేట్లు ప్రతి ఒక్కరు పోరాటం చేయాలని చెప్పారు. జిల్లాలో నామినేట్ పదవుల్లో 50% పదవులు మహిళలకు కేటాయించాలని.. మహిళా కాంగ్రెస్ లో కష్టపడ్డ మహిళా నేతలను గుర్తించి స్థానిక సంస్థల ఎన్నికలలో టికెట్ ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో జిల్లా జనరల్ సెక్రెటరీ కవిత, వనజా రెడ్డి, జయ, బ్లాక్ అధ్యక్షురాలు స్వరూప రాణి, మాధవి మండల అధ్యక్షులు, సమావేశంలో పి. రజిత దీప, ఎన్ రేణుక, స్వాతి, అనిత, చింతకిది రేణుక భానుమతి, జ్యోతి, మండల కమిటీలు.. బ్లాక్ కమిటీలు.. పట్టణ కమిటీలు.. బూత్ కమిటీల మెంబర్స్ తదితరులు పాల్గొన్నారు.