అఖిల్ అక్కినేని -జయినాబ్ వివాహం.. ఆనందంతో ఉప్పొంగిన నాగ్-అమల

Akhil Akkineni-Zainab's wedding.. Nag-Amala overjoyed
Spread the love

అక్కినేని నాగార్జున తనయుడు అఖిల్ వివాహం శుక్రవారం ఉదయం జరిగింది. అఖిల్ తన ప్రేయసి జైనాబ్ రావ్జీ మెడలో మూడు ముళ్ళు వేశారు. నాగార్జున ఇంట్లో హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం జరిగింది. తదుపరి కొత్త జంట ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు నాగార్జున. ”మా ఇంటిలో ఉదయం 3:35 గంటల ముహూర్తంలో జైనాబ్ రావ్జీతో మా అబ్బాయి అఖిల్ వివాహం జరిగింది. ఈ విషయాన్ని మీతో పంచుకోవడానికి నేను, అమల ఎంతో సంతోషిస్తున్నాం. మా హృదయాలు ఆనందంతో నిండిపోయాయి.‌ ప్రేమ, ఆప్యాయత, నవ్వులు వెల్లివెరిసిన క్షణాలలో, మాకు దగ్గరైన బంధు మిత్రుల సమక్షంలో ఒక కల నిజం కావడాన్ని మేము చూశాం. ఇవాల్టి నుంచి జీవితంలో నూతన ప్రయాణం ప్రారంభించిన కొత్త జంట ఆశీర్వదించమని కోరుతున్నాం. మీ ప్రేమ, అభిమానం వారిపై ఎప్పుడు ఉండాలి” అని నాగార్జున ట్వీట్ చేశారు. అక్కినేని వారింట పెళ్లి సందడితో పండుగ వాతావరణం నెలకొంది. అఖిల్ వివాహం జయినాబ్ రవడ్జీతో అట్టహాసంగా జరిగింది. ఈ వేడుక కోసం అక్కినేని కుటుంబ సభ్యులు ఎంతో ఉత్సాహంగా వేచి చూశారు. అఖిల్ వివాహ వేడుక శుక్రవారం తెల్లవారుజామున 3.35 నిమిషాలకు జరిగినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఇక ఈ వివాహ వేడుకకు సంబంధించిన పలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా అఖిల్-జయినాబ్ వివాహంపై అక్కినేని నాగార్జున ఓ పోస్ట్ చేశారు. తాను, తన భార్య అమల ఈ క్షణం కోసం ఎంతో ఎదురుచూశామని.. మంచి మనసులు నెలవైన తమ స్వగృహంలో అఖిల్-జయినాబ్ మూడుముళ్ల బంధంతో ఒక్కటి కావడం తమకు అమితమైన సంతోషాన్ని కలిగించిందని.. ఈ కొత్త జంటను అందరూ ఆశీర్వదించండి అని ఆయన కోరారు.

Related posts

Leave a Comment